పవన్ స్టామినా గుర్తించే ఉలిక్కి పడుతున్న వైసీపీ..!?

ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైసీపీ.. రాజధాని విషయంలో… పవన్ కల్యాణ్ రంగంలోకి దిగిన తర్వాత తమ వ్యూహం ఫెయిలయినట్లుగా భావిస్తోంది. అమరావతి ఐదు కోట్ల ఆంధ్రులది కాదని.. కేవలం.. ఒక సామాజికవర్గానిది మాత్రమేనని… చాలా ఉద్ధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా.. ఓ వ్యూహాన్ని వైసీపీ అంతకు ముందు ఖరారు చేసుకుంది. తెలుగుదేశం పార్టీ.. అమరావతి విషయంపై రాజకీయ ఆందోళనలకు సిద్ధమైన వెంటనే…. ఈ ప్రచారాన్ని ఇతర ప్రాంతాల ప్రజల్లోకి చొప్పిస్తే.. సునాయాసంగా పని పూర్తి చేయవచ్చని భావించింది. అయితే అనూహ్యంగా పవన్ కల్యాణ్ రంగంలోకి వచ్చారు. మరో ప్రధాన సామాజికవర్గానికి చెందిన నేతగా.. ఆయన స్పందన చాలా కీలంగా మారింది.

గతంలో.. పవన్ కల్యాణ్ .. అమరావతిపై సామాజికపరంగా విమర్శలు చేశారు. ఆ విమర్శలకు పవన్ కల్యాణ్ కట్టుబడి ఉంటే.. తమ ప్లాన్ మరింతగా వర్కవుట్ అవుతుందని ఊహించారు. కానీ… అనూహ్యంగా పవన్ కల్యాణ్… రాజధానిపై కుల ముద్ర వద్దనే విధానాన్ని తీసుకోవడంతో.. వైసీపీకి కాస్త క్లిష్టమైన పరిస్థితిఏర్పడినట్లయింది. అందుకే.. ఎప్పుడూ లేని విధంగా… వైసీపీ నేతలంతా… వరుసగా.. పవన్ కల్యాణ్ పై దాడి ప్రారంభించారు. వైసీపీ ఆశించినట్లుగా చెప్పకపోవడంతో.. విజయసాయిరెడ్డి కూడా ఫీలయ్యారు. అమరావతి అంశంలో ఆయన యూటర్న్ తీసుకున్నారని విమర్శలు గుప్పించారు.

గతంలో చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక్కసారి కూడా ప్రశ్నించలేదని.. వైసీపీపై అవనసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బొత్స, ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా అదే చెప్పారు. పవన్ కల్యాణ్ సూటిగా చేస్తున్న విమర్శల గురించి ఏ మాత్రం మాట్లాడని.. వైసీపీ నేతలు.. పవన్ ను.. టీడీపీకి లింక్ పెట్టడానికి మాత్రం ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి పవన్ కల్యాణ్.. ఏ మాత్రం..విస్మరించదగిన నేత కాదని.. సీరియస్‌గానే.. తమ రాజకీయ వ్యూహాలను అమలు చేయాల్సి ఉందని.. వైసీపీ నేతలు గుర్తించి.. ఇలా రివర్స్ ఎటాక్ ప్రారంభించినట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అప్రూవర్ గా శరత్ చంద్రారెడ్డి…కవితకు బెయిల్ దక్కేనా..?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ అధికారుల వద్ద అప్రూవర్ గా మారిన శరత్ చంద్రారెడ్డి తాజాగా సీబీఐ అధికారుల ముందు కూడా అప్రూవర్...

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close