శవం కనిపిస్తే చాలు వైసీపీకి.. ఆ పార్టీ అధ్యక్షుడికి ఎక్కడా లేనంత ఊపు వస్తుందని సెటైరిక్‌గా ఏపీలో చెప్పుకుంటారు. ఆ విషయాన్ని వారు పదే పదే నిజం చేస్తున్నారు. తిరుమలలో తొక్కిసలాట జరిగినప్పుడు వారు చేసిన రాజకీయం అందరూ చూశారు. ఆ తర్వాత గోవులు చనిపోకపోయినా చనిపోయాయని చెప్పి చేసిన రచ్చను అందరూ చూశారు. ఇప్పుడు సింహాచలం విషయంలోనూ అదే తంతు.
జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కరోనా సహా ఎన్ని ఘోరాలు జరిగాయో లెక్కే లేదు. విశాఖలో ఎల్జీ కెమికల్స్ తో ఓ భారీ ఉత్పాతమే జరిగింది. అలాంటివి ఎన్నో జరిగాయి. అదంతా జగన్ మహిమే అని వారు చెప్పుకోలేదు… ఇవాళ ఏదైనా ఏపీలో ఏదైనా ఘటన జరిగితే.. చంద్రబాబు వల్లేనని సిగ్గు లేకుండా ప్రకటించుకుంటూ ముందుకు వస్తున్నారు. వైసీపీ పాలనలో చేసిన అవినీతి వల్ల.. ఇప్పుడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. సింహాచలం షాపింగ్ కాంప్లెక్స్ గోడ కూడా.. వైసీపీ పాపమేనని రికార్డులు వెల్లడవుతున్నాయి.
అయితే ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వం తప్పిదం ఉంటే ఖచ్చితంగా ప్రశ్నించాలి. కానీ చంద్రబాబు వల్లేనని ప్రచారం చేయడం ఆ పార్టీ భావదారిద్ర్యానికి నిదర్శనం. అయితే ఆ పార్టీ స్టాండ్ ను ఎవరూ మార్చుకోలేరు. మా శవ రాజకీయాల ఫ్యాన్స్ మాకున్నారని వారు రెచ్చిపోతూనే ఉన్నారు. సింహాచలం ప్రమాదంలో చనిపోయిన ఎనిమిది మంది సాక్షిగా వైసీపీ పది రోజుల పాటు రాజకీయం చేసుకుంటుంది.