పంజాబ్ కూడా ప్రత్యేక హోదా కోరుతోంది: వెంకయ్య

కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు ఇవ్వాళ్ళ లోక్ సభలో మాట్లాడుతూ “దేశంలో పంజాబ్ వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాలు సైతం ప్రత్యేక హోదా కోరుతున్నాయని అది తగదు. ప్రత్యేక హోదా కోసం దేశంలో చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. దేశ సమగ్రతను, అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ లోటు ఉన్నందునే నేను ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్నాను. రాష్ట్ర విభజన కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మళ్ళీ తన కాళ్ళ మీద తను నిలబడాలంటే వేగంగా అభివృద్ధి చెందాలి. అందుకే దానికి ప్రత్యేక హోదా అవసరం. కానీ ఆ ప్రతిపాదన ఇంకా నీతి ఆయోగ్ పరిశీలనలో ఉంది,” అని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని కోరుకొనేవారిలో వెంకయ్య నాయుడు ప్రప్రధముడు. అందుకోసం తన శక్తివంచన లేకుండా ప్రయత్నం చేసారు. కానీ ఇప్పుడు ఆయన చెపుతున్న కారణాల వల్లనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కడం లేదని మరోమారు స్పష్టం అయ్యింది. కానీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, ప్రధాని నరేంద్ర మోడి కూడా హామీ ఇచ్చి ఉన్నందున, ఇప్పుడు ఇవ్వలేమని కుండ బద్దలు కొట్టినట్లు చెపితే, దాని వలన రాష్ట్రంలో బీజేపీకి తీరని నష్టం వాటిల్లుతుంది. ఈ సమస్యకు తరుణోపాయంగా దానిని తీసుకు వెళ్లి నీతి ఆయోగ్ టేబిల్ మీద పడేసి మోడీ చేతులు దులుపుకొన్నారు. నీతి ఆయోగ్ అధికారులు ఆ ప్రతిపాదనను భద్రంగా ప్యాక్ చేసేసి అటక మీద పడేశారు. కనుక ప్రధాని నరేంద్ర మోడి లేదా వెంకయ్య నాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని కానీ ఇవ్వమని గానీ ఖచ్చితంగా చెప్పరు. కానీ ఇవ్వడం సాధ్యం కాదనే విషయం ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విధంగా చెపుతూనే ఉన్నారు. ప్రజలే అర్ధం చేసుకోవాలి మరి. బహుశః మళ్ళీ వచ్చే ఎన్నికల సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని అటకమీద నుండి దుమ్ము దులుపి దించి, మళ్ళీ మరోమారు తమకే ఓటేస్తే ఈసారి తప్పకుండా ప్రత్యేక హోదా ఇచ్చేస్తామని హామీ ఇస్తారేమో?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close