ఇక్కడ మరో ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలు జంప్!

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమం పోటా పోటీగా జరుగుతోంది. ఏపీలో స్కోర్ 6 ఎమ్మెల్యేలు, ఒక్క ఎమ్మెల్సీ కాగా, తెలంగాణలో పార్టీ ఫిరాయించిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య 10గా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో ముగ్గురు క్యూలో ఉన్నట్లు తెలుస్తోంది. గ్రేటర్ హైదరబాద్‌లోని జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య జంప్ అవబోతున్నారని ఒక ఆంగ్ల పత్రిక ఇవాళ పెద్ద కథనాన్ని ఇచ్చింది. మార్చి 10న ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాలకు ముందే వీరు గోడ దూకబోతున్నారని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఆ కథనమే నిజమైతే టీడీపీలో రేవంత్ రెడ్డి, ఆర్.కృష్ణయ్య ఇద్దరే మిగులుతారు. ఈ ఇద్దరిలో కృష్ణయ్య ఇప్పటికే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. తాను టీడీపీకి, టీఆర్ఎస్‌కు రెండింటికీ దూరంగా ఉంటానని ఆయన చెప్పారు. అధికారాన్ని అనుభవించటానికే టీడీపీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లోకి వెళుతున్నారని అన్నారు. తాను స్వతంత్ర అభ్యర్థిగా కొనసాగుతానని చెప్పారు. మరోవైపు మాగంటి గోపీనాథ్ మాత్రం ఈ ఊహాగానాలను ఖండిస్తున్నారు. తాను టీడీపీలోనే కొనసాగుతానని చెప్పారు. టీఆర్ఎస్ నాయకులు దీనిపై పుకార్లు వ్యాపింపజేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నారని ఆరోపించారు. మొత్తంమీద చూస్తుంటే టీఆర్ఎస్‌లో టీడీపీ విలీనం అనివార్యమనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పుష్ప రిలీజ్ డేట్‌…. త‌గ్గేదే లే!

డిసెంబ‌రులో పెద్ద సినిమాల జాత‌ర రాబోతోంది. అఖండ‌తో డిసెంబ‌రు జోరు మొద‌లు కాబోతోంది. డిసెంబ‌రు 17న పుష్ప‌, ఆ త‌ర‌వాత శ్యాం సింగ‌రాయ్ రాబోతున్నాయి. అయితే పుష్ప రిలీజ్‌కొంచెం క‌ష్ట‌మ‌ని, డేట్ మారే...

జాతీయ అవార్డు గ్ర‌హీత‌.. శివ శంక‌ర్ మాస్ట‌ర్ మృతి

తెలుగు చిత్ర‌సీమ మ‌రో ప్ర‌తిభావంతుడ్ని కోల్పోయింది. క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రో క‌ళాకారుడ్ని బ‌లి తీసుకుంది. ప్ర‌ముఖ నృత్య ద‌ర్శ‌కుడు శివ శంక‌ర్ మాస్ట‌ర్ ఈరోజు తుది శ్వాస విడిచారు. గ‌త కొంత‌కాలంగా ఆయ‌న...

దేశంలో ఇక “ఒమిక్రాన్” అలజడి !

కేంద్ర ప్రభుత్వం ఒమిక్రాన్ విషయంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. అయితే ఆఫ్రికా దేశాల నుంచి వస్తున్న విమానాల విషయంలో మాత్రం ఆంక్షలు విధించలేదు. ఇప్పటికే ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు బయటపడిన దేశాల నుంచి...

సీఎస్‌గా సమీర్ శర్మ మరో ఆరు నెలలు !

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆరు నెలల పొడిగింపు ఇచ్చింది. బెంగాల్‌లో చీఫ్ సెక్రటరీ పొడిగింపు వ్యవహారం వివాదాస్పదం కావడంతో ఇక ఏ రాష్ట్రంలోనూ చీఫ్ సెక్రటరీల...

HOT NEWS

[X] Close
[X] Close