పెద్దాయన అధికారాలకి కోత పెట్టారు

పాలనలోకి వచ్చిన నాటినుంచి అనేకానేక విషయాల్లో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ.. బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా దూసుకెళ్తున్నామని చెబుతూ వస్తున్న కల్వకుంట్ల వారి సర్కారు తాజాగా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రథమ పౌరుడు, గవర్నర్‌ నరసింహన్‌ అధికారాలకు కూడా కోత పెట్టింది. గవర్నర్‌ అంటేనే ప్రాథమికంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను ఆమోదించడం తప్ప, వాటికి ఆమోద ముద్ర వేయడం తప్ప.. స్వతంత్రంగా వ్యవహరించగల పని అంటూ ఏదీ ఉండదని అంతా అనుకుంటూ ఉంటారు. చాలా వరకు అది నిజం కూడా అలాంటి నేపథ్యంలో.. ఆయన తనకు పూర్తి అధికారాలు ఉన్నట్లుగా భావించే ఒక వ్యవస్థ… యూనివర్సిటీల వ్యవస్థ. రాష్ట్రంలో ఉండే అన్ని యూనివర్సిటీలకు సాధారణంగా గవర్నరే ఛాన్సలర్‌గా ఉంటారు. వైస్‌ ఛాన్సలర్ల నియామకం రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసు మేరకు జరిగేదే అయినప్పటికీ.. ఛాన్సలర్‌గా ఆయనకు యూనివర్సిటీల మీద విశిష్ట అధికారాలు ఉంటాయనడంలో సందేహం లేదు. అయితే తాజాగా కేసీఆర్‌… అసెంబ్లీలో పాస్‌ చేసిన ఒక బిల్లు ద్వారా.. గవర్నర్‌ నరసింహన్‌ అధికారాలకు కోత పెట్టింది.

రాష్ట్రంలోని యూనివర్సిటీలు గాడి తప్పుతున్నాయని… వాటిని దారిలో పెట్టాల్సిన అవసరం ఉన్నదని ప్రకటించిన సీఎం కేసీఆర్‌ వీసీల సహా, చాన్సలర్‌ల నియామక అధికారాలు కూడా ప్రభుత్వం చేతిలోనే ఉండేలా చట్టం చేశారు. దీనివలన ప్రతి యూనివర్సిటీకి విడివిడిగా చాన్సలర్‌ల నియామకం కూడా జరుగుతుంది. ప్రస్తుతం అంబేద్కర్‌, రాజీవ్‌ గాంధీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీలకు చాన్సలర్‌ ల నియామకంతో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలు మొదలవుతాయి.

గవర్నర్లు నాంకేవాస్తే వర్సిటీల చాన్సలర్లు అయినప్పటికీ.. అందులో వారి జోక్యం గతంలో పరిమితంగానే ఉండేది. కానీ నరసింహన్‌ గవర్నర్‌ అయ్యాక కాస్త ఎక్కువ జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. చివరికి అసలు గవర్నరుకు వర్సిటీలతో సంబంధమే లేకుండా కేసీఆర్‌ సర్కారు చేసేశారు. ఇప్పుడు ప్రతి వర్సిటీకి ఒక సుప్రీం లేదా హైకోర్టు మాజీ న్యాయమూర్తులను, తత్సమానమైన మేధావులను నిపుణులను చాన్సలర్‌లుగా నియమించే అవకాశాన్ని కేసీఆర్‌ సర్కారు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ నిర్ణయంతో కేసీఆర్‌ సర్కారుకు తమకు కావాల్సిన వారికి ఉన్నత హోదా గల కీలక పదవులు కట్టబెట్టడంలో మరింత వెసులుబాటు చిక్కినట్లే లెక్క. పార్టీ మెచ్చిన మేధావులకు చాన్సలర్‌ల పోస్టులు ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వవచ్చు. మాజీ న్యాయమూర్తులకు పదవులు ఇస్తాం అని కేసీఆర్‌ అనుకుంటున్నారు గాబట్టి.. ఈ నిర్ణయం వల్ల ఇతరత్రా రాజకీయ పరమైన ప్రయోజనాలు కూడా ప్రభుత్వానికి పుష్కలంగా ఉంటాయని పలువురు అంచనా వేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కట్‌ చేసిన జీతాలు,పెన్షన్లను 12 శాతం వడ్డీతో చెల్లించాల్సిందే..!

కరోనా పేరు చెప్పి రెండు నెలల పాటు సగం సగం జీతాలే ఇచ్చిన ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది. జీతాలు, పెన్షన్‌ బకాయిలు చెల్లించాలని ఆదేశించింది.మార్చి, ఏప్రిల్ నెలల్లో బకాయిపడిన 50శాతం...

జగన్ అనుకుంటే అంతే.. ! ఎమ్మెల్సీ టిక్కెట్ ఆయన కుమారుడికి..!

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏదైనా అనుకుంటే ఇట్టే నిర్ణయం తీసుకుంటారు. దానికి ముందూ వెనుకా ఎలాంటి మొహమాటాలు పెట్టుకోరు. దానికి తాజాగా మరో ఉదాహరణ ఎమ్మెల్సీ సీటుకు అభ్యర్థి ఎంపిక. రాజ్యసభకు...

వైసీపీలోనూ అలజడి రేపుతున్న రాపాక..!

జనసేన తరపున గెలిచి తాను వైసీపీ మనిషినని చెప్పుకుంటున్న రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు ఆ పార్టీలోనూ చిచ్చు పెడుతున్నారు. రాజోలు వైసీపీలో మూడు గ్రూపులున్నాయని.. అందులో తనది ఒకటని స్వయంగా...

బిగ్ బాస్ – 4 వాయిదా?

బిగ్ బాస్ రియాలిటీ షో.. తెలుగులోనూ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఎన్టీఆర్‌, నాగార్జున‌, నాని లాంటి హోస్ట్ లు దొర‌క‌డంతో బిగ్ బాస్ కి తెలుగు ఆన‌ట ఆద‌ర‌ణ ద‌క్కింది. ఇప్పుడు నాలుగో సీజ‌న్...

HOT NEWS

[X] Close
[X] Close