టాలీవుడ్ మ‌రో గొప్ప అడుగు…. క‌రోనా క్రైసెస్ చారిటీ

ఓ విష‌యంలో తెలుగు ప‌రిశ్ర‌మ‌ని మెచ్చుకొని తీరాలి. ఎలాంటి ప్ర‌కృతి వైప‌రీత్యం సంభవించినా, మేమున్నాం అంటూ ముందుకొస్తారు. త‌మ వంతు స‌హాయ స‌హ‌కారాలు అందిస్తారు. క‌రోనాపై పోరాటానికి ఇప్ప‌టికే భారీ ఎత్తున విరాళాలు ప్ర‌క‌టించింది టాలీవుడ్‌. ఇప్పుడు మ‌రో గొప్ప ముంద‌డుగు వేసింది. సీసీసీ (క‌రోనా క్రైసెస్ చారిటీ) అనే సంస్థ‌ని స్థాపించింది. దీని ద్వారా పేద సినీ క‌ళాకారుల్ని ఆదుకోబోతోంది. సినీ తార‌లు ప్ర‌క‌టించిన విరాళాల్ని ఈ సంస్థ ఓ చోట చేర్చి దాన్ని క్ర‌మ ప‌ద్ధ‌తిలో కొన్ని కార్య‌క్ర‌మాల ద్వారా సినీ కార్మికుల‌కు చేయూత నివ్వ‌డానికి ఖర్చు చేయ‌నుంది. ఈ సీసీసీకి చిరంజీవి అధ్య‌క్షులుగా వ్య‌వ‌హ‌రిస్తారు. త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజా, సి.క‌ల్యాణ్‌, ఎన్‌.శంక‌ర్‌, సురేష్ బాబు, దామూ కీల‌క స‌భ్యులుగా వ్య‌వ‌హ‌రిస్తారు. ఫెడ‌రేష‌న్‌కు సంబంధించిన అన్ని సేవా సంఘాలూ వీటిలో భాగ‌స్వామ్యం పంచుకుంటాయి. చిరంజీవి ప్ర‌క‌టించిన రూ.1 కోటి విత‌ర‌ణ కూడా సీసీసీ ద్వారానే ఖ‌ర్చు చేస్తారు. తాజాగా నాగార్జున రూ.1 కోటి ప్ర‌క‌టించారు. రామ్ చ‌ర‌ణ్ సీసీసీ కోసం రూ.30 ల‌క్ష‌లు ప్ర‌క‌టించారు. మ‌హేష్ బాబు కూడా అద‌నంగా మ‌రో 25 ల‌క్ష‌లు అంద‌జేయ‌నున్నారు.

నిజంగానే ఇదో మంచి అడుగు. చిత్ర‌సీమ అంటే.. హీరోలు, ద‌ర్శ‌కులు, నిర్మాత‌లే కాదు. అట్ట‌డుగున ప‌నిచేసే శ్రామికులు కూడా. లైట్ బోయ్స్ ద‌గ్గ‌ర్నుంచి కెమెరా అసిస్టెంట్స్ వ‌ర‌కూ..ఎంతోమంది చ‌మ‌టోడిస్తే గానీ సినిమా త‌యార‌వ్వ‌దు. అలాంటి కార్మికుల కాలే క‌డుపుల్ని నింపాల్సిన బాధ్య‌త ప‌రిశ్ర‌మ‌కు ఉంది. కాక‌పోతే.. అదెంత ప‌టిష్టంగా ప‌నిచేస్తుంద‌న్న‌ది చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సుప్రీంకోర్టులోనూ ఏపీ సర్కార్‌కు మళ్లీ “రంగు పడింది”..!

ప్రభుత్వ కార్యాలయాలపై రంగుల విషయంలో ఎక్కడా లేని పట్టుదలకు పోయిన ఏపీ సర్కార్‌కు.. రెండో సారి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు వారాల్లో ప్రభుత్వ కార్యాలయాలపై రంగులు తొలగించకపోతే.. కోర్టు ధిక్కరణ చర్యలు...

డాక్టర్ సుధాకర్‌పైనా సీబీఐ కేసు..!

నర్సీపట్నం డాక్టర్ సుధాకర్ కేసు దర్యాప్తులో అనూహ్య మలుపు చోటు చేసుకుంది. సీబీఐ ఆయనపైనా కేసు నమోదు చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించినందుకు, బాధ్యత కలిగిన ఓ ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి ప్రభుత్వ...

మ‌రో బ‌యోపిక్ మిస్ చేసుకున్న నిత్య‌మీన‌న్‌

ఒక‌ప్పుడు తెలుగు నాట నిత్య‌మీన‌న్ హ‌వా బాగా న‌డిచింది. కాస్త ప్ర‌త్యేక‌మైన క‌థానాయిక పాత్ర‌లు ఆమె చుట్టూ చేరిపోయాయి. గ్లామ‌ర్ మాటెలా ఉన్నా, స‌ర‌దా న‌ట‌న‌తో ఆక‌ట్టుకునేది. అయితే ఇప్పుడు త‌న‌ని అంతా...

ప్ర‌భాస్ సినిమా: దేవుడు Vs సైన్స్‌

ప్ర‌భాస్ ప్ర‌స్తుతం రాధాకృష్ణ‌తో ఓ సినిమా చేస్తున్నాడు. 'జాన్‌', 'రాధే శ్యామ్‌' పేర్లు ప‌రిశీల‌న‌లో ఉన్నాయి. న‌వంబ‌రు నుంచి వైజ‌యంతీ మూవీస్‌కి డేట్లు ఇచ్చాడు. ఈ చిత్రానికి నాగ అశ్విన్ నిర్మాత‌. పాన్...

HOT NEWS

[X] Close
[X] Close