క్వారంటైన్‌కు వైసీపీ ఎమ్మెల్యే ఫ్యామిలీ..!

గుంటూరుకు చెందిన వైసీపీ ఎమ్మెల్యే ముుస్తఫా ఫ్యామిలీకి కరోనా భయం వెంటాడుతోంది. గుంటూరులో బయటపడిన రెండు కేసులు ఆ ఎమ్మెల్యే సమీప బంధువులవే. మత పరమైన సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లిన ఆ ఎమ్మెల్యే బంధువు.. తిరిగి వచ్చేటప్పుడు కరోనాను మోసుకొచ్చారు. అయితే.. లక్షణాలు బయట పడక ముందే.. ఆయన చాలా మందితో సన్నిహితంగా వ్యవహరించారు. కరోనా లక్షణాలు బయటపడే సరికి..ఆయనను క్వారంటైన్‌కు పంపించి.. టెస్టులు చేయించేసరికి.. పాజిటివ్‌గా తేలింది. ఈ విషయం కలకలం రేపేలోపు ఆయన భార్యకు కూడా.. అదే లక్షణాలు బయటపడ్డాయి. ఆమెకూ టెస్టులు చేయించడంతో పాజిటివ్‌గా తేలింది.

వారంతా ఎమ్మెల్యే కుటుంబంతో కలిసి మెలిసి ఉండేవారు కావడంతో.. ఆ కుటుంబం మొత్తం టెన్షన్‌కు గురవుతోంది. మత ప్రార్థనలకు ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత పలు కార్యక్రమాల్లో ఎమ్మెల్యే బంధువు పాల్గొన్నారు. వారందరికీ టెస్టులు చేయిస్తున్నారు. తమ కుటుంబంలో ఇద్దరికి పాజిటివ్‌గా తేలడం.. వారిద్దరూ.. తమతో సామాజిక దూరం పాటించకపోవడంతో.. ఎమ్మెల్యే కుటుంబం తమను.. క్వారంటైన్‌లో ఉంచాలంటూ.. గుంటూరు ప్రభుత్వాసుపత్రికి వెళ్లింది. అయితే.. అక్కడ అంత మంది వస్తే.. క్వారంటైన్ లో ఉంచడం సాధ్యం కాదని చెప్పి పంపేశారు.

దాంతో అధికారులు .. వారికి వేరే ప్రైవేటు మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో క్వారంటైన్ ఏర్పాటు చేశారు. గుంటూరులో విదేశాల నుంచి వచ్చినవారి కారణంగా ఎలాంటి పాజిటివ్ కేసు నమోదు కాలేదు. కానీ.. ఢిల్లీ నుంచి వచ్చిన వారి ద్వారా పాజిటివ్ కేసు వచ్చింది. ఆయన ద్వారా కాంటాక్ట్ కేసు కూడా నమోదయింది. దీంతో.. గుంటూరులో కరోనా కేసు స్టేజ్ త్రీకి చేరినట్లయింది. గుంటూరులో అధికారులు మరింత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీలోకి పర్చూరు, రేపల్లె ఎమ్మెల్యేలు..!?

తెలుగుదేశం పార్టీకి చెందిన మరో ఇరువురు ఎమ్మెల్యేలు గుడ్ బై చెప్పడం దాదాపు ఖాయమైపోయింది. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ఏ క్షణమైనా...

అలాంటిదేం లేదంటున్న సుమ‌

రంగ‌స్థ‌లంలో యాంక‌ర్ భామ అన‌సూయ‌కు ఓ మంచి అవ‌కాశం ఇచ్చాడు సుకుమార్‌. రంగ‌మ్మ‌త్త‌గా అన‌సూయ విజృంభించేసింది. ఆసినిమాతో అన‌సూయ‌కు కొత్త ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్ప‌డింది. ఇప్పుడు అదే పంథాలో త‌న కొత్త సినిమా...

బాలీవుడ్‌లో పాగా.. ఇదే క‌రెక్ట్ టైమ్‌!

తెలుగులో అగ్ర శ్రేణి నిర్మాత‌గా చ‌లామ‌ణీ అవుతున్నారు దిల్‌రాజు. పంపిణీరంగంలో ఇది వ‌ర‌కే త‌న‌దైన ముద్ర వేశారాయ‌న‌. చిన్న‌, పెద్ద‌, స్టార్‌, కొత్త‌.. ఇలా ఎలాంటి సినిమా అయినా తీయ‌గ‌ల స‌మ‌ర్థుడు. నిర్మాణ...

థియేట‌ర్ వ్య‌వ‌స్థ‌లో మార్పులు వ‌స్తాయా?

క‌రోనా ముందు.. క‌రోనా త‌ర‌వాత‌..? - ప్ర‌స్తుతం ప్ర‌పంచం న‌డ‌వ‌డిక‌, మ‌నుషులు ఆలోచించే విధానం, బ‌తుకులు రెండు ర‌కాలుగా విడిపోయాయి. ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మార్పులు అనివార్యం. సినిమా కూడా మారాల్సిన అవ‌స‌రం ఉంది. అన్నింటికంటే...

HOT NEWS

[X] Close
[X] Close