చేసింది “రంగుల” తప్పు.. సమర్థించుకోవడానికి ఎన్ని తిప్పలో !

రంగుల పిచ్చిలో పడ్డ వైసీపీ నేతలకు కన్నూమిన్నూ కానరావడం లేదు. తిరుపతిలో దేవుడి బొమ్మలను తీసేసి వైసీపీ రంగులు వేసిన వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమయింది. తిరుపతి ప్రజల్లోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. అలిపిరికి వెళ్లే దారిలో వైఎస్ఆర్‌సీపీ రంగుు, ఫ్లెక్సీలతో నింపేశారు. గోడలకు ఉండాల్సిన దేవుడి బొమ్మలు తొలగించి వైఎస్ఆర్‌సీపీ రంగులు వేశారని కొంత మంది మండిపడ్డారు. ఈ వీడియోలు వైరల్ అయింది.

అయితే ఈ ఆరోపణలను వైఎస్ఆర్‌సీపీ ఖండించింది. దేవుడి బొమ్ములు అలాగే ఉన్నాయని.. తెలుగుదేశం పార్టీ నేతలు ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని నాలుగు చోట్ల దేవుడి బొమ్మలున్న వీడియోను ప్రదర్శించింది. అయితే వెంటనే తెలుగుదేశం పార్టీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సమాధానం ఇచ్చింది. కిలోమీటర్ల మేర ఉండే దేవుడి బొమ్మలను తొలగించి.. ఓ నాలుగు బొమ్మలను మాత్రం ఉంచారని.. మిగతా మొత్తం తొలగించారని స్పష్టం చేసింది. ఆ మేరకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

వైఎస్ఆర్‌సీపీ వాదన ఫేక్ అని తేలిపోవడంతో వెంటనే తిరుపతి నగరపాలక సంస్థ కూడా రంగంలోకి దిగింది. అక్కడి బొమ్మలు పాతవైపోయినందున కొత్తగా వేయడానికి రంగులు వేశామని.. అవి మామూలు రంగులేనని వైఎస్ఆర్‌సీపీ రంగులు కాదని కొత్త వాదన తీసుకొచ్చింది. తప్పు చేసి దాన్ని సమర్థించుకునేందుకు తప్పు మీద తప్పు చేస్తున్న వైసీపీ నేతల తీరు జనం అసహ్యించుకోవడం తప్ప ఏమీ చేయలేకపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజకీయాల్లో ఫెయిలయ్యా : పవన్ కల్యాణ్

రాజకీయాల్లో ఫెయిలయ్యానని.. కానీ మళ్లీ పట్టుదలగా ప్రయత్నిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యామ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో చార్టెడ్ అకౌంటెంట్స్ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించడానికి ఆయనకు నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దానికి...

లొంగని వాళ్ల వ్యాపారాల్ని కూల్చలేదా .. మంత్రిగారూ !?

ఏపీ నుంచి పారిశ్రామికవేత్తలు పరారవుతున్న విషయం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది. అయినా సరే చిత్ర, విచిత్ర వితండ వాదాలతో మంత్రులు తెర ముందుకు వస్తూనే ఉంటారు. అమరరాజా పెట్టుబడి తెలంగాణకు తరలి...

ప్లాన్ చేంజ్ .. ఎఫ్ఐఆర్ కాపీలివ్వాలని సీబీఐకి కవిత లేఖ !

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కల్వకుంట్ల కవిత వ్యూహం మార్చినట్లుగా కనిపిస్తోంది. సీబీఐ నుంచి నోటీసు అందగానే... హైదరాబాద్‌లోని తమ ఇంట్లో విచారణకు సిద్ధమని ఆమె ప్రకటించారు. అయితే ఇప్పుడు ఫిర్యాదు...

నిర్మాతగా దశరధ్

సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి క్లాస్ ఎంటర్ ఎంటర్‌టైనర్‌లను అందించి దర్శకుడు కె దశరధ్. అయితే 2016లో మంచు విష్ణుతో చేసిన శౌర్య సినిమా తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకోలేదు. అయితే చాలా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close