పవన్ కు సవాల్ విసిరిన వైకాపా ఎమ్మెల్యే అన్నా రాంబాబు

వైఎస్ఆర్ సీపీ నేత అన్నా రాంబాబు పవన్ కళ్యాణ్ కు సవాల్ విసిరారు. తను గిద్దలూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానని, పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే తన పై పోటీచేయాలని, ఒకవేళ పవన్ కళ్యాణ్ పోటీ చేసి తనపై గెలిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని, ఒకవేళ తాను గెలిస్తే పవన్ కళ్యాణ్ తన రాజకీయ పార్టీని రద్దు చేసుకోవాలని, అన్నా రాంబాబు పవన్ కళ్యాణ్ పై సవాల్ విసిరారు. వివరాల్లోకి వెళితే..

అన్నా రాంబాబు సవాల్ కి నేపథ్యం:

ఇటీవలి కాలంలో రాష్ట్రంలో రాజకీయ ప్రేరేపిత ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వెంగయ్య అనే యువకుడు తమ ఎమ్మెల్యే అయిన అన్నా రాంబాబు ని నియోజకవర్గంలో అద్వానంగా ఉన్న రోడ్ల పరిస్థితి గురించి ప్రశ్నించారు. అయితే ఎమ్మెల్యే ని ప్రశ్నించినప్పుడు, ఆయన వెంగయ్య పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు, దురుసుగా ప్రవర్తించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో ఆమధ్య వైరల్ గా మారింది. అయితే వీడియో అలా వైరల్ గా మారిన రెండు మూడు రోజులకే వెంగయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక వైకాపా నేతలు తీవ్ర స్థాయిలో బెదిరించి ఒత్తిడి చేసి వెంగయ్య ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారు అని జనసేన కార్యకర్తలు నాయకులు ఆరోపించారు. గత ఏడాది మద్యం రేట్లు విపరీతంగా పెంచడం పై జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మరో యువకుడు కూడా ఇదేవిధంగా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా స్థానిక వైఎస్ఆర్ సీపీ నేతల బెదిరింపులు కారణం అని అప్పట్లో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

వెంగయ్య కుటుంబాన్ని పరామర్శించిన పవన్ కళ్యాణ్ , సూచనలు:

అయితే వెంగయ్య కుటుంబాన్ని పవన్ కళ్యాణ్ పరామర్శించారు. తన తరఫున పార్టీ తరఫున జనసేన కు చెందిన ఇతర నాయకుల తరపున నుండి మొత్తంగా దాదాపు ఎనిమిదిన్నర లక్షల దాకా వెంగయ్య కుటుంబానికి అందజేశారు. అయితే ఎంత సాయం చేసినా, పోయిన ప్రాణం తిరిగి తీసుకురాలేము అని, అందుకే జనసైనికులు ఎప్పుడు కూడా ఒంటరిగా వెళ్లి నాయకులను ప్రశ్నించడం చేయవద్దని, కనీసం 40 50 మంది ఒక చోట చేరిన తర్వాతే నాయకులను ప్రశ్నించాలని, అలా గుంపు గా వెళ్ళి ప్రశ్నించినప్పుడు మాత్రమే వైకాపా నేతలు కాస్తయినా భయపడతారని, జనసైనికుల ప్రాణాలు కాపాడుకోవడం తనకు అత్యంత ముఖ్యమైన విషయం అని పవన్ కళ్యాణ్ అన్నారు.

రాంబాబుకి జగన్ అప్పాయింట్ మెంట్ నిరాకరణ, టికెట్ గల్లంతు?

ఒక ఎమ్మెల్యే ని ప్రశ్నించిన యువకుడిని ఆత్మహత్య చేసుకునేలా రాజకీయ పార్టీలు ప్రేరేపిస్తూ వుంటే, ఆ వార్త ని పక్కన పెట్టిన అగ్ర మీడియా చానల్స్, రాజకీయ నాయకుల ఉత్తుత్తి సవాళ్ల ను రోజుల తరబడి చూపిస్తూ కాలక్షేపం చేసింది. మీడియా ఎంతగా దాచిపెట్టినా, సోషల్ మీడియా కారణంగా ఈ వార్త రాష్ట్రమంతా పాకింది. దీని పై వివరణ ఇవ్వడానికి అన్నా రాంబాబు జగన్ అపాయింట్మెంట్ కోరగా, జగన్ అపాయింట్మెంట్ నిరాకరించినట్లు తెలుస్తోంది. గిద్దలూరు నియోజకవర్గం టికెట్ కోసం వైఎస్ఆర్సిపి నుండి ఇతర నాయకులు కూడా ప్రయత్నిస్తూ ఉండడంతో వచ్చే ఎన్నికల్లో అన్నా రాంబాబు కి వైఎస్ఆర్ సిపి తరపున టికెట్ గల్లంతు అయినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇమేజ్ రికవరీ కోసం రాంబాబు సవాల్:

జగన్ అపాయింట్మెంట్ నిరాకరించడం, దాంతోపాటు టికెట్ గల్లంతైనట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతుండడం కారణంగా తన ఇమేజ్ ఘోరంగా డ్యామేజ్ కావడంతో అన్నా రాంబాబు దిద్దుబాటు చర్యలు ప్రారంభించారు. పైగా నియోజకవర్గంలో తన ప్రతిష్ట పూర్తిగా మసకబారటంతో, పవన్ కళ్యాణ్ తన పై ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని సవాల్ విసురుతూ నియోజకవర్గం లో మళ్లీ తన ఇమేజ్ కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు అంటూ విమర్శలు వినిపిస్తున్నాయి.

గతంలో చింతమనేని ప్రభాకర్, వనజాక్షి అనే ఉద్యోగిని కొట్టినప్పుడు, చంద్రబాబు ఎమ్మెల్యే పై చర్యలు తీసుకోవాలని గట్టిగా వాదించిన జగన్ ఇప్పుడు అన్నా రాంబాబు పై ఎటువంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స్టార్‌ మాలో ఆదివారం సందడే సందడి!

ఆదివారం... ఆ రోజుని తలుచుకుంటేనే ఏదో సంతోషం. ఆ రోజు వస్తోందంటే అదో చెప్పలేని ఆనందం. మరి అదే ఆదివారం నాడు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని మూడింతలు పెంచేలా ఏదైనా ఒక ఫ్లాన్‌...

‘గాలి సంప‌త్’ ట్రైల‌ర్‌: ఫ‌.. ఫా.. ఫీ.. ఫో.. అంటే అదిరింది!

త‌న పేరు సంప‌త్‌. నోట్లోంచి గాలి త‌ప్ప మాట రాదు. అందుకే త‌న‌ని గాలి సంప‌త్ అని పిలుస్తారు. త‌న‌కో కొడుకు. త‌న‌కీ కొన్ని ఆశ‌యాలు, ఆశ‌లు, ప్రేమ‌లూ ఉన్నాయి. కానీ.. త‌నకు...

తమిళనాడులో ఈ సారి ఉచితాలకు మించి..!

తమిళనాడు సీఎం పళని స్వామి ఎన్నికలకు ముందుగా ప్రజలకు భారీ తాయిలాలు ప్రకటించారు.అమలు చేస్తారోలేదో తెలియదు కానీ.. అధికారికంగా నిర్ణయాలు తీసేసుకున్నారు. రుణాల మాఫీతో పాటు విద్యార్థులందరూ పరీక్షలు రాయకుండానే పాసయ్యేలా నిర్ణయం...

పెన్షన్ పెంచుకుంటూ పోయేది వచ్చే ఏడాదే..!

పెన్షన్ రూ. మూడు వేలకు పెంచుకుంటూపోతామని జగన్ హామీ ఇవ్వడంతో .. పెన్షనర్లు అంతా ఓట్ల వర్షం కురిపించారు. అయితే 2019 మేలో అధికారం చేపట్టిన జగన్.. రూ.250మాత్రమే పెంచారు. అప్పుడే క్లారిటీ...

HOT NEWS

[X] Close
[X] Close