ప్ర‌భాస్ బ‌ర్త్‌డే… ఓన్లీ ఫ‌ర్ ఫ్యామిలీ

రేపు (బుధ‌వారం) ప్ర‌భాస్ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా రాధాకృష్ణ సినిమాలోంచి ఓ స్టిల్లో, టీజ‌రో విడుద‌ల చేస్తార‌నుకున్నారు. కానీ అలాంటి బ‌హుమానాలేం ప్ర‌భాస్ అభిమానుల‌కు అంద‌లేదు. రేపు కూడా ఎలాంటి స్పెష‌ల్సూ రావ‌డం లేదు. ఈ సినిమాకి సంబంధించి టైటిల్ కూడా ఇప్ప‌టి వ‌ర‌కూ ప్ర‌క‌టించ‌లేదు. `జాన్‌` అనే పేరు ప‌రిశీల‌న‌లో ఉన్నా, అది ఖ‌రారు కాలేదు. ఆ పేరు మార్చాల‌ని, వేరే కొత్త పేరు ప్ర‌క‌టించాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.

ఇటీవ‌ల ప్ర‌భాస్ లండ‌న్ వెళ్లాడు. అక్క‌డే ప్ర‌భాస్ బ‌ర్త్ డే వేడుక‌లు జ‌రుగుతాయ‌నుకున్నారంతా. కానీ.. ప్ర‌భాస్ హైద‌రాబాద్ తిరిగి వ‌చ్చేశాడు. ఇక్క‌డ కూడా బ‌ర్త్ డే సెల‌బ్రేష‌న్స్ ఏమీ లేవు. బుధ‌వారం త‌న కుటుంబ స‌భ్యుల‌కు మాత్ర‌మే కేటాయించాడ‌ని తెలుస్తోంది. స్నేహితులు, అతి ముఖ్యులతో మాత్ర‌మే ప్ర‌భాస్ గ‌డ‌ప‌బోతున్నాడు. బుధ‌వారం సాయింత్రం ప్ర‌భాస్ త‌న స్నేహితుల‌కు ఓ పార్టీ ఇచ్చే ఏర్పాట్ల‌లో ఉన్నాడు. కొద్ది రోజుల విరామం త‌ర‌వాత రాధా కృష్ణ సినిమా షూటింగ్ మొద‌లైపోతుంది. ఇందుకోసం హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేక‌మైన సెట్ కూడా రూపొందించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పవన్‌ని కలిసి జగన్‌పై విమర్శలు చేసిన బండి సంజయ్..!

తెలుగు రాష్ట్రాల సీఎంలు ప్రజల మధ్య విద్వేషాలు రగిల్చాలని చూస్తున్నారని.. తెలంగాణ బీజేపీ చీఫ్.. బండి సంజయ్ ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో సమవేశమయ్యారు. తెలంగాణలో జనసేనతో కలిసి...

క్రైమ్ : ఒక్క హత్య బయట పడకుండా 9 హత్యలు..! కానీ..

ఒక్క హత్య చేశాడు.. అది ఎక్కడ బయటపడుతుందోనని తొమ్మిది మందిని చంపేశాడు. స్థూలంగా వరంగల్ జిల్లాలోని గొర్రెల కుంట బావిలో బయటపడిన తొమ్మిది మృతదేహాల కథ. ఇందులో నిందితుడు..బాధితులు.. ఎవరూ తెలుగువాళ్లు కాదు....

తూచ్.. శ్రీవారి భూములు అమ్మాలని బోర్డు నిర్ణయం తీసుకోలేదన్న సుబ్బారెడ్డి..!

శ్రీవారి భూములు అమ్మడానికి ఆస్తులు గుర్తించి..రిజిస్ట్రేషన్ అధికారాలను కూడా అధికారులకు కట్టబెట్టేసిన తర్వాత... ఇప్పుడు వివాదం ఏర్పడటంతో.. టీటీడీ బోర్డు చైర్మన్ మాట మార్చారు. భూములు అమ్మడానికి పాలక మండలి నిర్ణయం తీసుకోలేదని...కేవలం...

బీజేపీ తల్చుకుంటే శ్రీవారి ఆస్తుల అమ్మకం నిలిపివేత ఎంత సేపు..!?

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు..శ్రీవారి ఆస్తులను అమ్మకానికి పెట్టిన విషయంపై బీజేపీ భగ్గమని లేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు దీక్షలకు సిద్ధమయ్యారు..తెలంగాణ నేతలు కూడా.. ఊరుకునేది లేదని.. హెచ్చరికలు జారీ చేస్తున్నారు. స్వయంగా......

HOT NEWS

[X] Close
[X] Close