రాజకీయ వ్యూహాల్లో జగనన్న అడుగుజాడల్లో షర్మిల..!

తెలంగాణ రాజకీయ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలన్న లక్ష్యంతో ఉన్న వైఎస్ షర్మిల.. రాజకీయ అడుగుజాడలు మొత్తం అన్న జగన్మోహన్ రెడ్డి నే కాపీ కొడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయాల స్టైల్‌లో దీక్షలు చాలా ముఖ్యం. సొంత పార్టీ పెట్టుకున్న తర్వాత.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన లెక్కలేనన్ని దీక్షలు చేశారు. జలదీక్ష, ఫీజు పోరు, హోదా గోదా.. లాంటి పేర్లతో ఆయన తరచూ దీక్షలు చేసేవారు. భారీ హంగామాతో ఆ దీక్షలు సాగేవి. ఇప్పుడు తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టబోతున్న షర్మిల ముందుగానే రాజకీయ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. అందులో భాగంగా జగనన్న  అడుగుజాడల్లో దీక్షలు చేయబోతున్నారు.  మొదటగా మూడు రోజుల పాటు నిరుద్యోగ సమస్యపై చేయబోతున్నారు. 

తెలంగాణలో ఉద్యోగాలు భర్తీ చేయని ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైఎస్ షర్మిల ఇందిరాపార్క్ వద్ద పదిహేనో తేదీ నుంచి మూడు రోజుల పాటు దీక్ష చేయాలని నిర్ణయించుకున్నారు. దీక్షకు అనుమతి ఇవ్వాలని  షర్మిల టీం సెంట్రల్ జోన్ పోలీసు అధికారులను కలిశారు. మంగళవారం సాయంత్రంలోపు అనుమతిపై నిర్ణయం వెల్లడిస్తామని పోలీసులు వారికి హామీ ఇచ్చారు. మరో వైపు దీక్షకు తెలంగాణలోని ఇతరపార్టీల మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ జన సమితి నేత కోదండరాం,  గద్దర్, ఆర్. కృష్ణయ్య, తీన్మార్ మల్లన్నలను మద్దతు ఇవ్వాలంటూ ఆహ్వానం పంపారు. షర్మిల దీక్షలకు పెద్ద ఎత్తున నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని సమీకరించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 

అయితే షర్మిల సభకు పోలీసులు అనుమతి ఇస్తారా లేదా  దానిపై సస్పెన్స్ ఉంది. కరోనా కారణంగా సభలు.. సమావేశాలు. .. ధర్నాలకు అనుమతి ఇవ్వడంపై సందేహాలున్నాయి. అయితే తెలంగాణ సర్కార్..షర్మిల పార్టీపై వ్యతిరేకత చూపడంలేదు. సాఫ్ట్‌గానే ఉంది. ఆమె సభలు.. సమావేశాలకు అభ్యంతర పెట్టడం లేదు. మామూలుగా ఆంధ్రా ముద్ర వేసి రాళ్లు వేసినా ఆశ్చర్యపోని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అందుకే జగనన్న బాటలో సులువుగా దీక్షలు చేయడానికి షర్మిల రంగం సిద్ధం చేసుకుంటోంది.  

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆహా కోసం రెండు క‌థ‌లు సిద్ధం చేసిన మారుతి

మెగా కుటుంబంతో మారుతికి విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. అల్లు శిరీష్ తో త‌ప్ప‌.. మెగా హీరోలెవ‌రితోనూ సినిమాలు చేయ‌క‌పోయినా మంచి రాపో ఏర్ప‌డింది. అల్లు అర్జున్ కి మారుతి చాలా క్లోజ్‌. అల్లు...

టెన్త్ పరీక్షలు నిర్వహిస్తాం : ఏపీ సర్కార్

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లోకేష్ రాసిన లేఖపై ఏపీ విద్యా మంత్రి సురేష్ పరోక్షంగా స్పందించారు. పరీక్షలు జరిగితీరుతాయని విద్యార్థులు ప్రిపేర్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. షెడ్యూల్...

పవన్ సరే ఆ బాధ్యత అధికార పార్టీకి లేదా..!?

రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది కరెక్ట్ సమయం కాదని .. ముందు కోవిడ్ రోగుల గురించి పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. పవన్ కల్యాణ్ లేఖపై వైసీపీ...

హైకోర్టులో రఘురామరాజుకు షాక్..!

హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు షాక్ తగిలిగింది. తన అరెస్ట్ అక్రమం అంటూ ఆయన తరపు న్యాయవాదులు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. పిటిషన్‌ను డిస్మిస్ చేస్తూ నిర్ణయం తీసుకుంది....

HOT NEWS

[X] Close
[X] Close