అమరావతి సురక్షితమైన రాజధాని అవుతుందా?

రాజధాని అమరావతి మాస్టర్‌ప్లాన్ ను డిసెంబరు 25వతేదీన నోటిఫై చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు భూములు ఇచ్చే ప్రదేశం, ప్రభుత్వ భవనాలు, పార్క్‌లు, కమర్షియల్‌ ప్రాంతాలను అపుడే ప్రకటిస్తారు.

రాజధాని ప్రాంతంలో కీలక కేంద్రమైన తుళ్ళూరు లోతట్టు ప్రాంతం. ఆకస్మికంగా గంటనుంచి మూడుగంటల సేపు మాత్రమే వుండే కొండవాగు ఆకస్మిక వరదల వల్ల తుళ్ళూరు మండలంలో సగం పొలాలు మునిగిపోవడం మూడునాలుగేళ్ళకు ఒకసారి జరుగుతున్నదే. అవి మెత్తటి రేగడినేలలు. పది పదిహేను అడుగులలోతులోనే నీళ్ళు పడతాయి. అలాంటి చోట సింగపూర్ నమూనా ఆకాశంలోకి చొచ్చుకపోయేటంత ఎత్తైన, భారీ భవనాల నిర్మాణం సురక్షితమేనా, శ్రేయస్కరమేనా?

అమరావతి ప్రాంతంలో శాశ్వతమైన నిర్మాణాలు చేయకూడదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ శంకుస్థాపనకు ముందే ఇచ్చిన ఆదేశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పట్టించుకున్నట్టులేదు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామసభలు జరిపి, రైతుల ఆమోదం, అంగీకారం తీసుకుని ఆతీర్మానాలను పంపితేనే పర్యావరణ శాఖ అనుమతులు ఇస్తుంది. అయితే గ్రామసభలు నిర్వహించే ఆలోచన రాష్ట్రప్రభుత్వానికి లేదని తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ లో సముద్రతీరప్రాంతం 50 ఏళ్ళుగా భూమిలో ప్రకంపనలు నమోదౌతున్నాయి. ప్రకంపనల సైజుపెరుగుతూవుండటాన్ని బట్టి ఎప్పటికైనా ఇది భూకంపాల ప్రాంతమౌతుందని కేంద్ర భూగర్భ అధ్యయనాలు చాలాకాలం క్రితమే హెచ్చరించాయి.

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం గురించి కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామకృష్ణన్ 13 జిల్లాలలో శీతోష్ణస్థితి సామాజిక రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, అభివృద్ధికి సంబంధించిన అసమానతలు అధ్యయనం చేసిన కృష్ణా, గుంటూరు జిల్లాలలోని ప్రాంతాలు రాజధానికి అనువైనవి కాదని నివేదిక ఇచ్చారు. ఈ ప్రాంతానికి భూకంప ప్రమాదాల పైనివేదికను కూడా ఆరిపోర్టులో పొందుపరిచారు. సముద్ర తీరానికి దూరంగా ఎత్తయిన ప్రాంతం రాజధానికి అనువైనదని కూడా సూచించారు. ప్రకాశం జిల్లాలోని దొనకొండ ప్రాంతం లేదా రాయలసీమ జిల్లాలలో ఏ ప్రాంతంలోనైనా రాజధాని నిర్మించుకో వచ్చునని సిఫారసు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ సిఫార్సులను చెత్తబుట్టలో వేసినట్టుగా తన ధోరణిలో అమరావతి నిర్మాణానికి పూనుకున్నారు.

హైదరాబాద్ అనుభవం తరువాత అభివృద్ధి ఒకే చోట కేంద్రీకరించకూడదని సామాన్య ప్రజలుకూడా భావిస్తున్నారు. చంద్రబాబు కూడా వికేంద్రీకరణ గురించే పైకి చెబుతున్నా ఆచరణ చూస్తే మొత్తం ఫోకస్ అమరావతి మీదేనన్న అభిప్రాయం కలుగుతోంది. వికేంద్రీకరణ, కేంద్రీకరణ అంశాన్ని పక్కన పెట్టినా ఇపుడు నిర్ణయమైన రాజధాని ప్రాంతం ఎంతవరకూ సురక్షితం అని రాజకీయపార్టీలు ప్రశ్నించడంలేదు. నిపుణుల అభిప్రాయాలను ఉదాహరిస్తూ ప్రజలకు విషయం వివరిస్తున్న సామాజిక కార్యకర్తల ప్రశ్నలకు ప్రభుత్వంతో సమాధానాలు చెప్పించగల బలం చాలడం లేదు.

రాజధాని నిర్మాణానికి అమరావతి సురక్షిత ప్రాంతమేనన్న నిపుణుల నివేదికలు ప్రభుత్వం వద్ద ఇప్పటికే వుంటే వాటిని వెల్లడించడం కనీస బాధ్యత. అందవల్ల సామాజిక సంస్ధలనుంచి ప్రభుత్వానికి మద్దతు దొరుకుతుంది కూడా!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉత్తరాంధ్ర… ‘అధికార’ నిర్ణయాంధ్ర !

రాజకీయంగా ఎంతో చైతన్యంగా ఉండే ప్రాంతాల్లో ఉత్తరాంధ్ర జిల్లాలు ముందు వరుసలో ఉంటాయి... ఏదో ఒక మూలకు విసిరేసినట్లు ఉన్నప్పటికీ... ఈ మూడుజిల్లాలు... నేడే కాదు, నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా......

భీమిలి… ‘గంటా’ మజిలీ!

మాజీ మంత్రి, TDP నాయకుడు గంటా శ్రీనివాసరావు... వాస్తవానికి విశాఖ జిల్లాకు వలస వచ్చిన నాయకుడే అయినా... దాదాపు పాతికేళ్ళుగా ఓటమి ఎరుగని నాయకుడుగా ఉండటంతో స్థానికుడు అయిపోయాడు. ఎన్నికలు వస్తున్నాయి అంటే......

గుండు సున్నా కావాలా.. గుండె ధైర్యం కావాలా… ఇందూరు గడ్డపై కేసీఆర్ గర్జన

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ రోడ్ షోలో పాల్గొన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బీజేపీపై నిప్పులు చెరిగారు. నరేంద్ర మోడీ పాలనలో అచ్చేదిన్ కాదు... సచ్చేదిన్ వచ్చిందని మండిపడ్డారు. ప్రధాని మోడీ...

బటన్ల నొక్కిన డబ్బులపై వైసీపీ డ్రామా ఫెయిల్

ఏపీ లో అధికార పార్టీకి పుట్టెడు తెలివితేటలు. ఓటర్లకు తాము పంచే డబ్బులు కాకుండా పెండింగ్ పెట్టిన డబ్బులు వేయాలని అనుకున్నారు. చివరికి ఎటూ కాకుండా పోయింది. చేయూత సహా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close