చెప్పేదీ వాళ్లే…ప్రశ్నించేది వాళ్లే…!

ఏపీలో రాజధాని ప్రహసనం రసవత్తరంగా సాగుతోంది. ప్రతిపక్షాలన్నీ రాజధాని తరలించవద్దనే ఒకే డిమాండ్‌ చేస్తున్నాయి. కాని వైకాపా నాయకులు, మంత్రులు మాత్రం రాజధాని వివాదాన్ని ఎంత పెద్దగా చేయాలో అంత పెద్దగా చేస్తున్నారు. మరో మాటలో చెప్పాలంటే పీకి పాకం పెడుతున్నారు. నానా కంగాళీ చేస్తున్నారు. ప్రభుత్వం పోలీసు రాజ్యం నడుపుతోంది. ముఖ్యమంత్రి జగన్‌ ఒక్క మాటా మాట్లాడకుండా నాయకులతో, మంత్రులతో కథ నడిపిస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానులంటూ ప్రచారం చేస్తున్నా అసలు రాజధాని విశాఖపట్టణం అనే సంగతి బహిరంగ రహస్యమే.

రాజధాని తరలింపు రహస్యంగా జరగడంలేదు. అలా జరిగేందుకు అవకాశం కూడా లేదు. నెల రోజులకు పైగా జరిగాల్సిన పనులన్నీ చకచకా జరిగిపోతున్నాయి. అంతా కళ్ల ఎదురుగా కనిపిస్తూనే ఉంది. రాజధానిని తరలిస్తున్నట్లు చాలాకాలం నుంచి వైకాపా నాయకులు, మంత్రులు బహిరంగంగా చెబుతూనే ఉన్నారు. కొందరు ‘విశాఖపట్టణమే రాజధాని. ఏం చేసుకుంటారో చేసుకోండి’ అన్నారు. రాజధాని తరలింపు ఎట్టి పరిస్థితిలోనూ ఆగదన్నారు. రాజధాని తరలింపుపై ప్రజల ఆందోళన, వ్యతిరేకత ఎక్కువ అవుతున్నకొద్దీ వైకాపా నాయకులు అంతగా రెచ్చిపోయి ప్రకటనలు, ప్రసంగాలు చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా ఉంచడం సాధ్యం కాదని జీఎన్‌రావు, బీసీజీ కమిటీల ద్వారా చెప్పించింది ప్రభుత్వం.

తాజాగా చెన్నయ్‌ ఐఐటీ వారు అమరావతి మీద పరిశోధన చేసి అది రాజధానిగా పనికిరాదని తేల్చారని ‘సాక్ష’ పత్రిక బ్యానర్‌ కథనం ప్రచురించింది. విశాఖపట్టణం రాజధాని కావడం తథ్యం. అందులో సందేహం లేదు. వంద శాతం విశాఖే రాజధాని అని వైకాపా నాయకుంతా కోళ్లై కూస్తున్నారు. పరిస్థితి ఇలా ఉండగా, వైకాపా నాయకులే విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ‘అసలు అమరావతి నుంచి రాజధాని తరలిపోతుందని మీకు ఎవరు చెప్పారు?’ అని ప్రశ్నిస్తున్నారు. ‘ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారా?’ అని అడుగుతున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ అసెంబ్లీ సమావేశాల చివరి రోజున ‘మూడు రాజధానులు ఉండొచ్చు’ అని అన్నారు. ఇదో ఆలోచనగా చెప్పారు.

కాని అది ఆలోచన కాదని, నిర్ణయమేనని తెల్లవారి నుంచే అర్థమైపోయింది. ఆ రోజు తరువాత జగన్‌ ఇప్పటివరకు మాట్లాడలేదు. మొత్తం కథ వైకాపా నాయకులే నడిపిస్తున్నారు. ఎమ్మెల్యే అదీప్‌ రాజ్‌ ‘రాజధాని తరలిస్తున్నారని మీకు ఎవరు చెప్పారు?’ అని ప్రశ్నించి ‘రాజధాని తరలించడంలేదు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తున్నారు. అంతే’ అన్నాడు. ఏపీఐఐసి ఛైర్‌పర్సన్‌ రోజా కూడా ఈమధ్య రాజధాని తరలిస్తున్నట్లు ఎవరు చెప్పారంటూ ప్రశ్నించింది.

అమరావతి రాజధానిగా ఉంటుందని చెబుతూనే దాన్ని రాజధానిగా నిర్మించాలంటే లక్షా పది వేల కోట్లు కావాలంటున్నారు. అసలు వైకాపా నాయకులు ఏం మాట్లాడుతున్నారో అర్థంకావడంలేదు. రాజధాని విషయాన్ని పీకి పాకం పెడుతున్నారు. ఏది రాజధాని అనేది ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకముందే వైకాపా నాయకులు ప్రకటించేశారు. అలాంటప్పుడు రాజధాని మారుతుందని మీకు ఎవరు చెప్పారు అంటూ ప్రశ్నించడం అనవసరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాజారెడ్డి రాజ్యాంగంలో అది హత్యాయత్నమే!

సాక్షి పేపర్ రాతల్ని పోలీసులు యథావిథిగా రిమాండ్ రిపోర్టుగా రాసి.. ఓ బీసీ మైనల్ బాలుడ్ని మరో కోడికత్తి కేసు శీనులా బలి చేయడానికి రెడీ అయిపోయారు. రాయితో దాడి చేశారో లేదో...

క‌విత అరెస్ట్… కేసీఆర్ చెప్పిన స్టోరీ బానే ఉందా?

త‌న కూతురు, ఎమ్మెల్సీ క‌విత అరెస్ట్ పై ఇంత‌వ‌ర‌కు కేసీఆర్ ఎక్క‌డా స్పందించ‌లేదు. ఈడీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న క‌విత‌ను చూసేందుకూ వెళ్లలేదు. ఫైన‌ల్ గా బీఆర్ఎస్ నేత‌ల...

రానాతోనే ‘లీడ‌ర్ 2’: శేఖ‌ర్ క‌మ్ముల‌

శేఖ‌ర్ క‌మ్ముల సినిమాలో హిట్లూ, సూప‌ర్ హిట్లూ ఉన్నాయి. అయితే సీక్వెల్ చేయ‌ద‌గిన స‌బ్జెక్ట్ మాత్రం 'లీడ‌ర్‌' మాత్ర‌మే. ఈ సినిమాని కొన‌సాగిస్తే బాగుంటుంద‌ని రానా చాలాసార్లు చెప్పాడు. ఇప్పుడు శేఖ‌ర్ క‌మ్ముల...

విజ‌య్ దేవ‌ర‌కొండ.. త్రివిక్ర‌మ్‌.. అలా మిస్స‌య్యారు!

'గుంటూరు కారం' త‌ర‌వాత త్రివిక్ర‌మ్ త‌దుప‌రి సినిమా విష‌యంలో క్లారిటీ రాలేదు. ఆయ‌న అల్లు అర్జున్ కోసం ఎదురు చూస్తున్నారు. బ‌న్నీ ఏమో.. అట్లీ వైపు చూస్తున్నాడు. బ‌న్నీతో సినిమా ఆల‌స్య‌మైతే ఏం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close