జగన్‌ను ఆపినట్లే బాబును ఆపారా..? ప్రతీకారమే రాజకీయమా..?

ప్రతిపక్ష నేత చంద్రబాబును రేణిగుంట ఎయిర్ పోర్టులో పోలీసులు నిర్బంధించడం అనేక రకాల చర్చలు.. వాదనలకు కారణం అవుతోంది. అధికార పార్టీ నేతలు.. అభిమానులు..సోషల్ మీడియా కార్యకర్తలు..గతంలో వైజాగ్‌లో జగన్మోహన్ రెడ్డిని ఎయిర్‌పోర్టు నుంచి బయటకు పోనీయని ఘటన గురించి గుర్తు చేసి.. బాగా అయిందని.. టిట్ ఫర్ టాట్ అంటూ ప్రచారం చేస్తున్నారు. ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న వారి మైండ్ సెట్‌కు ఇది బాగా అని అనిపిస్తోంది కానీ.. ప్రజాస్వామ్య రాజకీయం ఆశించేవారికి మాత్రం..ఇదేం ఆలోచన అని.. ఆశ్చర్యపోక తప్పని పరిస్థితి కనిపిస్తోంది.

విశాఖలో జగన్‌ను అడ్డుకున్న సమయంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. ఎలాంటి ఎన్నికలు లేవు. అప్పటికే ఆంక్షలు విధించారు. తర్వాతిరోజు పెట్టుబడుల సదస్సు ఉంది. వీటన్నింటి కారణంగా జగన్ ను పోలీసులు వెనక్కి పంపారు. ఆ సమయంలో జగన్.. ఎయిర్‌పోర్టులో పోలీసులపై వీరంగం సృష్టించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత తనను అడ్డుకున్న పోలీసుల్ని బ్లాక్ లిస్టులో కూడా పెట్టారు. ఇప్పుడు అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబును ఎయిర్ పోర్టుల నుంచి వెనక్కి పంపేలా వ్యవహరిస్తున్నారు. గతంలో విశాఖలో అంతేచేశారు. ఇప్పుడు తిరుపతిలో అంతే చేశారు. రెండు సందర్భాల్లోనూ బయట ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు లేవు. ఆయనరాజకీయ కార్యక్రమాలకు వెళ్తున్నారు. ప్రభుత్వ పరంగా పెట్టుబడుల సదస్సులూ చేయడం లేదు. అయినప్పటికీ.. చంద్రబాబును నిలిపివేసి టిట్ ఫర్ టాట్ అని ప్రచారం చేస్తున్నారు.

ప్రజలు కాదు ప్రతీకారమే రాజకీయం అనుకున్నప్పుడు..ఇలాంటివి సహజంగానే జరుగుతూఉంటాయి. నిజంగా రాజకీయ నాయకులు అయితే.. వైజ్‌గా ఆలోచించి.. గతంలో చంద్రబాబు అలా చేయడం వల్లే ఆయనకు ఘోర పరాజయం ఎదురయిందని.. తాము మరింత డీసెంట్‌గా ఉండాలని ఆనుకుంటారు. కానీ ఆయన కన్నా రెండింతలు ఎక్కువగా చేయడం వల్ల.. తమకు అంత కన్నా ఘోర పరాజయం ఎదురవుతుందని ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని అంచనా వేయలేకపోతున్నారు. ఇక్కడ అధికారం అనే మత్తు వారి కళ్లను కప్పేస్తుందని అనుకోవచ్చు. ఇలాంటి పగ, ప్రతీకారాల కోసం అధికారాన్ని ఉపయోగించుకుంటే.. భవిష్యత్‌లో అవే వారి మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. భవిష్యత్ గురించి ఆలోచించకుండా క్షణిక ఆనందాలకోసం కక్ష రాజకీయాలుచేస్తే నష్టం జరిగేది రాజకీయనాయకులకు మాత్రమే కాదు..రాష్ట్రానికి కూడా..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మ‌హేష్ – రాజ‌మౌళి.. ముందే ‘రుచి’ చూపిస్తారా?

మ‌హేష్ బాబు సినిమా కోసం రాజ‌మౌళి ఎడ‌తెర‌పి లేకుండా క‌ష్ట‌ప‌డుతున్నారు. స్క్రిప్టు ప‌నులు దాదాపుగా కొలిక్కి వ‌చ్చేశాయి. డైలాగ్ వెర్ష‌న్ బాకీ ఉంది. అది కూడా అయిపోతే... ముహూర్తం ఫిక్స్ చేసుకోవొచ్చు. ఏ...

దేశాన్ని బీజేపీ అధోగతి పాలు చేస్తోందా… వాస్తవాలు ఎలా ఉన్నాయంటే..?

విశ్వగురువుగా భారత్ అవతరిస్తోందని బీజేపీ అధినాయకత్వం గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు విరుద్దంగా ఉన్నాయి. అభివృద్ధి సంగతి అటుంచితే ఆహార భద్రత విషయంలో బీజేపీ సర్కార్ వైఫల్యం చెందింది. నిరుద్యోగాన్ని...

కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు.. అందుకే టార్గెట్ చేశారా..?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఇంటి పక్కన క్షుద్రపూజలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. నందినగర్ లో కేసీఆర్ ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉండటంతో అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్రపూజలు చేసినట్లుగా...

వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ‌ ఈ శిరోముండ‌నం కేసు ఏంటీ?

వైసీపీ ఎమ్మెల్సీ, ప్ర‌స్తుత మండ‌పేట తోట త్రిమూర్తులుకు శిక్ష ప‌డ్డ శిరోముండ‌నం కేసు ఏపీలో సంచ‌ల‌నంగా మారింది. 28 సంవ‌త్స‌రాల త‌ర్వాత తీర్పు వెలువ‌డ‌గా... అసలు ఆరోజు ఏం జ‌రిగింది? ఎందుకు ఇంత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close