స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచనే లేదని ఏపీ మంత్రి గౌతం రెడ్డి తేల్చి చెప్పేశారు. మామూలుగా ఇలాంటి అంశాలపై గౌతంరెడ్డి పెద్దగా స్పందించారు. ఎందుకంటే… ఎన్నికలు గౌతం రెడ్డి శాఖ కాదు. కానీ అనూహ్యంగా విధానపరమైన నిర్ణయాన్ని ప్రకటించేశారు. స్థానిక సంస్థల ఎన్నికలను.. నిర్వహించే ఆలోచన ప్రస్తుతం లేదని నిర్మోహమాటంగా చెప్పేశారు దీనికి కారణంగా ఆయన కరోనానే చూపిస్తున్నారు. కరోనా తగ్గిందని.. స్కూళ్లు కూడా ప్రారంభిస్తున్నారు కదా.. అని అందరూ అడుగుతారని ఆయనకు క్లారిటీ ఉంది. అందుకే.. నవంబర్, డిసెంబర్‌లో మరోసారి.. కరోనా వ్యాప్తి జరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారని అంటున్నారు.
దసరా తర్వాత సెకెండ్ వేవ్ ఉంటుందని ఆరోగ్య శాస్త్రవేత్తలు చెబుతున్నారని అంటున్నారు. పార్టీలో పై స్థాయి నుంచి సూచనలు రాకపోతే.. ఎన్నికలపై గౌతం స్పందించే అవకాశం లేదు. నిజానికి ప్రభుత్వం నేరుగా హైకోర్టుకే … ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధంగా లేమని.. తెలిపింది. అయితే హైకోర్టు.. ఎస్‌ఈసీకి తెలియచేయమని చెప్పింది. ఎస్‌ఈసీ రాజకీయ పార్టీలతో సమావేశం అవుతున్నారు. ఈ తరుణంలో గౌతం రెడ్డి ప్రకటన ప్రభూత్వ అభిప్రాయాన్ని మరోసారి బయట పెట్టినట్లయింది.
అయితే ఎన్నికల నిర్వహణ అనేది ఎస్‌ఈసీ పరిధిలోని అంశం. ఆయన తేదీలు ఖరారు చేస్తే.. దాని ప్రకారం జరగాల్సిందే. అధికార యంత్రాంగం సహకరించాల్సిందే. లేకపోతే రాజ్యాంగ ఉల్లంఘన అవుతుంది. అందుకే.. రమేష్ కుమార్ పదవీ కాలం పూర్తయ్యే వరకు అసలు ఎన్నికలు నిర్వహించకపోతే చాలని ప్రభుత్వం అనుకుంటోంది. దాడులు.. దౌర్జన్యాలతో చేసుకున్న ఏకగ్రీవాలను.. ఎస్‌ఈసీ రద్దు చేస్తారనే ఆందోళతోనే … ఏపీ ప్రభుత్వం ఎన్నికల నిర్వహణకు సహకరించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కానీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకునే పరిస్థితిలో లేదు.