వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఊపిరి ఆడటం లేదు. ఐదేళ్ల పాటు శ్రీవారి భక్తులకు కల్తీ నెయ్యితే చేసిన లడ్డూలను అమ్మిన పాపం ఇప్పుడు వారి గొంతుకు అడ్డం పడుతోంది. సీబీఐ సిట్ దర్యాప్దు చేసి తేల్చి కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ తో ఏం చేయాలో తెలియక కిందా మీదా పడుతున్నారు. సజ్జల తనకు అలవాటైన పాత కామెడీతో తెరపైకి వచ్చారు. ఆ సిట్ లో అంతా టీడీపీ మద్దతుదారులే ఉన్నారని చెప్పుకొచ్చారు. తమకు అనుకూలంగా రాకపోతే టీడీపీ మద్దతుదారులు..తమకు అనుకూలంగా వస్తే.. ప్రపంచంలోనే అత్యంత నిజాయితీ స్టేట్ మెంట్ అనేది సజ్జల పాలసీ. అది అన్నిసార్లూ వర్కవుట్ కాదు. ఇప్పుడు అదే జరుగుతోంది.
ఆ సిట్ సుప్రీంకోర్టు నియమించిన బృందం
కల్తీ నెయ్యి వ్యవహారంలో అసలు నిజాలు బయటకు తీస్తూండటంతో.. వైసీపీలో వణుకు ప్రారంభమయింది. ఎందుకంటే ఇప్పుడు ఆ కేసును చూసేది రాష్ట్ర దర్యాప్తు సంస్థలు కాదు. సీబీఐ డైరక్టర్ నేతృత్వంలో నేరుగా సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. అంటే ఆ దర్యాప్తు అధికారులు ఎవరూ రాష్ట్రంలోని పోలీస్ బాస్‌లకు రిపోర్టు చేయరు. నేరుగా కోర్టుకే చేస్తారు. కోర్టు ఈ విషయంలో నిందితుల్ని క్షమించే అవకాశం ఉండదు. అందుకే వైసీపీ కంగారు పడుతోంది. సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి దగ్గర నుంచి భక్తుల్ని మోసం చేసిన అందరూ బాధ్యులవబోతున్నారు. ఆయా నెయ్యి కంపెనీల నుంచి లంచాలుగా తీసుకున్న డబ్బులు సుబ్బారెడ్డికి అందాయని కూడా రికార్డుల ఉన్నాయని సిట్ వర్గాలు చెబుతున్నాయి. అధికారిక ముద్ర కోసం కోర్టు ద్వారా బ్యాంక్ స్టేట్ మెంట్లు తీసుకోబోతున్నారు.
జాతీయ స్థాయిలో వైసీపీని ఛీ కొడుతున్న రాజకీయం
ఒక్క సారి అధికారం ప్రజలు ఇచ్చారని ఏపీని అడ్డగోలుగా దోచుకున్న వ్యవహారం కళ్ల ముందే ఉంది. జగన్ పై ఉన్న కేసులు దేశం మొత్తం హాట్ టాపిక్ గానే ఉంటాయి. ఆయన స్టైల్ ఆఫ్ దోపిడీ ..కేస్ స్టడీలుగానే ఉంటాయి. సీఎంగా లిక్కర్ స్కాం చేసి ప్రజల ఆరోగ్యాన్ని సైతం దోచుకున్న వైనం మర్చిపోలేరు. అయితే అన్నింటికి మించి ఈ కల్తీ నెయ్యి వ్యవహారం ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది. ఎందుకంటే హిందువుల మనోభావాల్ని గాయపర్చే అంశం ఇది. డబ్బుల కోసం కక్కుర్తి పడి కోట్లా మంది భక్తులు ఆరాధించే దేవుడ్ని.. ఆయన భక్తులకు కల్తీ లడ్డూ ఇవ్వడం ఎవరూ సహించరు. అందుకే సజ్జల రామకృష్ణారెడ్డి కంగారు పడిపోతున్నారు. అంబటి రాంబాబుతో ఇంగ్లిష్ లో ట్వీట్లు పెట్టిస్తున్నారు. రోజాతోనూ పెట్టిస్తున్నారు. ఇంకా చాలా మందితో అదే పని చేయిస్తారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో పోయే పరువు… బీజేపీ పెద్దలు కన్నెర్ర చేస్తే.. తమ పరిస్థితి ఏమవుతుందోనని కంగారు పడుతున్నారు.
సుప్రీంకోర్టు సిట్ పై నిందలేసి తప్పించుకోగలరా?
అక్కడ నెయ్యి కల్తీ జరగలేదని.. అదంతా ఫేక్ అని ప్రచారం చేయడం, సుప్రీంకోర్టు సిట్ చంద్రబాబు కనుసన్నల్లో నడుస్తోందని చెప్పడం, న్యాయవ్యవస్థను కూడా చంద్రబాబు ప్రభావితం చేస్తున్నారని ఆరోపించడం.. ఇవన్నీ వైసీపీ ముందు ఉన్న మార్గాలు. ఇవన్నీ పాతవే. గతంలో చీఫ్ జస్టిస్ కావాల్సిన వారిపై తప్పుడు లేఖలు రాసి.. దాన్ని మీడియాకు విడుదల చేసి బురత చల్లేశారు. రేపు సుప్రీంకోర్టు మీద కూడా ఇలాంటి నిందలే వేసినా ఆశ్చర్యం ఉండదు. ఎందుకంటే వైసీపీ నేతల విపరీత మనస్థత్వాన్ని అందరూ చూశారు. చూస్తూనే ఉన్నారు.


