రవిప్రకాష్ కేసు విచారణపై స్టే..!

టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాష్‌పై పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై.. కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్న చిన్న కేసుల్లో పోలీసులు కస్టడీకి ఎందుకు కోరుతున్నారని ప్రశ్నించింది. పోలీసులు పెట్టిన కేసులకు.. జీవిత కాల శిక్ష పడే అవకాశం ఉందా అని ప్రశ్నించింది. అసలు అధికారిక సమాచారం ఏముందని… కస్టడీకి ఎందుకని.. కోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణపై స్టే విధిస్తూ… ఇరవై నాలుగో తేదీకి కేసును వాయిదా వేసింది. నకిలీ ఈమెయిల్ సృష్టించారని ఆరోపిస్తూ.. పోలీసులు కేసు నమోదు చేశారు. ఓ కేసులో బెయిల్ వస్తుందని.. తెలిసిన వెంటనే… ఈ కేసులో అరెస్ట్ చేశారు. ఇందులోనూ… కస్టడీ కావాలని కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపైనే కోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు.. ఇంత చిన్న చిన్న కేసుల్లో కస్టడీ కోరడమేమిటని కోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. పోలీసులకు ఇందులో ప్రత్యేకమైన ఇంటెన్షన్ ఉందని.. స్పష్టం చేసింది.

కోర్టు ఇలా వ్యాఖ్యానించడం ఇదే మొదటి సారి కాదు. గత వారం.. కూడా ఇదే తరహాలో పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవితాంతం జైల్లో పెడతారా… అని ప్రశ్నించింది. ఓ మనిషిని ఇంతలా హింసించవచ్చా.. అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. అయితే పోలీసులు మాత్రం.. తమ తీరు మార్చుకోలేదు. కచ్చితంగా… జైల్లో ఉంచాలన్న లక్ష్యంతోనే… కేసు మీద కేసు బనాయిస్తూ పోతున్నారు. దానికి సాక్ష్యాలు ఉన్నాయా.. లేవా.. ప్రాథమిక విచారణ చేశారా.. లేదా అన్న విషయాలను పట్టించుకోవడం లేదు. దీంతో.. కోర్టులు కూడా ఉద్దేశపూర్వకంగా… రవిప్రకాష్ ను అరెస్ట్ చేసి జైల్లో ఉంచుతున్నారన్న అభిప్రాయానికి వస్తున్నాయి. అయితే.. పోలీసులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు.

ప్రస్తుత స్పందన చూస్తే ఇరవై నాలుగో తేదీన కోర్టు కీలకమైన రూలింగ్ ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close