జగన్ రెండు రోజుల ఢిల్లీ టూర్ డిజాస్టర్..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ టూర్ డిజాస్టర్ గా మారింది. అమిత్ షాతో ఉదయం పదకొండు గంటలకు జగన్ భేటీ అయ్యారని.. దాదాపు నలభై నిమిషాల పాటు చర్చలు జరిపారని… సీఎం తరపున మీడియాకు సమాచారం వచ్చింది. విభజన అంశాలపై నివేదికలు ఇచ్చారని నిధుల విడుదల చేయాలని కోరారని.. చెప్పారు. కానీ అసలు విషయం మాత్రం వేరే అని.. తెలుస్తోంది. ఈ రోజు అమిత్ షా పుట్టిన రోజు. ఆయన వద్దకు పెద్ద ఎత్తున ప్రముఖులు వచ్చారు. శుభాకాంక్షలు తెలిపేవారు అధిక సంఖ్యలో ఉన్నారు. జగన్.. అమిత్ షా ఇంటికి వెళ్లినప్పటికీ.. శాలువా కప్పి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడమే … తప్ప… ఇతర అంశాలు మాట్లాడే అవకాశం రాలేదని… ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. వినతి పత్రం ఇచ్చి బయటకు వచ్చే సరికి.. జగన్ కు మరో షాక్ తగిలింది.

అప్పటికే ఖరారైన ఇద్దరు కేంత్రులు రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషి అపాయింట్‌మెంట్లు కూడా రద్దయ్యాయి. దీంతో జగన్ అసహనంతో తిరుగు ప్రయాణమయ్యారు. రవిశంకర్ ప్రసాద్, ప్రహ్లాద్ జోషీలకు అత్యవసర సమావేశాలేమీ లేకపోయినా… జగన్ అపాయింట్‌మెంట్లు ఖరారు చేసి.. రద్దు చేయడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. జగన్ అక్రమాస్తుల కేసుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు కోసం… పెట్టుకున్న పిటిషన్ పై.. ఒకటో తేదీన సీబీఐ కోర్టు తీర్పు చెప్పనుంది. ఈ క్రమంలో… కేంద్రంలో పెద్దలతో సన్నిహితంగా మెలగడం ద్వారా ఎంతో కొంత అడ్వాంటేజ్ సాధించాలన్న ప్రయత్నం చేశారన్న ప్రచారం ఢిల్లీలో జరిగింది. ఈ కారణంగానే న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అపాయింట్‌మెంట్ రద్దు చేసుకున్నారని చెబుతున్నారు.

మరో వైపు బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి కూడా జగన్ అపాయింట్‌మెంట్ క్యాన్సిల్ పై స్పష్టమైన సూచనలు వచ్చాయంటున్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయడం వల్ల దేశవ్యాప్తంగా పెట్టుబడులు వాతావరణం దెబ్బతిన్నది. మళ్లీ పెట్టుబడిదారులకు విశ్వాసం కల్పించడానికి ప్రభుత్వం తంటాలు పడుతోంది. పీపీఏలు రద్దు చేసిన జగన్… ధర్మల్ పవర్ పెంచుకుంటామని.. అదనపు బొగ్గు ఇవ్వాలంటే జోషిని కలిసి అడగబోతున్నారు. ఇలాంటి వాటిని ప్రోత్సహించినట్లుగా అనిపిస్తే.. ఇబ్బంది ఎదురవుతుందని.. ప్రహ్లాద్ జోషి కూడా క్యాన్సిల్ చేశారని చెబుతున్నారు. మొత్తానికి జగన్ ఢిల్లీ పర్యటన రెండు రోజుల పాటు నిస్సారంగా గడిచింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఓటర్ సర్వే : కేసీఆర్ కన్నా జగన్ పాపులారిటీనే చాలా..చాలా ఎక్కువ..!

తెలంగాణ సీఎం కేసీఆర్ కన్నా... ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డి మోస్ట్ పాపులర్. ఈ విషయాన్ని సీ ఓటర్ సర్వే వెల్లడించింది. లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వాల పనితీరుపై ఈ సంస్థ...

శ్రీవారి దర్శనం రోజుకు ఐదు వేల మందికే..!?

తిరుమల గతంలోలా భక్తులతో కళకళలాడటం సాధ్యమేనా..? ఒక్కో భక్తుని ఆరు అడుగుల సోషల్ డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేస్తూ.. రోజుకు పదివేల మందికి అయినా దర్శనం చేయించగలరా..? లఘు దర్శనం..మహా లఘ దర్శనం...

ఎనిమిదో తేదీ నుంచే అమరావతి రైతుల “మరో పోరాటం”..!

అమరావతి రైతులు తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేయాలని నిర్ణయించుకున్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ...ప్రత్యక్ష ఉద్యమాలకు దూరంగా ఉన్న రైతులు.. మధ్యలో భూముల్ని ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేయాలనుకున్న...

సర్కారు వారి లాయర్లకు పిటిషన్లు వేయడం కూడా రాదా..!?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను తొలగిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో ఏపీ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడంలోనూ తడబడింది. తీర్పు వచ్చిన మూడు రోజుల తర్వాత..స్టే కోరుతూ..సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్...

HOT NEWS

[X] Close
[X] Close