ఫ‌లించ‌ని బుజ్జ‌గింపు… ఈశ్వ‌రి జంప్‌?

పాద‌యాత్ర‌లో రోజు రోజుకూ రెట్టించిన ఉత్సాహంతో సాగిపోతున్న వైసీపీ అధినేత‌కు ఇది అత్యంత నిరుత్సాహం క‌లిగించే విష‌యమే అన‌డంలో సందేహం లేదు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వ‌రి వైకాపాకి గుడ్‌బై చెప్ప‌నున్నారు. గ‌త కొన్ని రోజులుగా ఈ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోన్నప్ప‌టికీ ఆదివారం నాటికి ఆమె పార్టీ ఫిరాయింపు దాదాపు ఖ‌రారైన‌ట్టు స‌మాచారం. ఆమెని బుజ్జ‌గించ‌డానికి ముఖ్య‌మైన పార్టీ నేత‌ల‌తో పాటు సాక్షాత్తూ అధినేత సైతం ప్ర‌య‌త్నించినా… ఫ‌లితం లేకుండా పోయింద‌ని తెలుస్తోంది. పార్టీ మార‌డానికి సూత్ర‌ప్రాయంగా నిర్ణ‌యించుకున్న గిడ్డి ఈశ్వ‌రి రేపో మాపో ముహూర్తం నిర్ణ‌యించుకున్నార‌ట‌.

ప్ర‌స్తుతం వైసీపీకి అసెంబ్లీలో ఉన్న మ‌హిళా ఎమ్మెల్యేల‌లో గిడ్డి ఈశ్వ‌రి ఒక ప్ర‌ధాన బ‌లం అన‌డం నిస్సందేహం. బ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌తినిధిగా ఆమె అధికార‌పార్టీపై ప‌లు సంద‌ర్భాల్లో గ‌ట్టిగా పోరాడారు కూడా. అయితే ఇటీవ‌ల స్థానికంగా చోటు చేసుకుంటున్న రాజ‌కీయ ప‌రిణామాలు ఆమెకు రుచించ‌డం లేదు. మ‌రికొన్ని అంశాలు కూడా ఉన్న‌ప్ప‌టికీ ముఖ్యంగా అర‌కు నియోజ‌క‌వ‌ర్గ‌ ఎమ్మెల్యే టికెట్ ద‌గ్గ‌రే స‌మ‌స్య వ‌చ్చింద‌ని స‌మాచారం. ఆ టిక్కెట్‌ను త‌న మ‌ద్ధ‌తుదారైన ఫాల్గుణకు ఇప్పిస్తాన‌ని ఈశ్వ‌రి మాట ఇచ్చార‌ట‌. స‌ద‌రు ఫాల్గుణ గ‌తంలో బ్యాంకు ఉద్యోగిగా ఉండి స్వ‌ఛ్చంద ప‌ద‌వీ విర‌మ‌ణ తీసుకున్నారు. ప్ర‌స్తుతం ఈశ్వ‌రికి అన్ని ర‌కాలుగా ఆయ‌న అండ‌దండ‌లు అందిస్తున్నారు. దీంతో అత‌నికి అర‌కు టిక్కెట్ ఇవ్వాల‌ని ఈశ్వ‌రి ఎంతో కాలంగా అధినేత‌కు విన్న‌విస్తూ వ‌స్తున్నార‌ట‌. ఈ నేప‌ధ్యంలో ఒక‌సారి టీడీపీలో చేరి, పార్టీలోకి తిరిగొచ్చిన కుంభా ర‌విబాబుకి ఆ టిక్కెట్ ఖారారైన‌ట్టు సంకేతాలు రావ‌డంతోనే ఈశ్వ‌రి ఆగ్ర‌హించార‌ట‌. దీంతో వైసీపీకి గుడ్‌బై చెప్పాల‌ని నిర్ణ‌యించుకున్నార‌ని తెలుస్తోంది.

ఏదైమ‌నా… బ‌ల‌హీన వ‌ర్గాల్లో ప‌ట్టున్న ఓ మ‌హిళా ఎమ్మెల్యేను పోగొట్టుకోవ‌డం వైసీపీకి నిస్సందేహంగా మైన‌స్ కానుంద‌ని రాజ‌కీయ‌విశ్లేష‌కులు అంటున్నారు. గ‌త కొంత‌కాలంగా పార్టీ బ‌లోపేతం కోసం అంటూ జ‌గ‌న్ తీసుకుంటున్న నిర్ణ‌యాలే ఇప్పుడు పార్టీ బ‌ల‌హీన‌ప‌డ‌డానికి కార‌ణంగా మారుతున్నాయంటున్నారు. పోయిన వాళ్లు పోగా ఉన్న‌వాళ్ల‌నైనా కాపాడుకోవ‌డానికి వైసీపీ ద‌గ్గ‌ర స‌రైన వ్యూహ‌మే కొర‌వ‌డిన‌ట్టు కొన‌సాగుతున్న వ‌ల‌స‌లు నిరూపిస్తున్నాయ‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హిందూపురం నుంచి పరిపూర్ణనంద పోటీ – బాలకృష్ణే కారణమా..?

హిందూపురం అసెంబ్లీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు శ్రీపీఠం వ్యవస్థాపకుడు పరిపూర్ణనంద స్వామి.లోక్ సభకు పోటీ చేస్తానని ప్రకటించి అనూహ్యంగా అసెంబ్లీకి పోటీ చేస్తుండటం చర్చనీయాంశం అవుతోంది. బీజేపీ తరఫున...

పవన్‌ను ఆశీర్వదించిన పిఠాపురం !

పిఠాపురం చరిత్రలో ఎప్పుడూ లేనంత భారీ ర్యాలీ జరిగింది. పవన్ తాను అద్దెకు తీసుకున్న చేబ్రోలులోని ఇంటి నుంచి నామినేషన్ వేసేందుకు ఆర్వో ఆఫీసుకు వచ్చేందుకు ఐదు గంటలకుపైగా సమయం...

సూరత్ తరహాలో సికింద్రాబాద్ చేజారుతుందా..?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మల్కాజ్ గిరి, సికింద్రాబాద్ , చేవెళ్లలో ఎలాగైనా గెలవాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మల్కాజ్ గిరి, చేవెళ్లలో అభ్యర్థుల ప్రచారంలో దూకుడుగా సాగుతున్నా సికింద్రాబాద్ లో మాత్రం...

వైసీపీకి ఏబీవీ భయం – క్యాట్ ముందు హాజరు కాని ఏజీ !

సస్పెన్షన్ లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు కేసును వీలైనంతగా లేటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణకు హాజరు కావాల్సిన అడ్వాకేట్ జనరల్ డుమ్మా కొట్టారు. అదే కారణం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close