బన్నీ కథతో రామ్ సినిమా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అంటే ప్రత్యేకమైన క్రేజ్.. మెగా అభిమానులే కాదు సగటు సిని ప్రేమికుడు కూడా అల్లు అర్జున్ సినిమాలు చూడటానికి ఇష్టపడతారు. అందుకే బన్నీతో చేయడానికి దర్శక నిర్మాతలు ఎప్పుడు ముందుంటారు. ప్రస్తుతం అల్లు అర్జున్ చేస్తున్న సినిమా ‘సరైనోడు’.. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

రామ్ కు ‘కందిరీగ’ లాంటి హిట్ ఇచ్చిన దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి కథ వినిపించాడట. కథ బాగున్నాసరే ఎన్టీఆర్ తో రభస హిట్ అయితేనే గాని ఛాన్స్ ఇవ్వనన్నాడట బన్నీ.. రభస ఎన్టీఆర్ రేంజ్ సినిమా కాదని విమర్శులు దుమ్మెత్తి పోశారన్న సంగతి తెలిసిందే. ఇక దాని ఫలితం చూసిన అల్లు అర్జున్ సంతోష్ శ్రీనివాస్ కి సారీ చెప్పాడట. అయితే ఇప్పుడు ఆ కథనే రామ్ హీరోగా తెరకెక్కించే ప్రయత్నాలు చేస్తున్నాడు దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.

తనకి హిట్ ఇచ్చిన దర్శకుడు కాబట్టి ఎనర్జిటిక్ హీరో రామ్ కు సంతోష్ శ్రీనివాస్ మీద పూర్తి నమ్మకం ఉంది. అందుకే ప్రస్తుతం తీస్తున్న ‘నేను.. శైలజా’ విడుదల కాగానే ఆ సినిమా ముహుర్తం పెట్టబోతున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. బన్నీతో సినిమా అనుకున్నప్పుడు సినిమా టైటిల్ ‘తిక్కరేగితే’ అని అనుకున్నాడట సంతోష్ శ్రీనివాస్ మరి అదే టైటిల్ తో రామ్ సినిమా తీస్తాడా లేక టైటిల్ మారుస్తారా అన్నది సినిమా మొదలైన తర్వాత కాని తెలుస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close