వైఎస్ఆర్సీపీకి దేవుడే దిక్కయ్యాడు. అది కూడా హిందూ దేవుళ్లే దిక్కయ్యారు. ఎందుకంటే రాజకీయాలు చేయడానికి. ఎక్కడ ఏ చిన్న అంశం జరిగినా పెద్దవివాదం చేసేందుకు వచ్చేస్తున్నారు. ఆ వివాదంతో హిందువుల్ని తమ వైపు తిప్పుకోవాలని అనుకుంటున్నారేమో కానీ.. వారు దేవుడితో చేస్తున్న రాజకీయమే హైలెట్ అవుతోంది. ఓ క్రిస్టియన్ నేతృత్వంలో ఉన్న పార్టీ హిందువుల్ని.. హిందూ దేవుళ్లను చులకన చేయాలని చూస్తోందన్న ఆరోపణలకు కారణం అవుతోంది. కానీ వైసీపీ నేతలు మాత్రం ఈ విషయాన్ని గుర్తించలేక తమ గుడ్డెద్దు చేలో పడిన తరహా రాజకీయాలు తాము చేసుకుటూ పోతున్నారు.
ద్రాక్షారామం శివలింగం ఘటనపై సిగ్గులేని రాజకీయం
మనుషుల్లో రకరకాల మనస్థత్వాలు ఉన్న వారు ఉంటారు. కోపంతో..కసితో..కక్షతో తాము ఏం చేస్తున్నామో తెలియని స్థితిలో నేరాలు చేసేవారు ఉంటారు. అలాంటి వాడొకడు..ద్రాక్షామంలో శివలింగాన్ని ధ్వంసం చేశాడు. ఓ పూజారిపై కోపంతో .. ఆ శివలింగాన్నిఆ పూజారి రోజూ పూజలు చేస్తాడన్న కారణంతో ఆ శివలింగాన్ని ధ్వంసం చేశాడు. అతను కూడా శివభక్తుడే .కానీ ద్వేషంతో అతని కళ్లు మూసుకుపోయి ఘోరం చేశాడు. దానికి అతను శిక్ష అనుభవిస్తాడు. కానీ ఈ ఘటనతో రాజకీయం చేయాలనుకున్న వైసీపీ .. అంత కంటే పెద్ద తప్పిదం చేసింది. దేవుడికి జరగాల్సిన కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీన్ని రాజకీయం చేయాలనుకుంది.
హిందూ దేవుళ్ల జోలికి వైసీపీ రాకపోవడం మంచిది !
హిందూ దేవుళ్ల విషయంలో వైసీపీ ఎలాంటి జోక్యం చేసుకున్నా అది ఆ పార్టీకి పెను సమస్యగా మారుతుంది. ఆపార్టీ బ్యాక్ గ్రౌండ్ అలాంటిది. ఆ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో టీటీడీని ఎంత భ్రష్టుపట్టించారో మరో ఇరవై ఏళ్ల వరకూ హిందువులు మర్చిపోయారు. ఉద్ధృతంగా సాగిన మత మార్పిళ్లకు జగన్ ప్రభుత్వం ఎలా సహకరించిందో కూడా మర్చిపోరు. వైసీపీ నేతల్లో చాలా మంది హిందువులు ఉంటారు. దేవుడిపై అమితమైన భక్తిని చూపిస్తూ ఉంటారు. కానీ వారే దేవుడిని దోపిడీ చేశారు. హిందూత్వాన్ని కించపరిచారు. ఇలాంటివన్నీ ప్రజల ముందు ఉన్నాయి. వైసీపీ నేతలు ఇప్పుడు తాము హిందూత్వాన్ని కాపాడుతామని.. కూటమి ప్రభుత్వంలో ఏదో జరిగిపోతుదంని వస్తే ప్రజలు నమ్మరు. ఏమైనా చేసినా అది వైసీపీ నేతలే చేసి ఉంటారని అనుమానిస్తారు. వారి ఇమేజ్ అలాంటిది.
దేవుడ్ని ప్రార్థించుకోండి..కానీ రాజకీయం వద్దు !
వైసీపీ నేతలు దేవుడ్ని నమ్ముకోవాలి. ఏ దేవుడ్ని నమ్ముతారో ఆ దేవుడిక్ ప్రార్థనలు చేయాలి. పూజలు చేయాలి. కానీ రాజకీయం చేయకూడదు. వివాదాలు సృష్టించి రాజకీయం చేస్తే మొదటికే మోసం వస్తుంది. ఇప్పటికే వారు దేవుడికి చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. కర్మప్రకారం శిక్షలు అనుభవించాల్సిందే. ఆ శిక్షలు అనుభవిస్తున్నారు కూడా. అందుకే.. ఇప్పటికైనా తెలుసుకుని వైసీపీ నేతలు.. దేవుడిపై కుట్రలు చేయడం.. సంబంధం లేని అంశాలతో హిందూత్వాన్ని కించపరిచేలా చేయడం మానుకుంటే.. దేవుడి ఆగ్రహానికి గురి కాకుండా ఉంటారన్న సలహాలు సొంత పార్టీ నుంచే వస్తున్నాయి.
