బీజేపీ మిత్రోం కోసం చెమటోడుస్తున్న వైసీపీ..!

వైసీపీ నేతలు బీజేపీ మిత్రపక్షాల గెలుపు కోసం అవిశ్రాంతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే అది తిరుపతిలో కాదు.. యానాంలో. పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరిలో యానాం కూడా ఓ భాగం. కాకినాడలో కలిసిపోయినట్లుగా ఉండే యానాం నుంచి ఓ ఎమ్మెల్యే పుదుచ్చేరి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంటారు. మల్లాడి కృష్ణారావు అనే ఎమ్మెల్యే ఇప్పటి వరకూ చాలా సార్లు గెలిచారు. ఆయన కాంగ్రెస్ వ్యక్తి. అనూహ్యంగా ఆయన కాంగ్రెస్ కు రాజీనామా చేసి.. ఆ పార్టీ ప్రభుత్వం కూలిపోవడంలో కీలక పాత్ర పోషించడమే కాదు.. తన సీటును.. బీజేపీ మిత్రపక్షానికి త్యాగం చేశాడు. పుదుచ్చేరిలో అన్నాడీఎంకే, బీజేపీ, రంగస్వామి పార్టీ కలిసి పోటీ చేస్తున్నాయి.

రంగస్వామి మాజీ ముఖ్యమంత్రి. ఆయనే కూటమికి ముఖ్యమంత్రి అభ్యర్థి కూడా. ఇప్పుడు ఆయన ఇతర చోట్ల పోటీ చేస్తే గెలుస్తారో లేదో అనుకున్నారో కానీ.. యానాంకు తీసుకు వచ్చి .. అక్కడ పోటీ చేయిస్తున్నారు. వరుసగా గెలుస్తూ వస్తున్న మల్లాడి కృష్ణారావు తన సీటును త్యాగం చేశారు. అంత వరకూ బాగానే ఉన్నా… ఇప్పుడు రంగస్వామి గెలుపు కోసం.. వైసీపీ నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మంత్రులంతా అక్కడే మకాం వేశారు. సభలు.. సమావేశాలు పెట్టి రంగస్వామికి మద్దతివ్వాలని ప్రచారం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్థిక సాయం కూడా చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు.. ఏపీలో చర్చనీయాంశం అవుతోంది.

ఓ వైపు తిరుపతిలో బీజేపీకి వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు.. రకరకాల వ్యతిరేక ప్రకటనలు చేస్తున్నారు.. సోషల్ మీడియాలో ఆగర్భ శత్రువులు అన్నట్లుగా తిట్టుకుంటున్నారు. కానీ.. పుదుచ్చేరిలో బీజేపీ సర్కార్ ఏర్పడటానికి వైసీపీ తెర వెనుకే కాదు.. తెర ముందు కూడా ప్రయత్నాలు చేస్తోంది. ఈ దోస్తీ ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఎప్పట్లాగే… సైలెంట్‌గా పని చేసుకుపోతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పోలీసులు కొట్టారని RRR ఫిర్యాదు, పోలీసుల పై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రాన్ని కరోనా వైరస్ అతలాకుతలం చేస్తుంటే, అదే సమయంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ని జగన్ రెడ్డి సర్కార్ అరెస్టు చేయడం రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపుతోంది. విపక్షాలు మొదలుకొని సామాజిక వర్గ...

ఆహా కోసం రెండు క‌థ‌లు సిద్ధం చేసిన మారుతి

మెగా కుటుంబంతో మారుతికి విడ‌దీయ‌రాని అనుబంధం ఉంది. అల్లు శిరీష్ తో త‌ప్ప‌.. మెగా హీరోలెవ‌రితోనూ సినిమాలు చేయ‌క‌పోయినా మంచి రాపో ఏర్ప‌డింది. అల్లు అర్జున్ కి మారుతి చాలా క్లోజ్‌. అల్లు...

టెన్త్ పరీక్షలు నిర్వహిస్తాం : ఏపీ సర్కార్

పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ ముఖ్యమంత్రి జగన్‌కు లోకేష్ రాసిన లేఖపై ఏపీ విద్యా మంత్రి సురేష్ పరోక్షంగా స్పందించారు. పరీక్షలు జరిగితీరుతాయని విద్యార్థులు ప్రిపేర్ కావాలని ఆయన పిలుపునిచ్చారు. షెడ్యూల్...

పవన్ సరే ఆ బాధ్యత అధికార పార్టీకి లేదా..!?

రఘురామకృష్ణరాజును అరెస్ట్ చేయడంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఇది కరెక్ట్ సమయం కాదని .. ముందు కోవిడ్ రోగుల గురించి పట్టించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. పవన్ కల్యాణ్ లేఖపై వైసీపీ...

HOT NEWS

[X] Close
[X] Close