శ్రీనివాసా.. ! నీ సంప్రదాయాల గురించి బాధపడుతోంది ఎవరో తెలుసా..?

“తిరుమలలో సంప్రదాయాలను మంట గలుపుతున్నారంట..” వైసీపీ నేతలు మామూలుగా ఆవేదన చెందడం లేదు. స్వామి వారి వీర భక్తులమైనట్లు.. ఎదో అపచారం జరిగిపోతోందన్నట్లు మీడియా మైకుల ముందు ఇదైపోతున్నారు. కానీ ఏ సంప్రదాయాలు మంటగలిపారో మాత్రం చెప్పడం లేదు. శ్రీనివాసుడ్ని అడ్డు పెట్టుకుని తెలుగుదేశంపై, ముఖ్యమంత్రి చంద్రబాబుపై రాజకీయంగా బురద జల్లేందుకు ఏ మాత్రం సంకోచించడం లేదు. శ్రీవారిని వారికో రాజకీయ సాధనంగా మార్చేసుకున్నారు. ఇప్పుడు వారు సంప్రదాయాల గురించి మాట్లాడుతున్నారు.
తిరుమల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌దే.. కాదు.. ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డిది కూడా…తీవ్రంగా పట్టాల్సిన విధానమే. క్రిస్టియన్ మతాచారాలను.. సంప్రదాయాలకు ఏ మాత్రం భంగం కలుగనివ్వని కటుంబం .. వైఎస్ కుటుంబం. అలాంటి వైఎస్… తిరుమల విషయంలో ఎన్నో సంప్రదాయాలను తోసిపుచ్చారు. ఓ సారి పార్టీ అధ్యక్షురాలి హోదాలో సోనియా గాంధీ తిరుమలకు వచ్చారు. అధికార మర్యాదలతో దర్శనం చేయించారు. అన్యమతస్తులు.. కచ్చితంగా తమకు స్వామిపై ఉన్న నమ్మకాన్ని డిక్లరేషన్ రూపంలో ఇవ్వాలి. ఇందు కోసం టీటీడీ ఉద్యోగులు పుస్తకం పట్టుకుని వెళ్తే వారిని తోసేసి.. శ్రీవారిని మించిన భక్తిని సోనియాపై చూపారు. అప్పుడే తిరుమల సంప్రదాయాలు మంటగలిసిపోయాయి.

తాను ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు… ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు ఇంట్లో.. తిరుమలలో… తాను ముఖ్యమంత్రి కావాలంటూ.. హోమం చేయించుకోవడం సంప్రదాయమా..? తిరుమల మొత్తం శ్రీనివాసుని నామస్మరణే ఉండాలి. పువ్వులు, సేవలు, యాగాలు…అన్నీ ఆయనకే సొంతం. తొలిసారి తాను సీఎం కావడానికి తిరుమల కొండంపై యాగం నిర్వహింపచేసి..వైఎస్ చేసిన దాన్నేమంటారు..?. అంతేనా… తాను క్రిస్టియన్‌ను అయినా… సరే… ముఖ్యమంత్రి హోదాలో శ్రీవారికి పట్టుబట్టలు సమర్పించేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు వైఎస్ఆర్. సీఎంగా శ్రీవారికి పట్టుబట్టలు పెట్టడం ఆయన హక్కు. కానీ సంప్రదాయాలు, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఆయినా.. విరమించుకోవాల్సింది. కానీ ఆయన విశ్వసించే దేవుడు కాదు కదా..!. ఆ తర్వాత ఏడు కొండలు కాదు.. రెండు కొండలే..అని జీవో ఇచ్చారు. శ్రీవారితోనే ఆటలాడారు.
అదే సంప్రదాయాన్ని ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాటిస్తున్నారు. హిందూ ఓట్ల కోసం చేస్తున్న ప్రయత్నాల్లో ఆయనకు మొదట తిరుమలేశుడే కనిపిస్తున్నాడు. అయినా దేవదేవుడి సంప్రదాయాలన్నీ ఆయనకు చట్టుబండలే. పాదయాత్ర ప్రారంభానికి ముందు తిరుమలకు వెళ్లారు. నడుచుకుంటూ వస్తానని ప్రకటించారు. ఏ శ్రీవారి భక్తుడైనా.. నడుచుకుంటూ వస్తానని ఓ సారి మనసులో అనుకున్నాడంటే… మాట తప్పడు.. మొక్కు తీర్చుకుంటాడు. కానీ జగన్… దాన్ని మర్చిపోయారు. దానిపై పట్టింపు లేదనట్లు…కారులో పైకెళ్లిపోయారు. దర్శనం తర్వాత తనకు శ్రీవారిపై నమ్మకం ఉందన్న డిక్లరేషన్ ఇవ్వడానికి నిరాకరించారు. అంతకు ముందు కూడా రగడే. అన్యమతస్తులు డిక్లరేషన్ ఇవ్వడం .. సంప్రదాయమని… చెప్పినా పట్టించుకోరు. శ్రీవారిపై విశ్వాసం ఉందని..చెప్పడానికి అంత నామోషీ అయినప్పుడు తిరుమల రావడం ఎందుకు..? సంప్రదాయాలను మంటగలపడం ఎందుకు..?. జగన్ తిరుమల వచ్చినప్పుడల్లా..ఆయన వంధిమాగధులు మొత్తం .. కొండలను.. “జై జగన్” నినాదలతో హోరెత్తిస్తారు. నిఖార్సైన శ్రీనివాసుని భక్తుడెప్పుడూ… గోవింద నామస్మరణ తప్ప.. మరో నినాదం చేయరు. కానీ కావాలనే జగన్ పర్యటనలో రాజకీయం కనిపిస్తుంది. చెప్పులతో సహా గుళ్లోకి వెళ్లడానికి ప్రయత్నాలు కనిపిస్తాయి. శ్రీనివాసుడి సంప్రదాయాలను ఇంత దారుణగా కించ పరిచిన..పరుస్తున్న వైసీపీ నేతలే.. ఇప్పుడు ఏమీ జరగకపోయినా.. ఏదో అయిపోతోందంటూ.. తిరుమల ప్రతిష్టతను దిగజార్చేందుకు వెనుకాడటం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]