కెరీర్‌పై పెద్దగా ఆశల్లేని, అవినీతి కేసులు.. ఇతర వ్యవహారాలతో మళ్లీ పోస్టింగ్ దక్కుతుందని ఆశల్లేని పోలీసు అధికారుల్ని పట్టుకుని వైసీపీ కొత్త పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసింది. గతంలో చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వివేకా హత్య కేసులో జగన్ అండ్ కోకు సహకరించిన శంకరయ్య అనే పోలీసు అధికారిని ప్రయోగించారు. ఆ ప్రయోగం రివర్స్ అయింది. అయినా ఈ సారి మెడికల్ లీవులో ఉన్న నాగవరప్రసాద్ అనే డీఎస్పీని తీసుకొచ్చారు.
ఈ నాగవరప్రసాద్.. మెడికల్ లీవులో ఉండి.. పోలీసు యూనిఫాం వేసుకుని తుళ్లూరు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి వైసీపీకి చెందిన చానళ్లు సాక్షి, టీవీ9, ఎన్టీవీలను పిలిపించుకుని.. చంద్రబాబుపై ఫిర్యాదు చేశానని చెప్పుకున్నారు. తిరుమల లడ్డూలో జంతు అవశేషాలు కలిపారంటూ చేసిన ఆరోపణలతో ఈ డీఎస్పీ మనస్తాపం చెందరాట. అందుకే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారాలోకేష్ పాటు కొన్ని టీవీ చానెళ్ల యజమానులపై ఫిర్యాదుచేసినట్లుగా చెప్పుకున్నారు.
ఈ నాగవరప్రసాద్ వ్యవహారం చాలా క్లియర్ గా రాజకీయం అని తేలిపోతోంది. ఆయన ఫిర్యాదు చేస్తాడని వైసీపీ మీడియాకు ముందుగానే సమాచారం ఇచ్చారు. అంటే.. ఆయనను ప్లాన్డ్ గా అక్కడికి పంపించారన్నమాట. ఈ డీఎస్పీని చూస్తే.. మెడికల్ లీవులో ఎందుకున్నారో కానీ.. పోస్టింగ్ రాలేదని.. లేకపోతే అవినీతి కేసులు ఇతర వ్యవహారాలతో.. విచారణ ఎదుర్కొంటున్నట్లుగా కనిపిస్తోంది. రేపు తనపై ఏదైనా చర్యలు తీసుకుంటే ఇలా ఫిర్యాదు చేశాననే చర్యలు తీసుకున్నారని చెప్పుకోవడానికి పనికి వస్తుందని.. అదే సమయంలో రాజకీయంగా అండగా ఉంటామన్న హామీ వైసీపీ నుంచి వచ్చి ఉంటుందని అంచనా వేస్తున్నారు.
కెరీర్ పై ఆశల్లేని ఇలాంటి పోలీసులు, అధికారుల్ని గుర్తించి మరీ వైసీపీ ఇలాంటి నాటకాలు మరిన్ని ప్రారంభించే అవకాశం ఉంది. ఇలాంటి పనులు చేస్తే.. పెద్దగా విచారణ అవసరం లేకుండా డిస్మిస్ చేస్తారని తెలిసి కూడా.. ఇలా చేస్తున్నారంటే.. వైసీపీ నుంచి అంతకు మించిన ఆఫర్లు వస్తున్నాయని సులువుగా అర్థం చేసుకోవచ్చన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
