ప్రతిపక్షంగా వైసీపీ పూర్తిగా విఫలమయింది. అసలు ప్రభుత్వంపై పోరాటం అనే మాటను మర్చిపోయింది. ఇంట్లో ఖాళీగా పడుకున్నారు… అంటే సరే భయం ..లేకపోతే ఇప్పుడు పోరాడి ప్రయోజనం ఏమీ లేదని అనుకుంటారు. కానీ ప్రభుత్వానికి మేలు జరిగే అంశాలపై పోరాడుతున్నారు. అలాంటి వాటిపై ఎంత ఎక్కువ చర్చ జరిగితే ప్రభుత్వానికి మేలు జరిగుతుందో అలాంటి అంశాలను ఎంచుకుని రాజకీయాలు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ చేస్తున్న పోరాటం చూసి చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. టీడీపీ కోసం పోరాటం చేస్తున్నట్లుగా ఉందని సెటైర్లు వేస్తున్నారు.
ప్రభుత్వ నిర్ణయాల్లో మంచిపై చర్చ జరిగేలా పాలిటిక్స్
మెడికల్ కాలేజీలను ప్రైవేటు వరం చేస్తున్నారని జగన్ రెడ్డి అంటున్నారు. తాను కట్టించేశానని … వాటిని అమ్మేస్తున్నారని అంటున్నారు. తాను కట్టించిన వాటిని చూసేందుకు ప్రత్యక్ష పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఎంత మాత్రం కట్టించారో అందరూ చూశారు. ఇంకా పునాదులు కూడా దాటలేదు. భవనాలు కడితే సరిపోదు.. మెడికల్ కాలేజీ అంటే.. ఓ వ్యవస్థ ఉండాలి.. క్వాలిటీ విద్య ఉండాలి.. అవి లేకపోతే ఇంజినీర్లు వచ్చినట్లుగా డాక్టర్లు వస్తారు..కానీ ప్రయోజనం ఏమిటి?. ఈ మాత్రం సాధారణ ప్రజలకూ తెలుసు. ప్రభుత్వ ఆస్పత్రులు ఎలా ఉన్నాయో అందరూ చూస్తున్నారు. అదే ప్రైవేటులో ఉంచి పేదలకు ఉచితంగా సేవలు .. అతి తక్కువకు నాణ్యమైన వైద్యం అందించే ఏర్పాటు చేస్తే ఎంత బాగా ఉంటుందో ప్రజలకు తెలుసు. అందుకే వైసీపీ.. మెడికల్ కాలేజీల ఇష్యూకు ప్రజల్లో స్పందన లేదు.
మెడికల్ విద్యలో నాణ్యత ముఖ్యం – పీపీపీనే బెటరని ప్రజల భావన
అదే సమయంలో వైద్య విద్య అనే దానికి చాలా మందికి డిస్ కనెక్ట్ అయిపోయారు. కేవలం డాక్టర్ టార్గెట్ పెట్టుకుని ఏళ్ల తరబడి ప్రయత్నించేవారు స్వల్పమే. అలాంటి వారికి ఇప్పుడు ఉన్న విధానం మంచిదే అనిపిస్తోంది. పీపీపీకి ఇచ్చినా అందులో ప్రభుత్వం చేతిలో పూర్తిగా ఉన్నప్పుడు ఉన్న కోటాలోనే సీట్ల కేటాయింపు ఉంటుంది. పేదలకు ఒక్క సీటు కూడా నష్టం జరగదు. జగన్ రెడ్డి ఇచ్చిన జీవో ప్రకారమే ఉంటాయి. మరి ఎక్కడ అన్యాయం జరుగుతుందన్నది వైసీపీ చెప్పలేకపోతోంది. ఇప్పుడు మెడికల్ కాలేజీల వల్ల ఏమైనా చర్చ జరిగితే.. పీపీపీ మంచిదే అన్న వైపే జరుగుతున్నాయి. ఇది వైసీపీ .. టీడీపీకి చేసిన మేలు.
ప్రభుత్వానికి నొప్పి తెలియని రాజకీయాలెందుకు ?
ఎక్కువ మంది ప్రజల్ని ప్రభావితం చేసే అంశాలపై రాజకీయం చేసి.. తమ బలం పెంచుకోవాలని ఏ ప్రతిపక్షమైనా అనుకుంటుంది. కానీ వైసీపీ తీరు భిన్నంగా ఉంది. ప్రభుత్వం చేసే పనుల్లో మంచి ఎక్కువగా ఉందని.. అందరికీ తెలిసేలా చేయడానికి.. చర్చ జరిగేలా చేయడానికి రాజకీయాలు చేస్తోంది. వైసీపీ ఇంతలా ఎందుకు సరెండర్ అవుతుందోనని .. కరుడు గట్టిన వైసీపీ నేతలు కూడా ఫీలవుతున్నారు. ఇలాంటి రాజకీయాలు చేయడం కన్నా.. ఇంట్లో పడుకోవడం మంచిదని అనుకుంటున్నారు.