వైసీపీ రాజకీయాలు పిచ్చికి పరాకాష్ట అన్నట్లుగా మారాయి. మహిళల ప్రపంచకప్ ఫైనల్‌ను చూసేందుకు వెళ్తే నారా లోకేష్ పై పడి ఏడుస్తున్నారు. ఇప్పుడు అదే ప్రపంచకప్‌ను భారత్ గెలవడం.. అందులో కడప అమ్మాయి శ్రీచరణి ఉండటంతో వైసీపీ నేతలు మరో రకమైన రాజకీయం చేస్తున్నారు. శ్రీచరణి ఆంధ్రాకు రాక ముందే ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ప్రచారం ప్రారంభించేశారు. పోస్టర్లు వేసుకున్నారు. సాక్షి మీడియాలో ప్రచారం చేశారు. చివరికి శ్రీకాంత్ రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టారు. ఎందుకంటే ఆమెకు ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ఇస్తుంది కాబట్టి అది తమ ఘనతే అని చెప్పుకోవడానికి.
శ్రీచరణి వస్తోందే ఇవాళ!
భారత మహిళల క్రికెట్ జట్టు సాధించిన విజయాలపై దేశం అంతా ఎంతో ఆనందంగా ఉంది. వారు ప్రధానమంత్రి మోదీతో.. రాష్ట్రపతి ముర్ముతో సమావేశం అయ్యారు. ఇప్పుడే క్రికెటర్లు ఎవరి ఇళ్లకు వారు వెళ్తున్నారు. శుక్రవారం శ్రీచరణి ఆంధ్రకు వస్తున్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఆమెకు ఘన స్వాగతానికి ఏర్పాట్లు చేసింది. గన్నవరం నుంచి భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. చంద్రబాబు,లోకేష్ తో సమావేశం అవుతారు.
భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించాలని ముందే నిర్ణయం
శ్రీచరణికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు ఆమె ఆటలో మరింత ఉన్నత స్థానానికి వెళ్లేందుకు అవసరమైన మద్దతు ఇవ్వాలని ప్రభుత్వం ముందుగానే నిర్ణయించింది. ఈ విషయం తెలిసిన వైసీపీ.. ముందుగానే పట్టించుకోవడంలేదని ఆరోపణలు ప్రారంభించారు. శ్రీచరణి వచ్చి చంద్రబాబును కలిసిన తర్వాత ప్రోత్సాహకాలు ప్రకటిస్తారు కాబట్టి తాము ఆరోపణలు చేయబట్టే పట్టించుకున్నారని చెప్పుకునేలా రాజకీయం చేస్తున్నారు.
క్రీడాకారుల్ని వైసీపీ ఎప్పుడైనా ప్రోత్సహించిందా ?
ప్రతీ దాన్ని కులం పేరుతో చూసుకుని రాజకీయం చేసుకునేంత స్థాయిలో కులం క్యాన్సర్ పాకిపోయిన వైసీపీ .. ఆటలను ఎప్పుడూ ఆటలుగా చూడలేదు. ఆడుదాం ఆంధ్రా పేరుతో డబ్బులు కొట్టేసి వైసీపీ కార్యకర్తలను ప్లేయర్లను చేశారు. ఆ వ్యవహారంతో ఏపీ పరువు ఆటల ప్రపంచంలో పోయింది. ఇతర ఆటగాళ్లకు ఎప్పుడైనా ఓ ప్రోత్సాహకం ప్రకటించిన పాపాన పోలేదు. అనిల్ కుంబ్లే కంపెనీ చంద్రబాబు చేపట్టిన గాండీవం ప్రాజెక్టులో భాగంగా ఏపీ ప్లేయర్లకు ట్రైనింగ్ ఇస్తే ఆ బిల్లులు కూడా చెల్లించలేదు. పైగా శిక్షణనిలిపివేశారు.
ఈ ఏడుపులన్నీ ఎందుకు ఓ కోటి ఇవ్వొచ్చుగా !
ప్రభుత్వం సాయం చేస్తుందని తెలిసి…క్రెడిట్ కోసం దొంగ రాజకీయాలు చేసే బదులు .. వైసీపీ కూడా.. తమ కడప బిడ్డ అనుకుని రూ.కోటి సాయం చేస్తే ప్రజలు కూడా పర్వాలేదని అనుకుంటారు. రూపాయి సాయం చేయకుండా ఆమె విజయాలను రాజకీయం చేస్తే.. ముఖం కూడాచూడని విధంగా అసహ్యించుకుంటారు. వైసీపీ నేతలు దానికి కూడా సిద్ధపడతారు కానీ.. సాయం మాత్రం చేయరు.
