‘టి న్యూస్‌’కు నోటీస్ ఇవ్వటంపై టి జర్నలిస్టుల నిరసనలు

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీసులు శుక్రవారంరాత్రి హైదరాబాద్‍‌లోని ‘టి న్యూస్’ ఛానల్‌కు నోటీసులు ఇవ్వటానికి వ్యతిరేకంగా తెలంగాణ జర్నలిస్టులు ఏపీ సచివాలయం ఎదుట, ఏపీ డీజీపీ కార్యాలయం ఎదుట ఇవాళ నిరసనలు నిర్వహించారు. ఏపీ సీఎమ్, డీజీపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జర్నలిస్టుల నిరసనలతో ఏపీ సచివాలయం, డీజీపీ ఆఫీసువద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దసంఖ్యలో మోహరించిన పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. సీఎమ్ చంద్రబాబు, తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌లమధ్య జరిగినట్లు చెబుతున్న టెలిఫోన్ సంభాషణలను ప్రసారం చేశారనే ఆరోపణలపై విశాఖ ఏసీపీ రమణ టీన్యూస్ ఛానల్‌కు నోటీసులు ఇచ్చారు. ఈ సంభాషణల వార్త ఏపీ, తెలంగాణ ప్రజలలో సామరస్యాన్ని దెబ్బతీసేటట్లుగా ఉందని, రెండు రాష్ట్రాలలోని తెలుగు ప్రజలు, రాజకీయ పార్టీలమధ్య విద్వేషాలను రగిల్చేవిధంగా ఉన్నాయని, ఏపీ ముఖ్యమంత్రి ప్రతిష్ఠను దెబ్బతీసేవిధంగా ఉందని ఆ నోటీసులో ఆరోపణ. దీనికి సంబంధించి టీ న్యూస్ ఛానల్‌పై చట్టపరమైన చర్య ఎందుకు తీసుకోగూడదో మూడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో అడిగారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close