శాసనమండలిలో కల్తీ నెయ్యి అంశంపై చర్చ జరగకుండా వైసీపీ ఎస్కేప్ అయింది. చాలా ప్లాన్డ్ గా .. అసలు చర్చ ప్రారంభంలో తామే ముందు మాట్లాడతామని పంతం పట్టి అసలు సభ జరగకుండా చేశారు. వైసీపీకే చెందిన మండలి చైర్మన్ మోషేన్ రాజు ..ఈ అంశంపై తేల్చకుండానే రేపటికి వాయిదా వేశారు. దీంతో కల్తీ నెయ్యి అంశం పక్కకు పోయినట్లయింది.
సాధారణంగా ప్రభుత్వం ప్రకటన చేసిన తర్వాత లఘుచర్చపై చర్చ ప్రారంభమవుతుంది. అయితే ప్రతిపక్షం మొదటగా మాట్లాడాలని బొత్స పట్టుబట్టారు. మండలి చైర్మన్ కూడా.. ప్రతిపక్షం మొదట మాట్లాడాలన్నారు. మంత్రి పయ్యావుల కేశవ్..అసలు వివాదంపై ప్రభుత్వం ప్రకటన చేయకుండా ఎలా చర్చిస్తారని పట్టుబట్టారు. ఇదే సందనుకుని వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేసి సభ వాయిదా పడేలా చేశారు. సభ వాయిదా తర్వాత బొత్స సత్యనారాయణ కల్తీ నెయ్యిపై చర్చించే వరకూ ఆందోళన చేస్తామని గొప్పగా ప్రకటించారు. కానీ మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడిన మోషేన్ రాజు.. రేపటి సభ బిజినెస్ ..రేపటిదేనని స్పష్టం చేశారు. అంటే కల్తీ నెయ్యి పై చర్చ రాదన్నమాట.
ఈ అంశంపై పయ్యావుల కేశవ్ మీడియా పాయింట్ లో మాట్లాడి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ కల్తీ నెయ్యిపై చర్చకు ఆసక్తిగా లేదని పారిపోవడానికి ప్రయత్నించిందన్నారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదని గుర్తు చేశారు. కల్తీ నెయ్యిపై చర్చ జరిగితే అన్నీ బయటకు వస్తాయని బొత్స భయపడుతున్నారు. ముందుగా మాట్లాడే చాన్స్ వస్తే సంబంధం లేని హెరిటేజ్ అంశాన్ని ప్రస్తావించి బురద చల్లేసి.. వాకౌట్ చేయాలనుకున్నారు. కానీ వర్కవుట్ కాలేదు.