క్రైమ్: “ఆర్.ఎక్స్ 100” ప్రభావంతో ఇద్దరు విద్యార్థుల ఆత్మహత్య..!

సినిమాలు.. ఎదిగీ ఎదగని మనసులపై ఎంత దారుణమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయో.. జగిత్యాల జిల్లాలో జరిగిన ఇద్దరు పదో తరగతి విద్యార్థుల ఘటనను చూస్తే తెలిసిపోతుంది. జగిత్యాలకు చెందిన రవితేజ, మహేందర్ స్నేహితులు. ఇద్దరూ పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు వేరువేరు అమ్మాయిలను ప్రేమించారు. అది వన్ సైడ్ లవ్. వారి చెప్పిన మాటలను… ఆ అమ్మాయిలు పట్టించుకోలేదు. దాంతో.. ఆ అమ్మాయిలు తమను మోసం చేశారన్న భావనతో.. చచ్చిపోవాలనుకున్నారు. మద్యం బాటిళ్లు .. బాటిళ్లు పెట్రోల్‌లో నింపుకుని.. ఓ నిర్మానుష్య ప్రదేశానికి వెళ్లారు. అక్కడ మద్యం తాగారు. మత్తులో పెట్రోల్ ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ ఘటన జగిత్యాలలో కలకలం రేగింది. హత్య అన్న కోణంలో పోలీసులు విచారణ జరిపారు. కానీ వారి సెల్ ఫోన్లు, వాట్సాప్ చాటింగ్‌ను పరిశీలించగానే అసలేం జరిగిందో తెలిపోయింది.

విద్యార్థులిద్దూర వేర్వేరు అమ్మాయిల‌ను ప్రేమించారు. విషయాన్ని చాటింగ్‌లలో మాట్లాడుకున్నారు. అమ్మాయిలు పట్టించుకోవడం లేదని… నిర్ణయించుకున్నారు. అప్పుడే వారి మధ్య ఆర్.ఎక్స్ 100 సినిమా గురించి చర్చ జరిగింది. అందులో హీరో.. హీరోయిజంతో చచ్చిపోయాడని.. మనం కూడా అలాగే చచ్చిపోదామని చర్చించుకున్నారు. ఇక మద్యం తాగడం కూడా హీరోయిజంగానే భావించారు. ఆ సినిమా స్ఫూర్తితో ఆత్మహత్య చేసుకున్నారు. స్నేహితుల మధ్య జరిగిన వాట్సాప్‌ చాటింగ్‌ .. కాల్ డేటా పోలీసులు విశ్లేషిస్తున్నారు.

పోలీసులు వారిద్దరికీ స్మార్ట్ ఫోన్లు ఉండటంతో.. నీలి చిత్రాలు చూసేందుకు అలవాటు పడ్డారని గుర్తించారు. వారిద్దరూ తరచూ స్కూల్‌కు దగ్గరలో ఉన్న మిషన్ కాంపౌండ్‌లోని చెట్ల మధ్య ఉన్న ఓ పాడుబడ్డ బంగ్లా వద్దకు వెళ్లేవారు. అక్కడే సెల్‌ఫోన్లలో బూతు బొమ్మలు చూస్తూ మద్యం తాగడం లాంటి చెడు అలవాట్లను నేర్చుకున్నారు. తాము చనిపోవాలనుకున్న రోజు కూడా.. అక్కడికే వెళ్లారు. అక్కడి వెళ్లే ముందు బాటిల్‌లో పెట్రోలు తీసుకుని వెళ్లారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మంటలు చెలరేగడాన్ని స్థానికులు దూరం నుంచి గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు. కానీ వారి ప్రాణాలు కాపాడలేకపోయారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రాయలసీమపైనే షర్మిల గురి !

కాంగ్రెస్ పార్టీ బలాన్ని రాయలసీమలో బలంగా చూపించేలా షర్మిల ప్రయత్నం చేస్తున్నారు. విస్తృత పర్యటనలు చేస్తున్నారు. కడప పార్లమెంట్ నియోజవకర్గం మొత్తం ఓ సారి సంచలనం రేపారు. వైఎస్ వివేకా హత్య...

‘సైరెన్’ రివ్యూ: థ్రిల్ తక్కువ… డ్రామా ఎక్కువ

ఎమోషనల్ డ్రామా టచ్ తో క్రైమ్ థ్రిల్లర్స్ రావడం అరుదే. జయం రవి, కీర్తి సురేశ్‌ కీలకపాత్రల్లో నటించిన ‘సైరెన్‌’ ఇలాంటి ట్రీట్మెంట్ తోనే తయారైయింది. చేయని తప్పుకు శిక్షని అనుభవించిన వ్యక్తి...

ధోనీ… ఆ మెరుపులు మ‌ళ్లీ!

కెరీర్ తొలి రోజుల్లో ధోనీ చాలా ధాటిగా ఆడేవాడు. త‌ను ఆడిన తుపాను ఇన్నింగ్సులు ఎన్నో. ఆ దూకుడు చూసే అత‌న్ని అభిమానించ‌డం మొద‌లెట్టారు. సీనియారిటీ పెరిగేకొద్దీ, త‌న వికెట్ ఎంత విలువైన‌దో...

బస్సు యాత్రలో కేసీఆర్‌కు ఎదురయ్యే మొదటి ప్రశ్న : ఇప్పుడు గుర్తొచ్చామా ?

కేసీఆర్ బస్సు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నారు. అది ఎన్నికల ప్రచారమే. కానీ అలా చెప్పడానికి కూడా కేసీఆర్ కు.. బీఆర్ఎస్ కు ధైర్యం లేదు. ప్రజల కోసమే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close