చైతన్య : ఐదేళ్లలో మరింత దూరమైన కశ్మీర్..! రాజకీయమే శాపం..!

గుండె పగిలిపోయే విషాదం అది. దేశాన్ని కాపాడేందుకు… సైనికులు.. తమ శరీరాల్ని తునాతునకలు చేసుకోవాల్సిన పరిస్థితి అది. గత ఇరవై ఏళ్లలో ఎప్పుడూ జరగనంత ఉగ్రవాద ఉన్మాద దాడి సైనికులపై జరిగింది. దీనికి ప్రతీకారంగా… దేశం ఏదో ఒకటి చేస్తుంది. ఉగ్రవాదుల్ని మట్టు పెడుతుంది. కానీ ఇలాంటి దాడులు జరగకముందే.. ఎందుకు మేల్కోలేకపోతున్నారు…? కశ్మీర్ అంశంతో భావోద్వేగ రాజకీయం చేసేంత శ్రద్ధ.. అక్కడ పరిస్థితుల్ని మెరుగు పర్చడానికి ఎందుకు పెట్టడం లేదు..? సైనికుల ప్రాణాల్ని పణంగా పెట్టి రాజకీయం చేయడం అవసరమా..? లేనిపోని గొప్పలతో సినిమాలు తీసుకుని డబ్బులు చేసుకుని .. రాజకీయం చేసుకోవడానికి పరిమితమా..?

పరిస్థితి ఎలా ఉంది..? చాలా దుర్బరంగా ఉంది సార్..?:

“యూరి” అనే సినిమా వచ్చింది. ఇది సర్జికల్ స్ట్రైక్స్ గురించి గొప్పగా చెప్పిన సినిమా. ఇందులో ఓ డైలాగ్ ఉంది..” జోష్ ఎలా ఉంది.. కమాండర్ అడిగితే… . చాలా హై సర్..” అంటాడు సర్జికల్ స్ట్రైక్‌కు వెళ్లిన జవాన్. దీన్ని భారతీయ జనతా పార్టీ నేతలు.. ఎంతగా మార్కెట్ చేసుకోవాలో అంతగా మార్కెట్ చేసుకున్నారు. చేసుకుంటూనే ఉన్నారు. ఇదే.. ఆ రాజకీయమే అసలు కశ్మీరానికి శాపంగా మారింది. తాము వస్తే కశ్మీర్‌లో కల్లోలం అనేది లేకుండా చేస్తామని బీరాలు పలికిన బీజేపీ.. రాజకీయ అవసరాల కోసం… రాజీ పడిపోయింది. ఓ వేర్పాటువాద పార్టీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని నడిపింది. ఆ పార్టీ పీడీపీ. ఆ పార్టీ ఉగ్రవాదులకు మద్దతిస్తుందనేది బహిరంగ రహస్యం. అయినప్పటికీ.. అధికారం కోసం బీజేపీ దిగజారిపోవడంతోనే.. కశ్మీర్‌లో పరిస్థితి దిగజారడం ప్రారంభమయింది. ఈ నాలుగేళ్ల కాలంలో.. కశ్మీర్‌లో హింసాకాండ దారుణంగా పెరిగింది. తీవ్రవాద హింసాకాండ, మత చాందసవాదం పెరగాయని.. బీజేపీ తరపున కశ్మీర్ ఇన్చార్జ్ గా ఉన్న రామ్ మాధవ్ ఇప్పటికీ చెబుతూంటారు.

కశ్మీర్‌ను కాలబెట్టి రాజకీయం చేస్తారా..?:

2016 అక్టోబర్‌లో భారతదేశ ఆర్మీ.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో శిక్షణ పొందుతున్న, చొరబాటుకు సిద్ధమవుతున్న ఉగ్రవాదులను మట్టుబెట్టింది. సరిహద్దు దాటి.. మన సైనికులు పాకిస్థాన్ భూభాగంలోకి వెళ్లి ఈ దాడులు చేశారు. 2016 అక్టోబర్‌లో ఈ సర్జికల్ దాడుల గురించి ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నేతలు దీన్నో ఘన విజయంగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు బీజేపీ తరపున టీవీల్లో ప్రకటనలు వస్తున్నాయి. ఓ సినిమా కూడా తీయించారు. రూ. 200 కోట్ల వసూళ్లు కూడా ఆ సినిమా సాధించింది. నిజానికి ఈ సర్జికల్స్ స్ట్రైక్స్ జరగలేదని పాకిస్థాన్ వాదించింది. అప్పట్లో… కేంద్రం సైలెంట్‌గా ఉంది. అప్పట్లో ఎందుకు సర్జికల్ స్ట్రైక్స్ వీడియోలు విడుదల చేయడం లేదని ప్రశ్నిస్తే.. అతి జాతీయ భద్రతకు సంబంధించిన అంశంగా.. బీజేపీ వర్గాలు తేల్చి చెప్పాయి. దేశభద్రతతో ఆటలాడలేమన్నట్లుగా వ్యవహరించారు. కానీ దానికి సంబంధించిన వీడియోలు తర్వాత ఆన్‌లైన్‌లోకి వచ్చేశాయి. జాతీయ భద్రతకు సంబంధించిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అవి. కానీ ఇప్పుడు ఈ వీడియోలు అనధికారికంగా బయటకు వచ్చాయి. అత్యంత రహస్యంగా ఉండాల్సిన వీడియోలు ఎలా బయటకువచ్చాయి. కేంద్రం అనుమతి లేకుండా.. అదీ రక్షణ శాఖ ఉన్నతాధికారుల పర్మిషన్ లేకుండా ఎలా బయటకువచ్చాయి..?. తాము అధికారికంగా విడుదల చేయలేదని.. ప్రభుత్వం, ఆర్మీ చెబుతోంది. కానీ కేంద్రానికి సంబంధం లేకుండా వస్తే ఎందుకు విచారణకు ఆదేశించలేదు. అసలు ఎలా బయటకు వచ్చిందో..తెలుసుకునే ప్రయత్నం ఎందుకు చేయ లేదు..?
రాజకీయాల కోసం.. రాజకీయ ప్రత్యర్థుల్ని కార్నర్ చేయడానికి.. రక్షణశాఖకు చెందిన అత్యంత కీలకమైన .. దేశ భద్రతకు సంబంధించిన వీడియోలను బయపెట్టడం అత్యంత ప్రమాదకర సంకేతం. కానీ బీజేపీకి ఇది రాజకీయ ఆట.

మళ్లీ సర్జికల్ స్టైక్స్ ఖాయమే..! ఉగ్రవాదం అంతమవుతుందా..?:

కశ్మీర్‌లో పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోస్తోందనేది ప్రపంచానికి తెలిసిన నిజం. దాన్ని నిరోధించడానికి నాలుగేళ్లలో కేంద్రం చేసింది.. ఒక్క సర్జికల్ స్టైక్. కానీ.. కశ్మీర్‌లో నిరంతరం… మారణకాండనే. పీడీపీ, బీజేపీ ప్రభుత్వం విడిపోవడానికి కారణం.. ఈ మారణకాండనే. మరి సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా దాదాపుగా అంతమొందించామని ప్రభుత్వం ఎందుకు ప్రచారం చేసుకుంది..? పోఖ్రాన్‌లో అణుపరీక్షలు జరిపినప్పుడు కూడా అప్పటి ప్రభుత్వం.. ఇక ఈ దెబ్బతో.. ఉగ్రవాదం ఉండదని చెప్పుకొచ్చింది. కానీ అప్పుడు.. ఇప్పుడూ ఏం జరిగింది..?. మరో అతి పెద్ద ఉగ్రవాద దాడిని ఎదుర్కోవాల్సి వచ్చింది.

సర్జికల్ స్ట్రైక్స్ జరపాలా వద్దా అన్నది… ఆయా పరిస్థితులను బట్టి ఆర్మీ, ప్రభుత్వం కలిసి నిర్ణయం తీసుకోవాలి. అందులో ఎలాంటి సందేహం లేదు. జరపకూడదని ఎక్కడా లేదు. కానీ దీన్ని రాజకీయానికి వాడుకోవడమే తప్పు. ఆర్మీ… దేశ రక్షణకు సంబంధించిన వ్యవస్థ. ఈ వ్యవస్థను.. కూడా.. రాజకీయాలకు వాడుకోవడం … కరెక్ట్ కాదు.

రాజకీయం కాదు .. కశ్మీర్‌ను కాపాడాలి..! :

కశ్మీర్ భారదేశంలో అంతర్భాగం. ఇది ప్రపంచం అంగీకరించిన నిజం. ఈ విషయంలో ఎవరితోనూ చర్చలు జరపాల్సిన అవసరం లేదు. కానీ ఉగ్రవాదం అంతానికి మాత్రం… రాజకీయం తప్ప.. ఏదో ఒకటి చేయాల్సి ఉంది. రాజకీయనాయకులు కూడా ఎన్నికలకు ముందు ప్రజలను రెచ్చగొట్టడానికి పాకిస్థాన్‌తో చర్చలేమిటి అంటారు. ఎన్నికల తర్వాత చర్చలు కావాలి అంటారు. 2014 ఎన్నికలకు ముందు.. పాకిస్థాన్ తో చర్చలేమిటని బీజేపీ నేతలు రెచ్చగొట్టారు. మోడీ ప్రధాని కాగానే… పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ను భారత ప్రధాని ప్రమాణస్వీకారోత్సవానికి అహ్వానించారు. ఆ తర్వాత అధికారిక కార్యక్రమం లేకుండానే నేరుగా పాకిస్థాన్ వెళ్లి షరీఫ్ ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యారు. దాని వల్ల ఓట్ల రాజకీయం చూశారు కానీ.. కశ్మీర్ గురించి ఆలోచించలేదు. అందుకే ఈ దుస్థితి.

కశ్మీర్‌లో ఇప్పుడు పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతోంది. ఇప్పుడు బీజేపీకి ఇదో అవకాశంగా కనిపించబోతోంది. మేము అధికారంలో ఉంటేనే.. తీవ్రవాదాన్ని అణచివేయగలమని… ప్రధానమంత్రిగా మోదీ ఉంటేనే…అది సాధ్యమవుతుందని బీజేపీ ప్రచారం ప్రారంభించబోతోంది. ఈ ఉగ్రవాద దాడితో బీజేపీ తనను తాను కాపాడుకునే ప్రయత్నిస్తుంది. కశ్మీర్ ని మంటల్లో అలా వదిలేస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఒకే టైటిల్… మూడు సినిమాలు

టాలీవుడ్ లో టైటిళ్ల‌కు కొర‌త వ‌చ్చిందా? ప‌రిస్థితి చూస్తుంటే అదే అనిపిస్తోంది. త‌మ సినిమాల‌కు ఎలాంటి టైటిల్ పెట్టాలో అర్థం కాక‌, ఒక‌టే టైటిల్ తో మూడు సినిమాలు తీసేస్తున్నారు. టాలీవుడ్ లో...

బీజేపీపై పోస్టర్లు – అప్పట్లో బీఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్

బీజేపీపై చార్జిషీట్ అంటూ కాంగ్రెస్ పార్టీ నేతలు పోస్టర్లు రిలీజ్ చేశారు. తెలంగాణకు బీజేపీ చేసిన అన్యాయం అంటూ విభజన హామీలు సహా అనేక అంశాలను అందులో ప్రస్తావించింది. వాటిని హైదరాబాద్...

నామినేషన్‌లో పవన్ ఫోటో వాడేసుకున్న గుడివాడ అమర్నాథ్ !

రాజకీయ నాయకులకు కొంచెమైన సిగ్గు.. ఎగ్గూ ఉండవని జనం అనుకుంటూ ఉంటారు. అది నిజమేనని తరచూ కొంత మంది నిరూపిస్తూంటారు. అలాంటి వారిలో ఒకరు గుడివాడ్ అమర్నాథ్. పవన్ కల్యాణ్ పై...

కవిత అరెస్ట్ వెనక సంతోష్ రావు..!?

కవిత లిక్కర్ స్కామ్ లో కటకటాల పాలవ్వడానికి ఆ నేతే కారణమా..? తన స్వప్రయోజనాల కోసం ఆయన కవితను ఇరికించారా..?నమ్మకస్తుడిగా ఉంటూనే కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచారా..?గత కొద్ది రోజులుగా సంతోష్ రావు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close