పోల‌వ‌రం క్రెడిట్ కూడా వార‌స‌త్వ ప్ర‌కార‌మే వ‌స్తుందా?

ఓ ప‌క్క పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు జ‌రుగుతుంటే… అడుగ‌డుగునా అవినీతి జరుగుతోందనీ, క‌మిష‌న్ల కోస‌మే క‌డుతున్నారంటూ అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తుంటారు వైకాపా నేత‌లు. కేంద్రం నిధులు ఇవ్వ‌క‌పోయినా, పోల‌వ‌రం విష‌యంలో ఎప్ప‌టిక‌ప్పుడు వివిధ అంశాల‌పై జాప్యం చేస్తున్నా ఒక్క‌రోజైనా కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌రు. కానీ, పోల‌వ‌రం ప్రాజెక్టు క్రెడిట్ మాత్రం వైకాపాకి కావాల‌ట‌..! అదేనండీ.. వైయ‌స్సార్ హ‌యాంలో జ‌రిగిన పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నుల క్రెడిట్ వారసత్వం ప్రకారం త‌మ‌కే ద‌క్కుతుంద‌న్న‌ట్టుగా మాట్లాడుతున్నారు వైకాపా నేతలు.

పోల‌వ‌రం ప్రాజెక్టు వ‌చ్చిందంటే కార‌ణం గ‌త ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి చొర‌వే అన్నారు వైక‌పా అధికార ప్ర‌తినిధిని పార్థ‌సార‌ధి. ఆ మ‌హానేత కుమారుడైన వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పోల‌వ‌రంపై మాట్లాడే హ‌క్కు ఉంద‌నీ, వేరెవ్వ‌రికీ లేద‌ని ఆయన తీర్మానించేశారు! గోదావ‌రిలో నీరంతా స‌ముద్రం పాలౌతుంటే, దాన్ని పంట పొలాల‌కు మ‌ళ్లించాల‌నే ఆలోచ‌న దివంగ‌త నేత వైయ‌స్సార్ కు వ‌చ్చింద‌నీ, ఆయ‌న పుణ్య‌మే పోల‌వ‌రం ప్రాజెక్టు అన్నారు. కానీ, టీడీపీ ప్ర‌భుత్వం గ‌డువులోగా ప్రాజెక్టు పూర్తి చేస్తుంద‌న్న న‌మ్మ‌కం త‌మ‌కు లేద‌నీ, ఒక‌వేళ అలా చేస్తే తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని కూడా స‌వాలు చేశారు. 2017లోగా ప్రాజెక్టు పూర్తిచేస్తామ‌ని చెప్పిన సీఎం చంద్ర‌బాబు నాయుడు, ఆ త‌రువాత మాట మారుస్తూ మారుస్తూ ఇప్పుడు 2019కి తీసుకొచ్చార‌ని ఎద్దేవా చేశారు. జ‌గ‌న్ విష‌య‌మై మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌రావు చేస్తున్న వ్యాఖ్య‌లను ఖండిస్తూ… జ‌గ‌న్ పై కేసులు బ‌నాయించార‌నీ, ఆయ‌న చేస్తున్న‌ది న్యాయ‌ పోరాట‌మ‌ని చెప్పుకొచ్చారు.

వైయ‌స్సార్ కుమారుడిగా జ‌గ‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చారు! కానీ, వైయ‌స్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు జ‌రిగిన అభివృద్ధికీ, ప్ర‌స్తుతం వైకాపా అధ్య‌క్షుడిగా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికీ సంబంధం ఎలా..? తండ్రీ త‌న‌యుల రిలేష‌న్ వేరు! ఒక‌వేళ జ‌గ‌న్ కూడా కాంగ్రెస్ లో ఉండి ఉంటే, వైయ‌స్ పాల‌న క్రెడిట్ కోసం పాకులాడితే అందులో కొంత అర్థం ఉండేది. జగన్ వేరే పార్టీ పెట్టుకున్నారు. కానీ, కాంగ్రెస్ పార్టీ పాలనలో తమ గతాన్ని చూపించే ప్రయత్నం చేస్తారు. అది చాల‌ద‌న్న‌ప్పుడు.. ఇప్పుడు, పోల‌వ‌రంపై మాట్లాడే హ‌క్కు జ‌గ‌న్ కు మాత్ర‌మే ఉందంటూ మాట్లాడ‌టం వితండ‌మే అవుతుంది! హ‌క్కు ఉండ‌ట‌మేంటీ.. బాధ్య‌త అక్క‌ర్లేదా..? ఆ బాధ్య‌త ఉంటే ఇలా మాట్లాడ‌రు క‌దా! ప్రాజెక్టు పూర్త‌య్యేందుకు త‌మవంతు చేయాల్సిన కృషి చేస్తారు. కేంద్రంపై ఒత్తిడి పెంచుతారు. అవేవీ చెయ్య‌కుండా.. ఓప‌క్క ప‌నులు జ‌రుగుతుంటే, వీటిలో అవినీతి జ‌రిగిపోయిందంటూ నిరాధార ఆరోప‌ణ‌లూ, ప‌సలేని ఫిర్యాదులు చేస్తూ వ‌చ్చారు. గ‌త కాంగ్రెస్ ప్ర‌భుత్వ హ‌యాంలో జ‌రిగిన ప‌నుల గురించి ఇప్పుడు వైకాపా ప్ర‌చారం చేసుకునే ప్ర‌య‌త్నంలో ప‌డింది! ఇంత‌కీ, పోల‌వ‌రం ప్రాజెక్టుకీ వైకాపాకీ ఏంటి సంబంధం..?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close