సోనియా, రాహుల్ గాంధీలకు డిల్లీ హైకోర్టులో చుక్కెదురు!

రాజకీయ పార్టీలకి మీడియాకి ఉన్న అవినాభావ సంబందం గురించి కొత్తగా చెప్పుకొనవసరం లేదు. ఇప్పుడు కొన్ని రాజకీయ పార్టీలు నేరుగా తమ స్వంత మీడియానే ఏర్పాటు చేసుకొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ కూడా బహుశః అటువంటి ప్రయత్నంలోనే నేషనల్ హెరాల్డ్ పత్రికకి 2010 సం.లో రూ. 90 కోట్ల రుణం ఇచ్చినట్లుంది. కానీ ఆ పత్రిక మూతపడటంతో ఆ డబ్బును తిరిగి రాబట్టుకోలేక దానిని వసూలు చేసుకొనే హక్కును కారుచవకగా యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీకి రూ.50 లక్షలకే అమ్మేసింది. కానీ ఆ నిధులను కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలు చాలా తెలివిగా ఈవిధంగా తమ ఖాతలలోకి మళ్ళించుకొన్నారని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి ఆరోపిస్తూ డిల్లీ మాజిస్ట్రేట్ కోర్టులో ఒక పిటిషన్ వేశారు.

సోనియా, రాహుల్ గాంధీలతో బాటు సుమన్ దూబే, మోతీలాల్ వోరా, ఆస్కార్ ఫెర్నాండెజ్, శ్యాం పిట్రోడా, యంగ్ ఇండియా లిమిటెడ్ కంపెనీలను ప్రతివాదులుగా తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఆ పిటిషన్ని విచారణకు చేపట్టిన కోర్టు వారందరినీ వ్యక్తిగతంగా కోర్టుకి హాజరుకావలసిందిగా ఆదేశించింది. సోనియా, రాహుల్ గాంధీ ఇరువురూ కోర్టు ఆదేశాలను డిల్లీ హైకోర్టులో సవాలు చేస్తూ తమకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని అభ్యర్ధించారు. కానీ వారి అభ్యర్ధనను డిల్లీ హైకోర్టు కూడా తిరస్కరించింది. కేసు విచారణలో కొన్ని ప్రశ్నలకు వారిరువురు స్వయంగా సమాధానం చెప్పవలసి ఉన్నందున తప్పనిసరిగా కోర్టుకు హాజరు కావలసిందేనని తీర్పు చెప్పింది. కనుక వారిరువురూ మళ్ళీ నేడు సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేసి హైకోర్టు తీర్పును సవాలు చేసి, వ్యక్తిగత మినహాయింపు ఇవ్వాలని కోరబోతున్నారు. ఒకవేళ సుప్రీం కోర్టు కూడా వారి అభ్యర్ధనను తిరస్కరించినట్లయితే వారిరువురూ తప్పనిసరిగా కోర్టు వాయిదాలకు హాజరు కావలసి ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

కడప అసెంబ్లీ రివ్యూ : టీడీపీ గెలుపు ఖాయమని ఉద్ధృతంగా మౌత్ టాక్ !

రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన...

ఇక ఏపీలో ఆస్తి కొంటే జిరాక్సులే !

ఆంధ్రప్రేదశ్ ప్రభుత్వం ఆస్తుల రిజిస్ట్రేషన్లలో కొత్త పద్దతి ప్రవేశ పెట్టింది. ఇక నుంచి ఎవరికీ అక్కడ అసలైన పత్రాలివ్వరు. జిరాక్సులు మాత్రమే ఇస్తారు. వాటితోనే లావాదేవీలు నిర్వహించుకోవాలి. ఈ డేటా ,...

కరెంట్‌తో కితకితలు పెట్టుకుంటున్న బీఆర్ఎస్

బీఆర్ఎస్ పార్టీలో పై నుంచి కింది స్థాయి వరకూ ఎవరూ నేల మీదకు దిగడం లేదు. బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన ఐదు నెలల్లోనే ఏదో జరిగిపోయిందని ప్రజల్ని నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. తామున్నప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close