పీకలమీదకు వచ్చాక హరీష్ గుర్తొచ్చారా..?

హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న పీవీ కుమార్తె వాణిదేవిని గెలిపించడానికి కేసీఆర్.. హరీష్ రావుకు కూడా బాధ్యతలిచ్చారు. చాలాకాలంగా పార్టీలో సైడవుతూ వచ్చిన హరీష్ రావు.. ఇటీవలి కాలం వరకు ఉమ్మడి మెదక్ జిల్లాకే పరిమితం అయ్యారు. పార్టీలోనూ ఎలాంటి ప్రాధాన్యం దక్కడం లేదు. ఆర్థిక మంత్రిగా… పేరుకే ఉన్నారు. ఆయన నిర్వహిస్తున్న విధులు కూడా పెద్దగా లేవు. దుబ్బాక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన పనైపోయిందని అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన అవసరం కేసీఆర్ కు పడింది.అందుకే ప్రగతి భవన్ కు పిలిపించి మరీ కీలక బాధ్యతలిచ్చారు.

టిఆర్ఎస్ కు వరుస ఎన్నికల్లో చేదు అనుభవం ఎదురవుతోంది. బీజేపీ వేగంగా దూసుకు వస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల పై అధికార పక్షంలో ఆందోళన కనిపిస్తోంది. పీఆర్సీ రాక ఉద్యోగులు, నియామకాల పట్ల నిరుద్యోగ యువత ప్రభుత్వం పట్ల అసంతృప్తి తో ఉన్నారు. ఈ ఎన్నికల్లో కూడా ఓడితే పార్టీ మీద తీవ్ర ప్రభావం ఉంటుంది. అందుకే పార్టీకి వ్యతిరేక ఓట్లు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేస్తున్న రంగారెడ్డి జిల్లా బాధ్యతలను హరీష్ రావుకు పిలిచి మరీ అప్పగించారు. కేసీఆర్ చెప్పిన వెంటనే రంగంలోకి దిగిన హరీష్ .. జోరుగా ప్రచారం చేస్తున్నారు. తెరవెనుక వ్యూహాలను కూడా ప్రారంభించారు. ఇతర పక్షాలకు అనుకూలంగా ఉన్నాయనే ఓట్ల లెక్కలు తీసి తమ వైపు తిప్పే పని మొదలు పెట్టారు.

కేసీఆర్ వ్యూహంపై .. టీఆర్‌ఎస్‌లోనూ భిన్నమైన ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపిస్తే ఆ క్రెడిట్ కేసీఆర్ కు పోతుందని.. ఓడిపోతే… హరీష్ ఖాతాలో మరో మైనస్ వేయవచ్చన్న అభిప్రాయాన్ని కల్పిస్తున్నారు. హరీష్ టీఆర్ఎస్‌లో ప్రస్తుతం గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారన్నది నిజం. ఆయనకు మళ్లీ పూర్వ వైభవం వస్తుందా లేకపోతే… ఓటములకు బాధ్యుల్ని చేసే ప్రయత్నం చేస్తున్నారా అన్నది ఎవరికీ అంతు చిక్కని విషయంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close