క‌త్తెర ప‌ట్టిన ద‌ర్శ‌కుడు: త‌రుణ్ భాస్క‌ర్‌లో మ‌రో యాంగిల్‌

షార్ట్ ఫిల్మ్స్ నేప‌థ్యం నుంచి వ‌చ్చిన ద‌ర్శ‌కుల‌కు చాలా విభాగాల‌పై ప‌ట్టుంటుంది. కెమెరా, ఎడిటింగ్‌, యాక్టింగ్‌.. ఇలా ఏం కావాలంటే అది చేసేస్తుంటారు. త‌రుణ్ భాస్క‌ర్ కూడా అదే బాప‌తు. త‌ను కూడా షార్ట్ ఫిల్మ్ బ్యాచే. త‌న‌లో ద‌ర్శ‌కుడే కాదు, న‌టుడు కూడా ఉన్నాడ‌ని `ఫ‌ల‌క్‌నుమా దాస్‌` చూస్తే అర్థ‌మైపోయింది. `మీకు మాత్ర‌మే చెప్తా`తో ఏకంగా హీరో అవ‌తార‌మే ఎత్తేశాడు. ఇప్పుడు ఎడిట‌ర్‌గా మారి క‌త్తెర ప‌ట్టాడు. త‌న సినిమా కోసం కాదు. త‌న స్నేహితుల కోసం.

సుజోయ్‌, సుశిల్ ద‌ర్శ‌కత్వం వ‌హించిన సినిమా ‘ప్రెజెర్ కుక్క‌ర్‌’. ఈ సినిమా ఇటీవ‌లే త‌రుణ్ భాస్కర్ చూశాడ‌ట‌. త‌న‌కు చాలా బాగా న‌చ్చింద‌ట‌. అందుకోసం ఈ సినిమా టీజ‌ర్‌ని త‌న వెర్ష‌న్‌లో క‌ట్ చేసి ఇస్తా.. అని ద‌ర్శ‌కుల్ని అడిగాడ‌ట‌. వాళ్లు ఓకే అనేశారు. దాంతో త‌రుణ్ భాస్క‌ర్ ఎడిట‌ర్‌గా కూడా మారి, ఓ టీజ‌ర్ క‌ట్ చేశాడు. అది త్వ‌ర‌లోనే విడుద‌ల కానుంది. ఓ ద‌ర్శ‌కుడు మ‌రో సినిమా టీజ‌ర్ క‌ట్ చేయ‌డం నిజంగా కొత్త విష‌య‌మే. మ‌రి… త‌రుణ్ భాస్క‌ర్ క‌త్తెర క్రియేటివిటీ ఎలా ఉంటుందో తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంగ్లిష్ మీడియం కోసమూ సుప్రీంకోర్టుకు ఏపీ సర్కార్..!

వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీలో ఇంగ్లిష్ మీడియం మాత్రమే ఉండాలనే పట్టుదలను ప్రదర్శిస్తున్న ఏపీ సర్కార్.. సుప్రీంకోర్టు తలుపు తట్టింది. ఇంగ్లీష్ మీడియంపై హైకోర్టు ఆదేశాలను సుప్రీంలో...

కృష్ణా బోర్డు భేటీలో ఎప్పటి వాదనలే.. ఎప్పటి వాటాలే..!

కృష్ణా నద యాజమాన్య బోర్డు భేటీలో ఆరు గంటలు వాదోపవాదాలు చేసుకున్నా..చివరికి మొదటికే వచ్చారు రెండు రాష్ట్రాల అధికారులు. ఇద్దరి వాదనలుక..కేఆర్ఎంబీ బోర్డు.. డీపీఆర్‌లు సమర్పించాలనే సూచనతో ముగింపునిచ్చింది. డీపీఆర్‌లు...

తూచ్.. విజయ్‌ మాల్యాను అప్పగించరట..!

విజయ్ మాల్యాను అప్పగించడం లేదని బ్రిటన్ ప్రభుత్వం తేల్చేసింది. న్యాయపరమైన ప్రక్రియ పూర్తి కాలేదని.. చట్ట లాంచనాలు పూర్తి చేయాల్సి ఉందని అక్కడి ప్రభుత్వం చెబుతోంది. అవి ఏమిటో..ఎప్పుడు పూర్తవుతాయో..మాత్రం చెప్పడం లేదు....

బాల‌య్య ఇంట్లో విందు… చిరు వ‌స్తాడా?

జూన్ 10... బాల‌కృష్ణ పుట్టిన రోజు. ఈసారి పుట్టిన రోజు ప్ర‌త్యేక‌త ఏమిటంటే.. ఇది ఆయ‌న ష‌ష్టి పూర్తి మ‌హోత్స‌వ సంవ‌త్స‌రం. అందుకే ఈ పుట్టిన రోజుని కాస్త ప్ర‌త్యేకంగా జ‌రుపుకోవాల‌ని బాల‌య్య...

HOT NEWS

[X] Close
[X] Close