యాబై శాతం లెక్కపెట్టి తీరాల్సిందే..! మళ్లీ సుప్రీంకోర్టుకు 21 పార్టీలు ..!

వీవీ ప్యాట్లలోని ఓటింగ్ స్లిప్పులు యాభై శాతం లెక్కించాల్సిందేనని… 21 రాజకీయ పార్టీలు.. మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. గతంలో.. అసెంబ్లీ నియోజకవర్గానికి ఐదు చొప్పున లెక్కించాలంటూ.. ఇచ్చిన తీర్పుపై.. సమీక్ష నిర్వహించి… తీర్పును సవరించాలని ఈ ఇరవై ఒక్క రాజకీయ పార్టీలు సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేశాయి. ఈవీఎంలలో ఏర్పడుతున్న సాంకేతిక లోపాలు.. దేశవ్యాప్తంగా.. పోలింగ్ సందర్భంగా… వెల్లడవుతున్న అనుమానాలతో.. రాజకీయ పార్టీలు.. వీవీ ప్యాట్ లలోని స్లిప్పులను లెక్కించేందుకు రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయించాయి. ఇప్పటి వరకూ మూడు విడతలుగా జరిగిన ఎన్నికల్లో… ఈవీఎంలలో సాంకేతిక సమస్యలు పెద్ద ఎత్తున వచ్చాయి. వీటిని కొన్ని సార్లు కొత్త వాటితో రీప్లేస్ చేశారు. అలాగే.. వాటిని బాగు చేసేందుకు కొన్ని వేల మంది ఇంజినీర్లను ఉపయోగించారు.

అయితే.. వీటిని సాంకేతిక ఇబ్బందుల పేరుతో.. బాగు చేస్తున్నారా.. లేక మ్యానిపులేట్ చేస్తున్నారా.. అన్న అనుమానాలు కూడా రాజకీయవర్గాల్లో వస్తున్నాయి. ఈ క్రమంలో.. ఈవీఎంల విశ్వసనీయత ప్రశ్నార్థకం కాకుండా ఉండాలంటే.. ఉన్న ఏకైక మార్గం… వీవీ ప్యాట్ మిషన్లలోని స్లిప్పులను లెక్కించడం. మొత్తం లెక్కిస్తే.. ఇబ్బంది అవుతుందనుకుంటే.. యాభై శాతం లెక్కించాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈసీ మాత్రం.. కొత్త తరహా సూత్రీకరణలు చేస్తోంది. రక్తపరీక్షకు ఒక్క సారి రక్తం తీసుకుంటే చాలని.. సీఈసీ సునీల్ అరోరా వ్యాఖ్యానించి కలకలం రేపారు.తొలి విడత పోలింగ్ ముగిసినప్పటి నుంచి… టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు… వీవీ ప్యాట్లలోని స్లిప్పులు యాభై శాతం లెక్కించాలనే దానిపైనే … విస్తృతంగా పోరాట కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లినా ఆయన నినాదం అదే.

అయితే విపక్ష పార్టీల ఈవీఎంల పోరాటంపై ప్రధానమంత్రి నరేంద్రమోడీ అసహనం వ్యక్తం చేస్తున్నారు. జార్ఖండ్‌లో ఓ ఎన్నికల ప్రచారసభలో మాట్లాడిన ఆయన.. మూడు విడతలు ముగిసే సరికి.. విపక్ష పార్టీలన్నీ… ఓటమిని అంగీకరించాయని.. అందుకే.. ఈవీఎంలపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. విపక్ష పార్టీలు మాత్రం.. మోడీని ప్రజలు తిరస్కరించారని.. ఆ విషయంలో తమకు ఎలాంటి అనుమానం లేదంటున్నారు. తమ అనుమానం మాత్రం.. ఈవీఎంలను మేనేజ్ చేసి మోడీ మళ్లీ ప్రధాని అవుతారనే అంటున్నారు. అందుకే వీవీ ప్యాట్ స్లిప్పులను లెక్కించాలని డిమాండ్ చేస్తున్నామంటున్నారు. ఏ విధంగా చూసినా.. 50 శాతం వీవీ ప్యాట్ స్లిప్పులు లెక్కిస్తే.. ఈ సారి ఎన్నికలపై విశ్వాసం పెరిగే అవకాశం ఉంటుంది. లేకపోతే.. అనుమానాలు ఎప్పటికీ మిగిలి ఉంటాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హైకోర్టు తీర్పుకే వక్రభాష్యం..! ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా..?

నిమ్మగడ్డ రమేష్‌కుమార్ విషయంలో ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందా.. అన్న అభిప్రాయం న్యాయనిపుణుల్లో వినిపిస్తోంది. ఇప్పటి వరకూ వివిధ కేసుల్లో హైకోర్టు తీర్పును అమలు చేయకుండా.. దొడ్డిదారి ప్రయత్నాలు చేశారు... కానీ...

ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లే వరకూ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకోకూడదట..!

స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా నిమ్మగడ్డ రమేష్‌కుమార్ బాధ్యతలు తీసుకున్నట్లుగా ప్రకటించుకుని.. సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం చట్ట విరుద్ధమని తాజాగా ఏపీ ప్రభుత్వం వాదన వినిపించడం ప్రారంభించింది. సోమవారం.. ఎస్‌ఈసీగా రమేష్...

అన్‌లాక్ 1 : 8వ తేదీ నుంచి హోటళ్లు, ఆలయాలు ఓపెన్..!

దేశంలో లాక్‌డౌన్‌ను కంటెన్మెంట్‌జోన్లకే పరిమితం చేస్తూ... కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్ డౌన్‌ ముగింపు కోసం.. అన్‌లాక్ పాలసీని ప్రకటించింది. దీనిలో భాగంగా జూన్ ఎనిమిదో తేదీ నుంచి ఆలయాలు, హోటళ్లు,...

ఇన్ సైడ్ న్యూస్: సొంత పత్రిక , ఛానల్ ప్రారంభించడం కోసం జనసేన కసరత్తు

త్వరలోనే సొంత పత్రిక, టీవి ఛానల్ ప్రారంభించాలనే యోచన తో జనసేన పార్టీ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు పార్టీలో క్యాడర్ నుంచే కాకుండా, పార్టీ ముఖ్య నేతల...

HOT NEWS

[X] Close
[X] Close