టీవీ చానల్స్ నుంచి కాపాడుకునే దారి చూపించిన రకుల్..!

సినిమాల్లో హీరోయిన్లుగా ఉన్న పాపమో.. ప్రజల్లో ఉండే అటెన్షన్ కారణమో కానీ.. సెలబ్రిటీలపై ఈగ వాలితో మీడియా సంస్థలు హోరెత్తిస్తాయి. ఇక కేసుల్లో పేర్లు వినిపిస్తే ఊరుకుంటాయా..?. ఆ సెలబ్రిటీల మానసిక స్థితి.. వారి కుటుంబసభ్యుల ఆవేదన ఎవరు పట్టించుకుంటారు..? ప్రస్తుత బాలీవుడ్‌లో చాలా మందిది అదే పరిస్థితి. రకుల్ ప్రీత్ సింగ్‌ది అదే. తన పని తాను చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చిన ఆమెను మీడియా వెంటాడింది. కేసు గురించి బయటకు రాగానే షూటింగ్ నుంచి వెళ్లిపోయిందని.. అదనీ.. ఇదనీ రాయడం ప్రారంభించారు. ఈ అతి ఇంగ్లిష్ మీడియాలోనే కాదు.. రకల్ అనే సరికి ..తెలుగులోనే కనిపించింది. దీంతో ఆమె అందరిలా.. ఇంట్లో తలుపులేసుకోలేదు.. కోర్టుకెళ్లింది.

డ్రగ్స్ కేసుకు సంబంధించి మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిందియ. రియా చక్రవర్తి హీరోయిన్స్ రకుల్ ప్రీత్ సింగ్ మరియు సారా అలీఖాన్ పేర్లు వెల్లడించినట్లు ఎన్సీబీ అధికారులు చెప్పినట్లు మీడియా ప్రచారం చేసేస్తోంది. తన పరువుకు భంగం కలిగిసత్ున్నారని.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన రకుల్ ప్రీత్ సింగ్ ఆశ్రయింంచారు. మీడియాలో తనపై వస్తున్న కథనాలు నిలిపివేయాలని పిటిషన్ దాఖలు చేసింది. ఈ వార్తలను మీడియాలో ప్రసారం చేయకుండా సమాచారశాఖకు ఆదేశాలు ఇవ్వాలని పేర్కొంది. రకుల్ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన జస్టిస్ చావ్లా ధర్మాసనం.. మీడియా సంస్థలు స్వీయ నియంత్రణ పాటించాలని సూచిస్తూ పిటిషన్ ను ఫిర్యాదుగా పరిగణించి ఆయా శాఖలు చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది

సినీ తారలపై ఎలాంటి వార్తలు అయినా రాసుకోవచ్చని.. ఆ హక్కు తమకు ఉందని.. మీడియా సంస్థలు భావిస్తూంటాయి. టీఆర్పీల కోసం వారి జీవితాలతో ఆడుకోవడానికి కూడా వెనుకాడటం లేదు. ప్రస్తుతం రియా చక్రవర్తి విషయంలో.. వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. సొంతంగా విచారణలు నిర్వహించేస్తూ.. రాజకీయ ఉద్దేశాలతో మీడియా దిగజారిపోతోంది. దాని బారిన పడకుండా రకుల్ త్వరగానే ప్రయత్నించింది. రకుల్ బాటలోనే మరికొంత మంది న్యాయస్థానాలకు వెళ్లే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ప్రభుత్వ పెద్దల సన్నిహితుల చానల్‌లో మంత్రి వ్యతిరేకత వార్తల అర్థమేంటి..?

తెలంగాణకు చెందిన ఓ మంత్రి రాసలీలలంటూ తెలంగాణ ప్రభుత్వ పెద్దలకు అత్యంత సన్నిహితులయిన రియల్ ఎస్టేట్ వ్యాపారి అధీనంలో ఉన్న న్యూస్ చానల్ హంగామా ప్రారంభించడం టీఆర్ఎస్‌లో కలకలం రేపుతోంది.కొద్దీ రోజులుగా ఆ...

కళ్ల ముందు కనిపిస్తున్న ఇళ్లతో టీడీపీ రాజకీయం..!

పేదలకు 30 లక్షల ఇళ్ల పట్టాలిస్తామంటూ హడావుడి చేసిన వైసీపీ సర్కార్... ఏడాదిన్నర గడిచిపోయినా ఆ దిశగా కనీసం అడుగులు వేయలేకపోయింది. ఆ పేరుతో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అభిప్రాయం...

క్రైమ్ : అత్త – అల్లుడు – వివాహేతర బంధం- హత్య..

సమాజంలో చిత్రమైన నేరాలు అప్పుడప్పుడూ వెలుగుచూస్తూ ఉంటాయి. అలాంటిది హైదరాబాద్‌లో ఒకటి బయటపడింది. ఓ నడి వయసు మహిళ.. ఓ యువకిడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తాను పెళ్లి చేసుకోలేదు కనుక.. కూతుర్ని...

యుద్ధం మొద‌ల‌వ్వ‌క‌ముందే.. తెల్ల‌జెండా ఊపేసిన ర‌జ‌నీ!

క‌రోనా ఎంత ప‌ని చేసిందో? క‌రోనా వ‌ల్ల సినిమా షూటింగులు ఆగిపోయాయి. సినిమా విడుద‌ల‌లూ ఆగిపోయాయి. ఆఖ‌రికి... ఓ సూప‌ర్ స్టార్ రాజ‌కీయ రంగ ప్ర‌వేశానికీ బ్రేకులు ప‌డ్డాయి. ఆ స్టార్...

HOT NEWS

[X] Close
[X] Close