బీజేపీ – వైసీపీ మధ్య ఎన్నికలకు ముందే పొత్తు..!?

  • మోడీ వస్తే గౌరవించకుండా పంపుతారా..? ఓ వైసీపీ నేత ఆగ్రహం
  • కేంద్రం ఇచ్చే డబ్బులతో రైతులకు సాయం చేస్తున్నారు..? మరో వైసీపీ నేత లాజిక్
  • కేంద్రం దగ్గర నిధులు తీసుకుని బీజేపీని నిందిస్తున్నారు..! వైసీపీ పత్రిక ఆవేదన..

ఇటీవలి కాలంలో బీజేపీపై తమ అభిమానాన్ని ప్రదర్శించుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ మాత్రం వెనుకాడటం లేదు. భారతీయ జనతా పార్టీ, నరేంద్రమోడీకి అనుకూలంగా ప్రకటనలు చేయడానికి ఏ మాత్రం సందేహించడం లేదు. దీనికి కారణం ఏమిటి..? ఎన్నికల ముందు పొత్తు కోసం రూట్ క్లియర్ చేసుకుంటున్నారా..? ఈ పొత్తుల వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏమిటి..? బీజేపీకి వచ్చే లాభం ఏమిటి..?

బీజేపీతో పొత్తుల వైపు బుడి బుడి అడుగులా..?

జాతీయ స్థాయిలో బీజేపీయేతర పక్షాలన్నీ ఓ మహాకూటమిగా ఏర్పడబోతున్నాయి. ఇప్పటి వరకు..కలసి పోరాడిన ఆ పార్టీలన్నీ.. ఎన్నికల తర్వాత ఎలాంటి పరిస్థితులు వస్తాయో.. ముందుగానే అంచనా వేసుకుని దాని ప్రకారం పోరాట కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. అతి పెద్ద కూటమిగా ఏర్పడటం ఖాయంగా ఉంది కాబట్టి… రాష్ట్రపతి నుంచి ముందుగా పిలుపు తమకే రావాలంటే.. కచ్చితంగా.. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడాలని నిర్ణయించుకున్నాయి. బీజేపీ అతి పెద్ద పార్టీగా అవతరించే అవకాశం ఉంది. కానీ.. మెజార్టీకి చాలా దూరంలో ఉంటుంది. పెద్ద పార్టీగా.. ప్రభుత్వ ఏర్పాటు అవకాశాన్ని దక్కించుకుంటే… మెజార్టీ నిరూపించుకోవడానికి బీజేపీ ఏమైనా చేయగలదు. ఈ పరిస్థితి రాకుండా మహాకూటమిని ఏర్పాటు చేసుకుంటంున్నారు. ఈ విషయం ముందుగానే అంచనా వేసుకున్న బీజేపీ కూడా… ఎన్డీఏలో మిత్రుల సంఖ్యలను పెంచుకోవాలనుకుంటోంది. ఇప్పటికైతే శివసేన కూడా విడిగా పోటీ చేయడానికి సిద్ధపడుతోంది. పొత్తు కొనసాగించాలంటే.. బీజేపీ… మహారాష్ట్రలో తన అస్థిత్వాన్ని త్యాగం చేయాల్సినంతగా డిమాండ్లు పెడుతోంది. ఈ తరుణంలో.. దక్షిణాదిలో ఆ పార్టీకి.. అన్నాడీఎంకే, వైసీపీనే మంచి అవకాశాలుగా కనిపిస్తున్నాయి. బీజేపీతో పొత్తులు పెట్టుకుంటామని.. అన్నాడీఎంకే ఇప్పటికే ప్రకటించగా… వైసీపీ ఆ బాటలోనే రెడీ అవుతోందనడానికి… వైసీపీ నేతలు, సాక్షి పత్రిక స్టాండ్ మారడాన్ని సూచికగా భావించవచ్చు.

పొత్తులు వద్దనలేని స్థితికి వైసీపీ వెళ్లిపోయిందా..?

మన్మధుడు సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది. ఆమె ప్రేమించింది.. నేను ప్రేమించాల్సి వచ్చింది.. అని ప్రస్తుతం…వైసీపీ పరిస్థితి అంతే. ప్రిపోల్ అలయెన్స్‌ ఉండాల్సిందేనని బీజేపీ అగ్రనాయకత్వం నుంచి వత్తిడి వస్తే.. వద్దు అనే పరిస్థితి వైసీపీకి లేదు. వారి భయాలు.. వారికి ఉన్నాయి. రేపు ఎన్నికల్లో ఏదైనా తేడా జరిగితే.. హ్యాండివ్వరనే నమ్మకం ఏముందనే భయం కూడా బీజేపీ నేతలకు ఉండొచ్చు. అంతే కాదు.. అసలు తాము .. వైసీపీని చూసుకునే తెలుగుదేశం పార్టీని వదులుకున్నామని… తామున్నామని భరోసా వైసీపీ నుంచి వచ్చింది కాబట్టే… టీడీపీ వెళ్లిపోతుందని తెలిసినా పట్టించుకోలేదని.. బీజేపీ నేతలు చెబుతూ ఉంటారు. చివరికి వచ్చిన తర్వాత వైసీపీ పొత్తు వద్దంటే.. అది తమని మోసం చేసినట్లే అవుతుందని… వారి భావన. అందుకే.. ఢిల్లీ నుంచి పొత్తులకు రెడీ కావాలనే సూచనలు వైసీపీకి అందుతున్నట్లు తెలుస్తోంది.

బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి నష్టం కాదా..?

భారతీయ జనతా పార్టీతో నేరుగా.. వైసీపీ పొత్తులు మాత్రమే పెట్టుకోలేదు. అన్ని రకాల సంబంధాలు కొనసాగిస్తోంది. ఈ విషయంలో ఎవరికీ అనుమానాల్లేవు. కొత్తగా పొత్తులు పెట్టుకుంటే.. నేరుగా.. కలిశారు అని మాత్రమే ప్రజలు అనుకుంటారు. ఈ విషయంలో.. కొత్త వచ్చే.. పోయే నష్టం ఏమీ ఉండదనే అంచనాలు.. వైసీపీలో ఇప్పుడిప్పుడే వినిపించడం ప్రారంభించాయి. దీనికి సంబంధించి… క్యాడర్‌ను ప్రిపేర్ చేయడానికే.. అటు వైసీపీ నేతలు.. ఇటు సాక్షి మీడియా కూడా.. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా.. పెద్ద ఎత్తున పాజిటివ్‌గా ప్రకటనలు చేస్తున్నారన్న అభిప్రాయం క్యాడర్ లో ప్రారంభమయింది. బీజేపీ నేతలు.. కూడా.. గతంలో ఇతరులతో పొత్తులు పెట్టుకుని ఏపీ ప్రభుత్వాన్ని దింపేస్తామని పదే పదే ప్రకటనలు చేశారు. ఇప్పుడు దాన్ని కార్యాచరణలోకి తీసుకు రాబోతున్నారు. మొత్తానికి ఎన్నికలకు ముందు ఏపీ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మలయాళం కథతో తరుణ్ భాస్కర్ ?

తరుణ్ భాస్కర్ కి నటనపై ఆసక్తి ఎక్కువే. తను తీసిన 'కీడాకోలా' నటుడిగా ఆయన్ని మరో మెట్టుఎక్కించింది. ప్రస్తుతం దర్శకుడిగా కథలు రాసుకోవడంతో పాటు నటుడిగా కూడా కొన్ని ప్రాజెక్ట్స్ సైన్ ...

బీఆర్ఎస్ఎల్పీ విలీనం లేనట్లే – రేవంత్ ఆకర్ష్ ఫెయిల్ !

బీఆర్ఎస్ఎల్పీని విలీనం చేసుకుంటామని ఇరవై ఐదు మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతారని చేస్తున్న ప్రచారం అంతా డొల్గా తేలుతోంది. ముందుకు వచ్చిన ఒక్కో ఎమ్మెల్యేకు కండువా కప్పుతున్నారు...

రోజా దాచిన మద్యం డంప్ పట్టించిన సొంత పార్టీ నేతలు

ఏపీలో మద్యం దుకాణాలను గుప్పిట్లో పెట్టుకుని వైసీపీ నేతలు చాలా మందుగానే అన్ని నియోజకవర్గాలకు మద్యాన్ని సరఫరా చేసి పెట్టుకున్నారు. అది అధికారిక మధ్యమా.. పన్ను కట్టని మద్యమా అన్నదానిపై ఇంకా క్లారిటీ...
video

‘మ‌న‌మే’ టీజ‌ర్‌: క్యారెక్ట‌ర్ల మ‌ధ్య క్లాషు!

https://www.youtube.com/watch?v=_4Ff1zVtKkw శర్వానంద్ - శ్రీ‌రామ్ ఆదిత్య కాంబినేష‌న్‌లో 'మ‌న‌మే' రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే. కృతి శెట్టి క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ రూపొందిస్తోంది. శ్రీ‌రామ్ ఆదిత్య త‌న‌యుడు ఈ చిత్రంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close