టీవీ 5ని బ్యాన్ చేసిన వైసీపీ..! సపోర్ట్ చేయకపోతే అంతేనా…?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీ 5 న్యూస్ చానల్‌పై పార్టీ పరంగా నిషేధం విధించింది. ఆ చానల్ తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలుపుతోందని వైసీపీ ఆరోపిస్తోంది. వార్తా ప్రసారాలు, టీవీ చర్చలు అన్నీ టీడీపీకి అనుకూలంగా ఉంటున్నాయని వైసీపీ ఆరోపిస్తోంది. ఇకపై ఆ చానల్‌ నిర్వహించే చర్చాకార్యక్రమాలకు తమ పార్టీ నేతలు వెళ్లబోరని, అదే సమయంలో ఆ చానల్ కూడా తమ నేతలు ఎవర్నీ ఆహ్వానించవద్దని ఆ పార్టీ విడుదల చేసిన ప్రెస్‌నోట్ లో పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీ 5ను దూరం పెట్టడం మీడియా వర్గాలను ఆశ్చర్యపరిచేదే. ఎందుకంటే 2014కి ముందు ఆ తర్వతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్‌గా సపోర్ట్ చేసిన చానల్ టీవీ 5. గత ఎన్నికలకు ముందు ఎన్ టీవీతో పోటీగా వైసీపీకి సపోర్ట్ చేసింది. ఆ కారణంగా టీడీపీ నేతలు టీవీ 5 పై చాలా సార్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఎన్నికల ఫలితాల తర్వాత మెల్లగా తన విధానం మార్చుకుంది. తెలంగాణలో టీఆర్ఎస్‌తో సన్నిహితంగా వ్యవహరిస్తోంది కానీ వైసీపీతో క్రమంగా దూరం పెంచుకుంది.

ఇటీవలి కాలంలో ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి ఆ చానల్‌లో చేరడంతో ఆ చానల్‌లో వార్తల స్వరూపంలో మౌలికమైన మార్పులు వచ్చాయి. మూర్తి చాలా అగ్రెసివ్‌గా న్యూస్ ప్రజెంట్ చేస్తూంటారు. బీజేపీ ఏపీని మోసం చేసిన విషయాన్ని ఆయన నిర్మొహమాటంగా ప్రజలపై ఉంచుతారు. నేరుగా డిబేట్ లో పాల్గొనేవారిని ఇరుకున పెడతారు. ఇటీవల డేటా చోరీ ఇష్యూలోనూ లాజికల్ పాయింట్లతో చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. అది వైసీపీ నేతలకు నచ్చినట్లు లేదు. అదే సమయంంలో గత ఎన్నికల సమయంలోలా తమకు మద్దతు ఇవ్వాలని వైసీపీకి మద్దతుగా ఓ సర్వేను ప్రసారం చేయాలని వైసీపీ అగ్రనాయకత్వం నుంచి వత్తిడి వచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. దానికి అంగీకరించని కారణంగానే టీవీ 5ని బ్యాన్ చేశారని చెబుతున్నారు. కారణం ఏదైనా టీవీ 5ని టీడీపీ చానళ్ల లిస్టులో చేర్చింది వైసీపీ.

టీవీ 9 విషయంలోనూ కొద్ది రోజులుగా వైసీపీ ఇదే విధానంతో ఉండేది. కానీ ఇటీవలి కాలంలో ఆ చానల్ యాజమాన్యం చేతులు మారింది. దీంతో కాస్త జగన్ కు స్పేస్ దొరుకుతుంది. ఆ చానల్ తన తటస్థ హోదాను నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉంది. గతంలో వైసీపీ ఏబీఎన్ – ఆంధ్రజ్యోతిపై నిషేధం విధించింది. ఆ పార్టీకి చెందిన వారు చానల్ డిబేట్లలో పాల్గొనరు. ఆహ్వానించరు. ఎలా అయినా మీడియాతో మాత్రం… వైసీపీ విరోధం పెంచుకుంటూనే పోతోంది. తమకు అనుకూలంగా వార్తలు ప్రసారం చేయని చానళ్లను టీడీపీ కేటగరిలో నెట్టి.. సంతృప్తి చెందుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close