తెదేపాతో పొత్తుల వల్లే నష్టపోయాము: కిషన్ రెడ్డి

తెలంగాణా భాజపా మాజీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మొదటి నుంచి కూడా తెదేపాతో పొత్తులను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నారు. అదే విషయం ఆయన గతంలో చూచాయగా చెప్పారు పదవి నుంచి తప్పుకొన్నాక ఇప్పుడు బహిరంగంగా చెపుతున్నారు.

ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ “తెదేపాతో పొత్తులు వద్దని మేము మొదటే మా అధిష్టానానికి చెప్పాము  కానీ మా అభిప్రాయం మన్నించకుండా తెదేపాతో పొత్తులు పెట్టుకొంది. ఆ కారణంగా తెలంగాణాలో భాజపా చాలా నష్టపోయింది. రాష్ట్ర ప్రజలలో తెదేపాపై దురాభిప్రాయం నెలకొని ఉన్నపుడు దానితో మేము పొత్తులు పెట్టుకోవడం వలన ఆ ప్రభావం మా పార్టీపై కూడా పడింది. అదే 2014 ఎన్నికలలో భాజపా ఒంటరిగా పోటీ చేసి ఉండి ఉంటె పరిస్థితి వేరేగా ఉండేది. ఇప్పటికయినా మా అధిష్టానం ఈ విషయంలో తగిన నిర్ణయం తీసుకొంటే బాగుంటుంది,” అని అన్నారు.

తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన కొత్తలో తెలంగాణా సెంటిమెంట్ చాలా బలంగా ఉండేది. దానిని తెరాస చాలా సమర్ధంగా వినియోగించుకొని అధికారంలోకి వచ్చింది. ఎంత సమర్ధంగా అంటే తెలంగాణా ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీని కూడా ఓడించగలిగినంత! ఆ సమయంలో తెదేపాతో పొత్తులు పెట్టుకోకపోయినా కూడా భాజపా గెలిచే అవకాశాలు ఉండేవి కావని ఖచ్చితంగా చెప్పవచ్చు. కనుక కిషన్ రెడ్డి తన చేతగానితనానికి ఇప్పుడు తెదేపాను నిందించడం హాస్యాస్పదం.

తెదేపాతో పొత్తుని ఆయన నిజంగా అంత తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంటే, అందుకు నిరసనగా అప్పుడే తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసి ఉంటే, భాజపా అధిష్టానం తన నిర్ణయం మార్చుకోనేదేమో? కానీ ఇన్నాళ్ళు అధ్యక్ష పదవిలో కొనసాగినపుడు కూడా తెదేపాతో పొత్తులు తనకు ఇష్టం లేదని గట్టిగా చెప్పకుండా ఇప్పుడు పదవి నుంచి తప్పుకొన్నాక తన అభిప్రాయాలను బయటపెట్టుకోవడం ఏమీ గొప్ప కాదు. తెదేపాతో పొత్తులు అనివార్యమని గ్రహించిన తరువాత అయినా కిషన్ రెడ్డి ఆ పార్టీ నేతలతో కలిసి పనిచేసి ఉండి ఉంటే రెండు పార్టీలకి నేడు ఈ దుస్థితి ఉండేది కాదు. అంటే పార్టీ దుస్థితికి ఆయన కూడా పరోక్షంగా కారణమని అర్ధమవుతోంది.

రాష్ట్ర విభజన విషయంలో ఆంధ్రప్రదేశ్ లో కూడా పార్టీకి నష్టం జరగకూడదనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు రెండు కళ్ళ సిద్దాంతాన్ని అమలుచేసారు. అంటే దానర్ధం ఆయన విభజనకు అంగీకరిస్తునట్లేనని అర్ధమవుతోంది. కానీ ఆ ముక్కని ఆయన తెరాసలాగ స్పష్టంగా చెప్పకపోవడం వలన, ప్రత్యర్ద పార్టీలు దానిని తమ కోణంలో నుంచి చూపించి తెదేపాను దెబ్బ తీసాయి. ఆ కారణంగా దానితో పొత్తులు పెట్టుకొన్న తాము కూడా నష్టపోయామని కిషన్ రెడ్డి వాదన మాత్రం వాస్తవం కాదు. తెలంగాణా రాష్ట్రంలో భాజపా కేవలం హైదరాబాద్ కే పరిమితమని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా చెప్పారు. అటువంటప్పుడు తెదేపాతో పొత్తులు పెట్టుకొన్నా పెట్టుకోకపోయినా ఎన్నికలలో గెలవలేదు.

అయితే కిషన్ రెడ్డి వాదన ఓటుకి నోటు వ్యవహారం బయటపడిన తరువాత తెదేపాతో పొత్తులకు వర్తిస్తుందని చెప్పవచ్చు. ఆ వ్యవహారంతో తెలంగాణా తెదేపా ప్రతిష్ట, విశ్వసనీయత చాలా దెబ్బ తిన్నాయి. అయినా కూడా దానితో కలిసి కొనసాగడం వలన భాజపాపై కూడా ఆ ప్రభావం ఎంతో కొంతపడే ఉంటుంది. ఇప్పుడు తెలంగాణా నుంచి తెదేపా క్రమంగా మాయమవుతోంది కనుక ఇంకా దానితో పొత్తుల గురించి కిషన్ రెడ్డి వంటివాళ్ళు చింతించనవసరం లేదు. ఇంక ఆంధ్రాలో పొత్తుల సంగతే ఆలోచించుకొంటే మంచిది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

గుంటూరులో జగన్ – టీడీపీలో చేరిన జడ్పీ చైర్మన్ క్రిస్టినా !

గుంటూరులో జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ సభ పెట్టి పాత క్యాసెట్ ను తిరగేస్తున్న సమయంలో .. గుంటూరు జడ్పీ చైర్మన్ కత్తెర హెన్రీ క్రిస్టినా వేమూరులో ఎన్నికల ప్రచారసభలో పాల్గొంటన్న చంద్రబాబు...

హైద‌రాబాద్‌, బెంగ‌ళూరుల్లో.. `యునైటెడ్ తెలుగు కిచెన్స్‌` ప్రారంభం

తెలుగు వారి ప‌సందైన రుచుల‌కు పెట్టింది పేరు గోదావ‌రి జిల్లాలు. వెజ్ ఐటంల నుంచి నాన్‌వెజ్ డిషెస్ వ‌ర‌కు.. గోదావ‌రి రుచులు ప్ర‌పంచ వ్యాప్తంగా ఘుమ‌ఘుమ‌లాడుతూనే ఉన్నాయి. దీంతో తెలుగు వారు ఎక్క‌డ...

కోన వెంక‌ట్ రూ.50 కోట్ల ఆశ‌

ఈ రోజుల్లో ఏ సినిమాలో ఎంత స‌త్తా ఉందో ముందే ఊహించ‌డం క‌ష్టం. టిల్లు స్క్వేర్ లాంటి సినిమాలు వంద కోట్లు దాటేసి బాక్సాఫీసుని ఆశ్చర్య‌ప‌రుస్తున్నాయి. అందుకే త‌మ సినిమాల‌కు వంద కోట్లు,...

పులివెందుల బాధ్యతలు భారతికి ఇచ్చిన జగన్ !

పులివెందుల నియోజకవర్గ బాధ్యతలను భారతికి అప్పగించారు సీఎం జగన్. మరో వారం రోజుల్లో నామినేషన్లు ప్రారంభం కానున్న సమయంలో భారతి పులివెందులలోనే మకాం వేయనున్నారు. ఈ నెల ఇరవై ఐదో తేదీన సీఎం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close