తెలంగాణలో తొలి కరోనా మరణం..!

తెలంగాణలో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. అయితే.. మరణించిన తర్వాత మాత్రమే మృతునికి కరోనా ఉందని తేలింది. ఆయనకు విదేశీ ట్రావెల్ హిస్టరీ లేదు. కానీ.. ఢిల్లీలో జరిగిన ఓ మతపరమైన కార్యక్రమంలో.. ఈ నెల పధ్నాలుగో తేదీన పాల్గొన్నారు. పదిహేడో తేదీన తిరిగి వచ్చారు. ఆ తర్వాత తీవ్ర అస్వస్థతకు గుర్యయారు. ఆయనను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మరణించాడు. కరోనా లక్షణాలు ఉండటంతో.. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించి.. నమూనాలు తీసుకుని పరీక్షలు నిర్వహించారు. కరోనా పాజిటివ్ అని తేలింది. ఢిల్లీలో ఇదే మతపరమైన కార్యక్రమంలో పాల్గొన్న ఇతర వ్యక్తులకు కూడా కరోనా వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.

గుంటూరుకు చెందిన ఓ ప్రజాప్రతినిధి సమీప బంధువు కూడా.. ఢిల్లీలో మతపరమైన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చిన తర్వాతే కరోనా పాజిటివ్‌గా తేలిదంది. శుక్రవారంతో పోలిస్తే.. తెలంగాణలో శనివారం.. కాస్త తక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శనివారం ఆరు పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం తెలంగాణలో పాజిటివ్ కేసుల సంఖ్య ఆరవై ఐదుగా తేలింది. ఇవన్నీ కాంటాక్ట్ కేసులు కావడంతో.. ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేసేది. కరోనా విజృంభణ తర్వాత వైద్య ఆరోగ్య శాఖకు చెందిన వారికి స్క్రీనింగ్ కోసం ఎయిర్‌పోర్టులో నియమించారు. అలా నియమించిన సిబ్బందిలో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది.

మొత్తం అరవై ఐదు మంది లో ఇప్పటికే పది మందికి చికిత్స తర్వాత నెగెటివ్ వచ్చింది. మరో మూడు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి..మరోసారి టెస్టు చేసి..నెగెటివ్ వస్తే.. వారిని డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది. ప్రాణాపాయంలో ఎవరూ లేకపోయినా.. ఒక్కరి పరిస్థితి మాత్రం ఆందోళన కరంగా ఉందని మంత్రి ఈటల చెబుతున్నారు. క్వారంటైన్‌లో ఉన్న వారిపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ప్రత్యేక యాప్ ద్వారా వివరాలు సేకరిస్తోంది. వారు ఇంటి నుంచి బయటకు వెళ్లినా.. వారి ఆరోగ్యం సరిగ్గాలేదని.. సమాచారం వచ్చినా ప్రత్యేక బృందాలు వారి ఇళ్ల దగ్గరకు వెళ్లిపోయే ఏర్పాట్లు చేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

విశ్వ‌క్ ‘లైలా’వ‌తారం!

https://www.youtube.com/watch?v=9STsOoGDUfA లేడీ గెట‌ప్పులు వేయాల‌న్న ఆశ‌.. ప్ర‌తీ హీరోకీ ఉంటుంది. స‌మ‌యం సంద‌ర్భం క‌ల‌సి రావాలంతే! ఒక‌ప్ప‌టి అగ్ర హీరోలంతా మేక‌ప్పులు మార్చి, శారీలు క‌ట్టి - ఆడ వేషాల్లో అద‌ర‌గొట్టిన‌వాళ్లే. ఈత‌రం హీరోలు...

రఘురామకు ఇంకా కూటమి నుంచి టిక్కెట్ చాన్స్ ఉందా ? లేదా?

రఘురామకృష్ణరాజు పోటీ ఎక్కడ ?. ఈ ప్రశ్న ఇప్పుడు ఇటు కూటమి క్యాంప్‌తో పాటు అటు వైసీపీ క్యాంప్‌లోనూ హాట్ టాపిక్ గానే ఉంది. వైసీపీ క్యాంప్.. ఇదే ప్రశ్నతో ఆయనను...

ఆ స్వామిజీకి టిక్కెట్ రాకుండా చేసింది బాలకృష్ణేనట !

పరిపూర్ణానంద అనే స్వామిజీకి ప్రవచాలు చెప్పుకోవడం కన్నా రాజకీయాల్లో ఆదిత్యనాథ్ ని అయిపోవాలన్న ఆశ ఎక్కువగా ఉంది. గతంలో తెలంగాణలో ప్రయత్నించారు. వర్కవుట్ కాలేదు. ఈ సారి ఏపీలో దృష్టి పెట్టారు....

గంటాకే భీమిలీ – టీడీపీ ఫైనల్ లిస్ట్ రిలీజ్

గంటా శ్రీనివాసరావు హైకమాండ్ అనుకున్నది కాకుండా.. తాను అనుకున్న చోట పోటీ చేయడంలో ఎక్స్ పర్ట్. మరోసారి అనుకున్నది సాధించారు. భీమిలీ సీటు ఆయన ఖాతాలోనే పడింది. టీడీపీ విడుదల చేసిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close