అమెరికా చరిత్రలో ట్రంప్ గొప్ప అధ్యక్షుడవుతాడు: వర్మ

అందరిదీ ఒక దారయితే ఉలిపి కట్టేది మరోకదారన్నట్లు, అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా పోటీ పడుతున్న  డోనాల్డ్ ట్రంప్ నోటి దురుసుతనం చూసి, యావత్ ప్రపంచ దేశాలు విమర్శిస్తుంటే. మన రాం గోపాల్ వర్మకి మాత్రం ఆయన అమెరికా చరిత్రలోనే గొప్ప అధ్యక్షుడుగా నిలిచిపోయే వ్యక్తిగా కనబడుతున్నారుట. అది కూడా అబ్రహం లింక, జాన్ ఎఫ్ కెనడీలంత గొప్ప అధ్యక్షుడుగా గుర్తింపు తెచ్చుకొంటారని తన తాజా ట్వీట్ మెసేజులో అభిప్రాయం వ్యక్తం చేసారు.

డోనాల్డ్ ట్రంప్ మీద వర్మకి అంత గొప్ప అభిప్రాయం ఎలా కలిగిందో కూడా అయన వివరించి ఉండి ఉంటే బాగుండేది. వర్మ ఆయనను మెచ్చుకొన్న సమయంలోనే ఆయన మళ్ళీ ముస్లింల పట్ల చాలా అవమానకరమైన వ్యాఖ్యలు చేసారు. అమెరికాలోకి ముస్లింలను రానివ్వకూడదని, దేశంలో ఉన్న అక్రమ వలసదారులను అందరినీ తక్షణమే వెనక్కి త్రిప్పి పంపేయాలని అన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

భయపెడుతోన్న ఎండలు…వాతావరణ శాఖ బిగ్ అలర్ట్

ఎండలతో తెలుగు రాష్ట్రాలు కుతకుత ఉడుకుతున్నాయి. బయటకు వెళ్లేందుకు జనం జంకుతున్నారు. పగలూ, సాయంత్రం అనే తేడా లేకుండా ఉక్కపోత సెగలు పుట్టిస్తోంది.ఈ క్రమంలోనే వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. రానున్న...

ఈవీఎం, వీవీ ప్యాట్ పిటిషన్లపై సుప్రీం కీలక తీర్పు

లోక్ సభ ఎన్నికల వేళ ఈవీఎం-వీవీప్యాట్‌కు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. వీవీప్యాట్‌ స్లిప్పులతో ఈవీఎం ద్వారా పోలైన ఓట్లను వందశాతం సరిపోల్చాలనే పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. జస్టిస్...

పోలింగ్ ముగిసిన తర్వాత ట్యాపింగ్ కేసులో అసలైనఅరెస్టులు !

ఎన్నికల హడావుడి తగ్గిన తర్వాత ట్యాపింగ్ కేసులో ఎన్నో బ్రేక్ డాన్సులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పెషల్‌ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా పనిచేసిన ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close