సుభాష్ : గాలి వాటానికి గెలుపొస్తుందా..? వైసీపీ ఈ లాజిక్ ఎలా మిస్సయింది..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. గెలిచేస్తున్నామని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని… ప్రమాణస్వీకారాన్ని, మంత్రి వర్గ స్వరూపాన్ని… ఇంకా చెప్పాలంటే.. గ్రామస్థాయిలో.. తమకు ఎక్కడెక్కడ ఆదాయాన్ని తెచ్చి పెడతాయో.. అలాంటి వాటినన్నింటినీ మార్కింగ్ చేసుకుంటున్నారు. ఇక.. జగన్‌ను తానే నడిపిస్తున్నానని.. గాల్లో తేలిపోయే.. విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు అయితే.. ఇప్పుడే అధికారం చేపట్టేశామని.. ఊహాల్లో తేలిపోతూ.. ప్రభుత్వ విధుల్ని కూడా ప్రశ్నించడం మొదలు పెట్టారు.

గెలుస్తున్నామని అరిస్తే గెలుపొస్తుందా..?

పోలింగ్ ముగిసిన మరుసటి రోజు నుంచి గెలుస్తున్నాం.. గెలుస్తున్నాం.. అని వైసీపీ నేతలు హడావుడి పడిపోతున్నారు కానీ.. క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేసుకోవడంలో విఫలమయ్యారు. ఇప్పటి వరకూ.. కనీసం… పోలింగ్ సరళి ఏమిటి.. ? వైసీపీ పట్ల సానుకూలత ఉందా..? వ్యతిరేకత ఉందా..? అన్న సమీక్షలే లేవు. అధినేత సినిమాలు చూసుకుంటూ… విదేశీ టూర్లకు వెళ్లే ప్లాన్లు వేసుకుంటూంటే.. ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం… ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తాము ఎక్కడెక్కడ కలెక్షన్లు చేయాలో.. లెక్కలేసుకునే పనిలో ఉన్నారు. అధికారులను బెదిరిస్తున్నారు. ఢిల్లీ స్థాయి అండతో.. ఇప్పుడు.. అప్పుడే అధికారం అనుభవిస్తున్నట్లు ఊహించేసుకుంటున్నారు. కానీ.. ఇలా చేస్తే.. ఈవీఎంలలో లెక్కలు మారిపోతాయా…? వైసీపీ నేతలు… తాము గెలిచేస్తున్నామని.. హడావుడి చేస్తున్నారు కాబట్టి.. ఈవీఎంలలో.. కూడా అదే ఫలితం వచ్చేస్తుందా..?

పనితీరుపై కనీస సమీక్ష లేకుండా ఫలితం వస్తుందా..?

గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు అంటే రెండు శాతం ఓట్లతో అధికారాన్ని కోల్పోయింది. ఆ విషయం.. జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతూంటారు. మరి అలాంటప్పుడు.. ఏం చేయాలి..? ఆ రెండు శాతం ప్రజల మద్దతు పొందడానికి చేయగలగినంత చేయాలి. ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయో.. విశ్లేషించుకుని దిద్దుకునే ప్రయత్నం చేయాలి. కానీ.. వైసీపీలో ఎప్పుడూ.. అలాంటి ప్రక్రియే లేదు. మూడేళ్ల నుంచి వైసీపీ గెలుస్తుందని.. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందనే ప్రచారం మొదలు పెట్టారు. ఆ వ్యతిరేకత కారణంగా.. నంద్యాల ఉపఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నామని హడావుడి చేశారు. పార్టీకి అండగా నిలిచే సామాజికవర్గాలు పెద్ద ఎత్తున ఉన్నా… జగన్మోహన్ రెడ్డి ఏకంగా పదిహేను రోజుల పాటు నంద్యాలలో మకాం వేసి ప్రచారం చేసినా… ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత ప్రజల్లో కనిపించలేదు. డబ్బులు పంచారని.. ప్రభుత్వ పథకాలు పొందేవారిని బెదిరించారని… కారణాలు చెప్పుకుని సంతృప్తి పడిపోయారు కానీ.. అసలు.. క్షేత్ర స్థాయిలో ఏం జరిగిందో మాత్రం.. కనీసం అంచనా వేసుకునే ప్రయత్నం చేయలేదు. ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకునే ప్రయత్నం చేయకపోగా.. అసలు ఎన్నికలు వచ్చే సరికి అదే తప్పు చేశారు.

గతంలో పోలిస్తే ఓ వర్గం మద్దతు పొందగలిరారు..?

రాజకీయాల్లో ఓటు బ్యాంకులు కీలకం. ప్రధాన పార్టీలకు కచ్చితమైన ఓటు బ్యాంక్ ఉంటుంది. తటస్థంగా ఉండే.. మూడు లేదా నాలుగు శాతం ఓట్లే కీలక పాత్ర పోషిస్తాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత తటస్థ ఓటర్లను ఎలా ఆకట్టుకోవాలో.. వైసీపీ ఒక్క సమీక్ష కూడా చేసుకోలేదు. నంద్యాల ఎన్నికల తర్వాత కూడా కళ్లు తెరవలేదు. కానీ.. ఎన్నో.. వ్యూహాత్మక తప్పిదాలు చేస్తున్నారు. తన కోర్ ఓటు బ్యాంక్ అయిన… వర్గాల ఓట్లను దూరం చేసుకున్నారు. బీజేపీతో సఖ్యతగా మెలిగి.. ముస్లిం ఓటర్లను… కనీసం నలభై శాతం దూరం చేసుకున్నారని… విశ్లేషణల్లో తేలుతోంది. అలాగే గత ఎన్నికల్లో ఏకపక్షంగా అండగా ఉన్న దళిత, గిరిజన వర్గాల్లోనూ… కనీసం ఇరవై శాతం మార్పు కనిపించిందని.. లెక్కలు చెబుతున్నాయి. ఒక్క రెడ్డి సామాజికవర్గం మాత్రం పూర్తి స్థాయిలో వైసీపీకి పని చేసింది. మిగతా… వర్గాల్లో అంతో ఇంతో మద్దతు కోల్పోయారు. మరి కొత్తగా ఎవరి మద్దతు అయినా సంపాదించారా.. అంటే…అసలు అలాంటి ప్రయత్నమే జరగలేదు. ఓ సామాజికవర్గాన్ని టార్గెట్ చేసి… ముందుగానే… ఓ రకమైన భయానకవాతావరణం సృష్టించారు. ఆ తర్వాత వివిధ రకాల కుల రాజకీయాలతో… ప్రజల్లో ఓ రకమైన వ్యతిరేకత తెచ్చుకున్నారు. ఏ వర్గం మద్దతూ కొత్తగా పొందలేకపోయినా.. గెలుస్తామని మాత్రం మాత్రం బిగ్గరగా అరుస్తూ… హంగామా చేసేస్తున్నారు.

నవ్వే వాళ్ల ముందు జారిపడాలని ప్రాక్టీస్ చేస్తున్నారా..?

చంద్రబాబుపై వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేక గాలే.. తనను గెలిపిస్తుందని.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిందాస్‌గా ఉన్నట్లుగా కనిపిస్తోంది. అంటే.. చంద్రబాబే గెలిపిస్తారని ఆయన జగన్ అనుకుంటున్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎన్నికల ప్రచారం చివరికి వచ్చే సరికి జగన్మోహన్ రెడ్డికి తేడా తెలిసిపోయింది. అందుకే ఒక్క చాన్స్ అంటూ… విజ్ఞప్తులకు వచ్చారు. ఇప్పుడా విషయాన్ని మర్చిపోయి.. ప్రజల తీర్పును.. తమకు అనుకూలంగా ఊహించుకుని… ప్రభుత్వ ఏర్పాటు కలల్లో ఉండిపోయారు. ఇది… నవ్వోటళ్ల ముందు జారిపడేలా ప్రాక్టీస్ చేసుకోవడం అన్నట్లుగానే ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close