బ‌యోపిక్ రేసులో… పూజా హెగ్డే

బ‌యోపిక్‌ల‌పై మోజు అంత‌కంత‌కు పెరుగుతూనే ఉంది. క‌థానాయిక‌లు సైతం.. ఏదో ఓ బ‌యోపిక్ లో న‌టించి, అవార్డులు కొట్టేద్దాం అనే కాన్సెప్టులో ఆలోచిస్తున్నారు. తాజాగా పూజా హెగ్డే దృష్టి కూడా ఓ బ‌యోపిక్ పై ప‌డింది. ప్ర‌ముఖ బాట్మెంటెన్ క్రీడాకారిణి పివి సింధు క‌థ‌ని సినిమాగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. పివి సింధు పాత్ర కోసం ఓ స్టార్ క‌థానాయిక‌ని అన్వేషిస్తున్నారు. బాట్మెంటెన్‌క్రీడా కారిణికి కావల్సిన శ‌రీర ధారుడ్యంతో పాటు, పివీ సింధు పోలిక‌లు కాస్తో కూస్తో ఉన్న‌వాళ్ల‌కు అడ్వాంటేజ్ ఉంటుంది. కొంత‌మంది బాలీవుడ్ హీరోయిన్లు ఈ పాత్ర కోసం రేసులో ఉన్నారు. ఇప్పుడు ఆ జాబితాలో పూజా హెగ్డే కూడా చేరింది. త‌న‌కు బ‌యోపిక్‌లో న‌టించ‌డం అంటే ఇష్ట‌మ‌ని, పీవీ సింధు పాత్ర త‌న‌కిస్తే… న్యాయం చేయ‌డానికి శాయ‌శ‌క్తులా కృషి చేస్తాన‌ని చెబుతోంది పూజా.

ఇది వ‌ర‌కే కొన్ని బాలీవుడ్ సినిమాల్లో న‌టించిన అనుభ‌వం ఉండడం, సౌత్ లోనూ… పూజా మంచి క్రేజ్ సంపాదించుకోవ‌డం పూజా హెగ్డేకి ప్ల‌స్ పాయింట్స్ గా మిగిలాయి. పూజా ఇప్పుడు `హోస్ ఫుల్ 4`లో న‌టించింది. త్వ‌ర‌లో విడుద‌ల కాబోతున్న ఈ సినిమాపై పూజా చాలా ఆశ‌లు పెట్టుకుంది. ఒక‌వేళ `హోస్ ఫుల్ 4` ప్రేక్ష‌కుల్ని మెప్పిస్తే.. పివి సింధు బ‌యోపిక్ కోసం పూజాకు దారులు తెర‌చుకున్న‌ట్టే. పూజా ఈ బ‌యోపిక్‌లో ఉంటుందా, లేదా? అనేది మ‌రి కొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com