అమరావతిలో రెండెకరాల ఇల్లు..! జగన్ రేంజ్‌కు తగ్గట్లుగానే..!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవ్యాంధ్ర రాజధానికి మకాం మార్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించగానే…కృష్ణానది ఒడ్డున ఉండే.. తాడేపల్లి గ్రామంలో… ఓ రెండెకరాల భూమిని కొనుగోలు చేసి.. ఇంటి నిర్మాణం చేపట్టారు. ఈ విషయం నిన్నామొన్నటి వరకూ గుట్టుగానే ఉంది. అక్కడో ఇంద్ర భవన నిర్మాణం జరుగుతోందని… అది జగన్‌దేనని చాలా రోజులుగా ఆ చుట్టుపక్కల ప్రజలు చెప్పుకున్నారు కానీ.. ఎప్పుడూ అక్కడ ఎలాంటి హడావుడి కనిపించలేదు. దాంతో.. అవునో కాదో అనుకున్నారు కానీ.. చివరికి క్లారిటీ వచ్చేసింది. ఆ ఇల్లు… అలియాస్ ఇంద్రభవనం.. జగన్మోహన్ రెడ్డిదేనని.. ఆయనే స్వయంగా క్లారిటీ ఇచ్చారు. వచ్చే నెల 14వ తేదీన గృహప్రవేశం కూడా ఉంటుందని ప్రకటించేశారు. ఇప్పుడు ఆ ఇల్లు ఎలా ఉంటుందనే ఆసక్తి చాలా మందిలో ఉంది.

జగన్ రేంజ్‌కు తగినట్లుగానే ఆ ఇల్లు నిర్మాణం జరుగుతోంది. మొత్తంగా ఆ ఇల్లు రెండు విభాగాలుగా ఉంటుంది. ఒకటి ఇల్లు, రెండు పార్టీ ఆఫీసు. ఇల్లు పెద్దగా.. పార్టీ ఆఫీసు కొంచెం చిన్నదిగా ఉంటుంది. ఇంట్లో యాభై గదుల వరకూ ఉండవచ్చని… ఆ ఇల్లు సైజుని బట్టి నిర్మాణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఇంటీరియల్ గురించి ఎలాంటి సమాచారం బయటకు రావడం లేదు. కానీ.. అన్నీ జగన్ రేంజ్‌లోనే ఉండబోతున్నాయని… ఇతర రాష్ట్రాల నుంచి లారీల్లో వస్తున్న నిర్మాణ సామాగ్రి తెలియజేస్తోందని.. ఆ చుట్టుపక్కల ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు. బెంగళూరు యలహంక ప్యాలెస్, హైదరాబాద్ లోటస్ పాండ్‌లకు తీసిపోని రీతిలోనే ఇంటి నిర్మాణం జరుగుతోంది. అయితే.. ఈ ఇల్లు జగన్ సొంత డబ్బులతో కడుతున్నారా లేక.. సూట్ కేసు కంపెనీల పేరు మీదనా అనేది.. ఎన్నికల అఫిడవిట్ చూసిన తర్వాతే వెలుగులోకి వస్తుంది.

నిజానికి జగన్మోహన్ రెడ్డికి ఇంటి నిర్మాణం అచ్చి రావడం లేదు. వైఎస్ సీఎం అయిన తర్వాత పులివెందుల, కడపల్లో రెండు ఇళ్లు కట్టించారు. కానీ… ఆయా చోట్ల… ఉండేది తక్కువ.. అప్పట్లో వ్యాపారం అంతా బెంగళూరులోనే కాబట్టి.. ఉండేందుకు యలహంక దగ్గర ఓ ప్యాలెస్ కట్టించుకున్నారు. నిర్మాణం పూర్తయి… ఇంట్లోకి వెళ్లే సమయంలో.. అనుకోని ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. దాంతో.. ఆ ప్యాలెస్ గురించి గొప్పగా చెప్పుకోవడమే తప్ప… ఉండే అవకాశం లభించలేదు. ఇక సొంత పార్టీ పెట్టుకున్నాం కాబట్టి.. హైదరాబాద్‌లోనే గడపాలి కాబట్టి… అక్కడా ఓ సొంత ఇంటి నిర్మాణం చేపట్టారు. లోటస్ పాండ్‌లో భారీ ఎత్తున ఇంటి నిర్మాణం జరిగింది. వేగంగా పూర్తయినప్పటికీ… ఆ ఇంట్లో చేరే సమయానికి రాజకీయం ఏపీకి తరలిపోయింది. … ఇక వెంటనే.. మళ్లీ అమరావతిలో నిర్మాణం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు ఆ ఇంట్లో గృహప్రవేశం చేయబోతున్నారు. అది లాంఛనమే. కుటుంబాన్ని మార్చడానికి సమయం పడుతుంది. అయితే.. ఆ లోపే ఎన్నికలొస్తాయి. ఆ తర్వాత మరో ఇల్లు ఎక్కడైనా నిర్మించాల్సిన పరిస్థితి వస్తుందేమో..?.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అలా చేస్తే రాహుల్ నపుంసకుడో కాదో తేలుతుంది..కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు

ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెళ్లి విషయంపై బీజేపీ నేతలు కామెంట్స్ చేయడం పరిపాటిగా మారింది. ఆయనకు మగతనం లేదని అందుకే పెళ్లి చేసుకునేందుకు భయపడుతున్నారని బీజేపీ నేతలు...

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close