స్టేట్‌ గెస్ట్‌హౌస్‌ “గ్రాఫిక్స్” కోసం రూ. 25 లక్షలు చెల్లింపు..!

విశాఖలో నిర్వహించనున్న స్టేట్ గెస్ట్ హౌస్.. ఆకృతులు తయారు చేయడానికి ప్రైవేటు సంస్థను ఎంపిక చేశారు. ఈ మేరకు నిర్వహించిన టెండర్లలో… కేంద్ర ప్రభుత్వ సంస్థ పాల్గొన్నప్పటికీ.. ఆ సంస్థను పక్కన పెట్టి.. ప్రైవేటు సంస్థకు పనులు అప్పగించారు. ఈ సంస్థ.. “స్టేట్ ఆఫ్ ది ఆర్ట్” స్టైల్లో.. స్టేట్ గెస్ట్ హౌస్ అద్భుతంగా ఉండేలా.. ఆర్కిటెక్చర్ రూపొందించి ఇస్తుంది. కాన్సెప్ట్‌ డిజైన్‌, ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ సేవలు అందిస్తుంది. అంటే.. వైసీపీ నేతల మాటల్లో చెప్పాలంటే… “గ్రాఫిక్స్‌”ను తయారు చేసి ఇస్తుంది. ఈ గ్రాఫిక్స్ ఆధారంగా ప్రభుత్వం తదుపరి నిర్మాణానికి చర్యలు తీసుకుంటుంది.

విశాఖ మెట్రోపాలిటన్ నగరాభివృద్ధి సంస్థ వీఎంఆర్డీఏ ద్వారా ఈ నిర్మాణం జరుగుతోంది. విశాఖలో గ్రేహౌండ్స్‌ కొండపై 30 ఎకరాల స్థలంలో విశాలమైన స్టేట్ గెస్ట్‌హౌస్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇది గెస్ట్ హౌస్ కాదని.. ఆ పేరుతో.. విశాఖ పరిపాలనా రాజధానికి తరలిస్తున్నారన్న విమర్శలు కొద్ది రోజుల నుంచి వస్తున్నాయి. ఆ మేరకు హైకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం చేపట్టడాన్నిబట్టి, కార్యనిర్వహక రాజధాని పనులను ప్రభుత్వం చేపట్టినట్టే అని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది.

కౌంటర్ దాఖలు చేయక ముందే నిర్మాణ పనులను వేగంగా ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. రాజ్‌భవన్ కన్నా పెద్దగా… గెస్ట్ హౌస్ ఎందుకని.. అది ఖచ్చితంగా పరిపాలనా రాజధానికి అవసరమైన భవనమేనన్న అనుమానం సాధారణ ప్రజానీకంలో ఏర్పడింది. హైకోర్టులో పిటిషన్లు వేసిన వారు కూడా అదే చెబుతున్నారు. నేరుగా తన చర్యలను న్యాయస్థానం ద్వారా సమర్థించుకోలేక.. ఇలా అడ్డదారుల్లో.. రాజధాని తరలింపునకు ప్రయత్నిస్తోందని అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

అనుప‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో కీర‌వాణి!

బాలీవుడ్ స్టార్ అనుప‌మ్ లో ఓ న‌టుడే కాదు, ద‌ర్శ‌కుడూ ఉన్నాడు. 2002లో ఓం జై జ‌గ‌దీష్ అనే చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఆ త‌ర‌వాత ఇప్పుడు 22 ఏళ్ల త‌ర‌వాత మ‌ళ్లీ...

బెల్లంకొండ పాంచ్ ప‌టాకా!

బెల్లంకొండ సాయి శ్రీ‌నివాస్ య‌మ స్పీడుగా ఉన్నాడు. వ‌రుస‌గా సినిమాల్ని ప‌ట్టాలెక్కిస్తున్నాడు. 'టైస‌న్ నాయుడు' చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. '30 రోజుల్లో ప్రేమించ‌డం ఎలా' ఫేమ్ మున్నాతోనూ ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు...

చివరి క్షణం టిక్కెట్‌తో గుడివాడ అమర్నాథ్‌కు మరిన్ని కష్టాలు !

రాష్ట్ర ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అనూహ్య పరిణామాల మధ్య గాజువాక అసెంబ్లీ టికెట్ ఖాయమైంది. నియోజకవర్గంలో అడుగు పెట్టీ పెట్టగానే ఆయనకు స్థానిక నేతల నుంచి అసంతృప్తి సెగ తగిలింది. నియోజకవర్గంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close