‘గీతా’లో మరో సంతకం

‘బొమ్మరిల్లు’ సినిమా దర్శకుడు భాస్కర్ జాతకాన్ని మార్చేసింది. ఆ సినిమానే ఆయన ఇంటిపేరు అయింది. రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి పెద్ద హీరోలతో సినిమా చేసే ఛాన్స్ త్వరగానే వచ్చేసింది. అయితే బొమ్మరిల్లు సినిమానే భాస్కర్ కి ఒక శాపంగా కూడా మారింది. భాస్కర్ ఎలాంటి సినిమా తీసిన ‘బొమ్మరిల్లు’ అంత గొప్పగా లేదనే విమర్శని ఎదురుకోవాల్సి వచ్చింది. అయితే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’తో ఓకే అనిపించారు భాస్కర్. అటు అఖిల్ కి కూడా ఈ సినిమాతో కొంత ఉపసమనం లభించింది. వసూళ్ళు కూడా బావున్నాయి.
హిట్ మీద నడిచే ఇండస్ట్రీ ఇది. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ కి ఆ టాక్ రావడంతో భాస్కర్ మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారు. ఇప్పుడు మళ్ళీ గీతాఆర్ట్స్ బ్యానర్‌లోనే మరో చిత్రం చేసేందుకు ఒప్పందం కుదిరిందని తెలిసింది. ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ ని చాలా లిమిటేషన్స్ లో తెరకెక్కించారు భాస్కర్. మేకింగ్ లోనే కాదు.. రేమ్యునిరేషన్ విషయంలో కూడా బాగా తగ్గారు. నెల జీతానికి పని చేశారని ఇన్ సైడ్ టాక్ వినిపించింది. అయితే చేయబోయే కొత్త సినిమా విషయంలో మాత్రం తనకు పూర్తి స్వేఛ్చ కావాలని భాస్కర్ కోరడం, దానికి నిర్మాత అంగీకరించడం జరిగిందట. మొత్తానికి ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ భాస్కర్ కి కొత్త జోష్ ఇచ్చింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పెళ్లి లైవ్‌లో చూపిస్తే.. వంద కోట్లు

బాలీవుడ్ లో మేట‌రే వేరు. అక్క‌డ దేన్న‌యినా స‌రే ప్ర‌చారంగా, వ్యాపారంగా మార్చేసుకుంటుంటారు. ఆఖ‌రికి పెళ్లి కూడా. సెల‌బ్రెటీలు ప్రేమించి పెళ్లి చేసుకుంటేవిప‌రీత‌మైన మైలేజీ. ఇప్పుడు క‌త్రినా - విక్కీల పెళ్లికీ అంత‌టి...

‘ఛ‌త్ర‌ప‌తి’కి టైటిల్ కావ‌లెను

తెలుగులో సూప‌ర్ హిట్ట‌యిన `ఛ‌త్ర‌ప‌తి`ని బాలీవుడ్ లో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్ట‌బోతున్నాడు. వినాయ‌క్ ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌కూ ఇదే తొలి హిందీ...

ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌...

తెలంగాణలో “బియ్యం స్కాం” బద్దలవబోతోందా !?

తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు చుట్టూ రాజకీయాలు నడుస్తున్నారు. సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఆ ఆంశంపైనే దృష్టి కేంద్రీకరించి బీజేపీని నిలుపుదల చేయాలని చూస్తున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కేసీఆర్...

HOT NEWS

[X] Close
[X] Close