చలో దొనకొండ..! భూములు కొనేస్తున్నారట..!

ఆంధ్రప్రదేశ్ పురపాలక మంత్రి బొత్స సత్యనారాయణ.. ఇలా రాజధాని నిర్మాణం గురించి పునరాలోచిస్తున్నామని ప్రకటించగానే.. అలా…. దొనకొండ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు పరుగులు ప్రారంభించారట. నిజానికి వైసీపీ వచ్చినప్పటి నుండి.. రాజధానిని మారుస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ… అమరావతిని మార్చడం అంత తేలిక కాదనే చర్చ జరిగింది. అందుకే.. కొంత మంది.. వేచి చూస్తున్నారు. కానీ.. ఇప్పుడు… మంత్రి బొత్స ప్రకటన.. విజయసాయిరెడ్డి కూడా.. ముంపు గురించి మాట్లాడుతూండటంతో.. ఓ ప్రణాళిక ప్రకారమే వైసీపీ నేతలు.. ఈ వివాదం రేపారని.. అంతిమంగా.. రాజధాని మార్పుతోనే.. ఈ వ్యవహారం.. ముగుస్తుందని.. నమ్ముతున్నారు. అందుకే.. దొనకొండ దగ్గర భూముల కొనుగోలుకు.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు పరుగులు పెడుతున్నారని అంటున్నారు.

దొనకొండ దగ్గర కావాల్సినంత ప్రభుత్వ భూమి ఉంది. అందులో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం ప్రకారం.. రాజధానికి కావాల్సిన సెక్రటేరియట్, అసెంబ్లీ, రాజ్ భవన్… ఇతర నిర్మాణాలు పూర్తి చేయవచ్చు. రాజధానిని మార్చేయవచ్చు. ఖర్చేమీ ఉండదు. ఆ పని చేయడానికే ఎక్కువ అవకాశం ఉందని.. వైసీపీ నేతలు… ఆ పార్టీతో సన్నిహితంగా ఉండే.. వ్యాపారులు నమ్ముతున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత మంది… ఇప్పుడు.. అనేక మంది.. భూముల లావాదేవీల కోసం… దొనకొండ వైపు చూస్తున్నారు.

కొద్ది రోజులుగా .. దొనకొండలో భూముల కొనుగోళ్లు, అమ్మకాల లావాదేవీలు.. అనూహ్యంగా పెరిగిపోయాయని…వైసీపీకి సన్నిహితంగా ఉండే కొంత మంది వందల ఎకరాల్లోనే కొనుగోలు చేస్తున్నారని… ఆంధ్రజ్యోతి దినపత్రిక బయట పెట్టింది. రాయలసీమ నుంచి… కొంత మంది నేతలు.. ప్రస్తుతం దొనకొండ..ఆ పరిసర ప్రాంతాల్లో మకాం వేశారని అంటున్నారు. మొత్తానికి.. నిర్ణయం తీసుకోని దానిపై చర్చ అనవసరమని.. విజయసాయిరెడ్డి లాంటి నేతలు చెబుతూ ఉన్నా… ఆ పార్టీ నేతలు.. మాత్రం.. నిర్ణయం అయిపోయిందని.. ఎలా.. లాభం చేసుకోవాలా.. అని తీవ్రంగా ఆలోచిస్తున్నారు. భూములు కొనేందుకు… సిద్ధమవుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close