వైసీపీకి, ఆ పార్టీ నేతలకు రాజకీయం ఉంటే చాలు దేవుడంటే భయం, భక్తి కూడా ఉండదు. దేవుడ్ని కించ పర్చడానికైనా రెడీ. తప్పు చేసి అడ్డంగా దొరికిపోయి కల్తీ నెయ్యి వ్యవహారంలో ఘోరమైన తప్పిదానికి పాల్పడుతున్నారు. సిట్ బయటపెట్టిన భయంకర విషయాలను చూసి సిగ్గుతో తలదించుకుని దేవుడికి ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సింది పోయి.. అందులో పశువుల కొవ్వు ఉందని సిట్ చెప్పలేదని వితండ వాదం చేస్తున్నారు. ఇలాంటి మనుషులు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోయేలా చేస్తున్నారు.
నెయ్యి కాని కెమికల్స్ నెయ్యి వాడారని తేల్చిన సిట్
సుప్రీంకోర్టు నియమించిన సిట్ కల్తీ నెయ్యి వాడారని తేల్చింది. ఐదు సంవతర్సాల పాటు తయారు చేసిన ప్రసాదలడ్డూల్లో సగానికిపైగా కల్తీ నెయ్యితోనే తయారు చేశారని నిర్దారించింది. ఎక్కడెక్కడ ఎలాంటి కల్తీ నెయ్యి తీసుకు వచ్చారో ఎవరు దాని వెనుక ఉన్నారో కూడా గుర్తించింది. ఎంతెంత కమిషన్లు తీసుకున్నారో ఎవరి ఖాతాల్లోకి వెళ్లాయో కూడా తేల్చారు. అన్నీ డాక్యుమెంటెడ్ ఆధారాలు. వాటిని పూర్తి దర్యాప్తు పూర్తయిన తర్వాత కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఇప్పటికే అంతా బయటకు వచ్చింది. ఈ ఆధారాలను చూసి వైసీపీ నేతలు సిగ్గుతో తలదించుకోవాలి. దేవుడి భక్తుల విశ్వాసాన్ని దెబ్బకొట్టినందుకు వారికి ఎలాంటి శిక్ష అన్నది దేవుడే ఖరారు చేస్తాడు. కానీ వైసీపీ నేతలు బరి తెగించారు. దేవుడంటే వారికి భయం, భక్తి లేదని వారి అడ్డగోలు సమర్థింపులతోనే తేలిపోయింది.
చంద్రబాబు చెప్పినట్లుగా జంతువుల కొవ్వులేదట!
నేషనల్ డెయిరీ డెలవప్మెంట్ బోర్డు ఇచ్చిన నివేదికను చూపించి చంద్రబాబు అసలు విషయాన్ని బయటపెట్టారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే అత్యన్నత ల్యాబ్ ఎన్డీడీబీ. అలాంటి ల్యాబ్ ఇచ్చిన రిపోర్టులోనే జంతువుల కొవ్వు అవశేషాలు లడ్డూలో ఉన్నాయని గుర్తించారు. అంత కంటే ఏం సాక్ష్యం కావాలి. ఇప్పుడు సిట్ ఎలాంటి నెయ్యి.. ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చారో చెబుతోంది. అంతే కానీ అందులో జంతువుల కొవ్వు ఉందాలేదా అని ల్యాబ్ టెస్టులు చేసి చెప్పడం లేదు. నెయ్యిన కల్తీ చేశారని తేల్చింది. అప్పటి లడ్డూలతోనే ఎన్డీడీబీ టెస్టు చేయించారు. కానీ ఇప్పుడు సిట్.. టెక్నికల్ గా నెయ్యి ఎలా కల్తీ చేశారో తేలుస్తోంది. ఈ రెండింటికి తేడా స్పష్టంగా కనిపిస్తోంది. అయినా వైసీపీ నేతలు అడ్డగోలు వాదనలతో తెరపైకి వస్తున్నారు.
దేవుడనే భయం ఉంటే ఇలా బరి తెగించరు !
పవన్ కల్యాణ్ లడ్డూ కల్తీపై ఆవేదన వ్యక్తం చేస్తే.. అంబటి రాంబాబు వంటి వారి ట్విట్టర్ హ్యాండిల్స్ నుంచి ఇంగ్లిష్లో అడ్డగోలు ప్రకటనలు చేయిస్తూంటారు. తప్పు చేశామన్న భయం ఏ మాత్రం లేకపోగా.. తాము వ్యవస్థలను మేనేజ్ చేసుకుని అయినా బయటపడిపోతామని.. అడ్డగోలు వాదనలు వినిపిస్తున్నారు. వారు చేసిన నిర్వాకానికి దేవుడు శిక్ష ప్రారంభించాడు. దాని ఫలితమే స్కామ్ బయటకు వచ్చింది. ఇప్పటికీ తప్పు తెలుసుకోకుండా.. రాజకీయం చేస్తూ పోతే.. అంతకు మించి శిక్ష అనుభవిస్తారు. అది చట్టం వేసే శిక్ష కాదు.. దేవుడు విధించే శిక్ష.
