ఫూల్స్ డే నాడు 14 సినిమాలు రిలీజ్..!

వారంలో రెండు మూడు సినిమాలు రిలీజ్ అయితేనే ప్లాన్ చేసుకున్నా సినిమాకెళ్లలేని ఈరోజుల్లో.. ఒకేరోజు 14 సినిమాల రిలీజ్ అవ్వడం కాస్త షాకింగ్ అనే చెప్పాలి. అవును ఏప్రిల్ 1న ఏకంగా 14 సినిమాలు తెలుగులో రిలీజ్ అవుతుండటం విశేషం. వీటిలో చెప్పుకోదగ్గ సినిమాలు కేవలం రెండు మూడే అయినా సినిమాలు మాత్రం 14 దాకా వస్తున్నాయి.

రాం గోపాల్ వర్మ మంచు మనోజ్ కాంబినేషన్ లో వస్తున్న ఎటాక్, పవన్ సాధినేని నారా రోహిత్ కలయికలో వస్తున్న సావిత్రి మాత్రమే ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. ఇక ఇది కాకుండా శర్వానంద్, నిత్యా మీనన్ హీరో హీరోయిన్స్ గా నటించిన రాజాధిరాజా సినిమా కూడా ఏప్రిల్ 1న వస్తుంది.

ఇవే కాకుండా సెల్వ రాఘవన్ భార్య గీతాంజలి తెరకెక్కించిన నన్నువదిలి నీవు పోలేవులే, అప్పుడలా ఇప్పుడిలా, పిడుగు, 7 టు 4, మాస్ (తమిళ్ మారి డబ్బింగ్), ఆమె ఎవరు, భరతన్న, ఓ మల్లి, రహదారి, 24 అవర్స్, ధనాధన్ సినిమాలు తెలుగు బాక్సాఫీస్ మీద తమ అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు రెడీ అవుతున్నాయి. అయితే ఇందులో కేవలం కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులు చూసే అవకాశం ఉంది. మిగతా సినిమాలు అసలు వచ్చాయా లేదా అన్న ఆలోచన కూడా ఎవరికి తెలియదు. అదీగాక ఈ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close