[X] Close
[X] Close
మహేష్ అట్లీతో ఒప్పుకుంటాడా..?

సూపర్ స్టార్ మహేష్ తో సినిమా తీయాలని ఏ దర్శకుడికి మాత్రం ఉండదు చెప్పండి. ప్రస్తుతం బ్రహ్మోత్సవం ముగింపు కార్యక్రమాల్లో ఉన్న మహేష్ తర్వాత వెంటనే మురుగదాస్ సినిమాకు రెడీ అయిపోతున్నాడు. ఇక ఈ మధ్యలోనే మహేష్ కు కథ చెప్పేందుకు రోజుకో దర్శకుడు కలుస్తారనుకోండి. ఈ మధ్య విజయ్ తేరి అదే తెలుగులో పోలీస్ (పోలీసోడు) దర్శకుడు అట్లీ కూడా మహేష్ కు కథ వినిపించాడని రూమర్స్ వచ్చాయి. మహేష్ కూడా అట్లీ లాంటి యంగ్ టాలెంటెడ్ డైరక్టర్స్ తో చేసేందుకు సిద్ధం అనే సిగ్నల్ ఇస్తున్నాడు.

కాకపోతే నిన్న రిలీజ్ అయిన పోలీస్ సినిమా కోలీవుడ్ లో విజయ్ కు ఉన్న ఫాలోయింగ్ కు సూపర్ అనేస్తున్నా.. తెలుగు ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను పటాస్, టెంపర్ అంటూ రకరకాల సినిమాలతో పోల్చుతున్నారు. సినిమా చూస్తే అదే నిజం అని చెప్పక తప్పదు. మన దగ్గర వచ్చిన కథలను మళ్లీ తిప్పి మనకే చూపించాలనుకున్న దర్శకుడి ప్రయత్నం వృధా అయ్యింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత మహేష్ బాబు సినిమా కోసం ప్రయత్నిస్తున్న అట్లీను చూసి అభిమానులు కంగారు పడుతున్నారు. మళ్లీ ఇలాంటి కథతోనే మహేష్ బాబుతో సినిమా తీసే ఆలోచన ఏమన్నా చేస్తాడేమో అన్న భయం వారిది. అయితే మహేష్ సినిమాల జడ్జ్ మెంట్ లో పర్ఫెక్ట్ కాబట్టి అట్లీ దర్శకత్వంలో చేసే ఆలోచనని విరమించుకుంటాడనే అనుకుంటున్నారు. సో మొత్తానికి అట్లీ ఓ సూపర్ ఆఫర్ ను మిస్ చేసుకున్నట్టే లెక్క.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com

Most Popular

ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ పొడిగించిన ఒడిశా

కరోనా వ్యాప్తి నివారించడానికి భారత ప్రభుత్వం విధించిన 21 రోజుల లాక్ డౌన్ ఏప్రిల్ 15వ తేదీన ముగియనుంది. అయితే ఏప్రిల్ 15వ తేదీకి లాక్ డౌన్ ఎత్తివేసే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం...

క‌రోనా ఎఫెక్ట్ : బొమ్మ‌కి ‘బొమ్మ’ క‌నిపించ‌డం ఖాయం

బిఫోర్ క‌రోనా - ఆఫ్ట‌ర్ క‌రోనా అని విడ‌దీసుకుని చూసుకోబోతున్నామేమో..? ప‌రిస్థితులు అలానే క‌నిపిస్తున్నాయి. ఎందుకు పుట్టిందో తెలీదు గానీ, ఈ మ‌హ‌మ్మారి వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ త‌ల‌కిందులు చేసేసింది. మ‌నిషి మ‌నుగ‌డ‌కే ప్ర‌శ్నార్థ‌కంగా...

12 గంటల్లో ఏపీలో ఒక్కటీ నమోదు కాని పాజిటివ్ కేస్.!

ఆంధ్రప్రదేశ్‌లో గత పన్నెండు గంటల్లో ఒక్కటంటే.. ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. నిన్న రాత్రి తొమ్మిది గంటల నుండి ఈ ఉదయం తొమ్మిది గంటల వరకూ... చేసిన...

అయితే పచ్చ మీడియా..లేకపోతే కులం..! వైసీపీ ఎదురుదాడి అస్త్రాలు ఈ రెండే..!?

ఆంధ్రప్రదేశ్‌లో యూనివర్శిటీల పాలక మండళ్ల నియామకం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమవుతోంది. వైరస్ తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న దశలో.. యంత్రాంగం మొత్తం... దానిపైనే దృష్టి పెట్టినా... హఠాత్తుగా వర్శిటీల...

HOT NEWS